Jump to content

So Sad. RIP


Recommended Posts

Posted
నేనే ముందు చనిపోతే ఏం చేస్తావంటూ సరదాకి భర్తను అడిగేదా భార్య.. కానీ నిజంగానే జరగడంతో..

10/25/2019 7:56:42 AM

 
637075870024189730.jpg
ప్రేమ, ఒంటరితనమే.. చిదిమేశాయి..!
డెంగ్యూతో మరణించిన భార్య.. తట్టుకోలేకపోయిన భర్త
నాలుగేళ్ల కుమార్తె సహా ఉరివేసుకుని ఆత్మహత్య
తల్లి లేని జీవితం తనబిడ్డకు వద్దని మనోవేదన
మండపేటలో విషాధకర సంఘటన
19రోజుల వ్యవధిలోనే కుటుంబమంతా విచ్ఛిన్నం
తండ్రి, అత్త, చెల్లిలకు వేర్వేరుగా లేఖలు
ఆస్తులు, ఆర్థిక అంశాలు అన్నీ పొందుపొరిచిన వైనం
 
మండపేట (తూర్పు గోదావరి జిల్లా): అందరికీ నమస్కారం...
‘నేను చేసిన పనికి అందరూ నన్ను పిరికివాడు, చేతకానివాడు అని అనుకోవచ్చు. కానీ నా ప్రాణం నన్ను వదిలేసి వెళ్లిపోయాక, బతుకు శూన్యంలా కనిపిస్తున్న ఈ తరుణంలో నేను చేస్తున్న ఈ పని నాకు తప్పనిపించడం లేదు. ...నేను వెళ్లిపోయి నా కూతురుని వదిలేస్తే అది ఇంకా బాధలు పడుతుంది. అందుకే దానిని కూడా తీసుకెళ్తున్నాను... తను లేని దగ్గరి నుండి నాకు ప్రతీ క్షణం నరకంలాగే ఉంది. మా పెళ్లయిన దగ్గర నుండి తను నాకు తల్లిలా, స్నేహితునిలా, భార్యలా, అన్ని విషయాలలో సహకరించేది. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు (తల్లి, స్నేహితుడు, భార్య) దూరమైతే నాకు ఇంక బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది. తను నాతో ఉన్నది నాలుగేళ్లు. కానీ తను రాక ముందు నా జీవితంలో ఏం జరిగిందో మర్చిపోయేలా చేసింది. ఇప్పుడు తనతో ఉన్న క్షణాలు తప్ప ఇంకేం గుర్తు రావట్లేదు. ఎక్కడికెళ్లినా తనే కనిపిస్తుంది. రాజమండ్రిలో అస్తికలు కలపడానికి వెళ్తే కూడా దారిలో కనపడిన ప్రతీ చోట మొన్నే కదా ఈ పక్కకు వచ్చాము. ఇక్కడ ఇలా చేశాము. ఇక్కడ ఇది కొనుక్కున్నాము ఇవే జ్ఞాపకాలు.. నావల్ల కావట్లేదు...’
 
 
ఇదీ భార్య దూరమై ఒంటరితనం అనుభవిస్తున్న ఓ భర్త రాసిన లేఖ.. ఆత్మహత్యకు పాల్పడేముందు తన వాళ్లకు తన బాధను వివరిస్తూ రాసిన లేఖ.. నాలుగేళ్ల కూతురు ఒంటరిదై బాధలు పడుతుందేమోనన్న భయంతో.. ఆ పసిపాపనూ తనతో తీసుకెళ్తున్నానంటూ రాసిన లేఖ..
 
 
అదో అందమైన కుటుంబం. వారిద్దరు.. వారికొక అమ్మాయి. అతడు కష్టపడి పైకొచ్చాడు. స్వశక్తితో ఎదిగాడు. అది ఆమెకు నచ్చింది. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా అతడినే పెళ్లాడతానని పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లు గడిచాయి. ఈలోపు వారికో పాప. కుటుంబం ఆనందంగా సాగుతున్నప్పుడు గుండెల్ని పిండేసే కష్టం.. మూడు పదుల వయస్సు కూడా నిండని భార్యకు డెంగీ జ్వరం. రోజుల్లోనే పీడ కలలా ఆమె జీవితం ముగిసిపోయింది. అతడు, అతని కూతురు. ఇద్దరే మిగిలారు. పాప తల్లి కావాలని ఏడుస్తోంది. ఏం చెప్పాలో తెలియని వేదన అతనిది. కుంగిపోయాడు. తనకే ఎందుకింత కష్టం వచ్చిందని విలవిల్లాడాడు. ఎవరికీ చెప్పుకోలేక.. కుమిలిపోయాడు. తను, తన కూతురు వెళ్లిపోవడమే సరైన దారనుకున్నాడు. అన్ని వివరాలతో అయిన వాళ్లకు లేఖలు రాశాడు. తమ గుండెల్లోని వేదననంతా ఆ అక్షరాల్లో లిఖించాడు. ‘నా ప్రాణం నన్ను వదిలివెళ్లాక.. నేను చేస్తున్న ఈ పని తప్పనిపించడం లేదు’ అంటూ వీడ్కోలు పలికాడు. అత్యంత దుఃఖభరితమైన ఈ విషాదం మండపేటలో జరిగింది. తండ్రి తన కూతురుతో సహా గురువారం బలవన్మరణం చెందాడు.
 
 
భార్య మరణం తట్టుకోలేక ఆమె తనువు చాలించిన 19రోజులకే తన బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. మండపేటలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలను మండపేట పట్టణ సీఐ ఎస్‌.నాగమురళీ తెలిపారు. అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన బాదం చందనకుమార్‌(35) తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మండపేటలోని తన అమ్మమ్మ ఇంటికి చెల్లితో కలిసి పదేళ్లకిత్రం వచ్చేశాడు. స్థానికంగా ఫ్లెక్సీ డిజైనింగ్‌, ప్రింటింగ్‌ పని నేర్చుకుని చెల్లికి పెళ్లిచేశాడు. రావులపాలెం మండలం కోమరాజులంకకు చెందిన యువతి నవ్యను ఐదేళ్లక్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ నాలుగేళ్ల కుమార్తె యెషిత(4) ఉంది. వీరు మండపేట పట్టణంలోని నాళం వారి వీధిలో తన భార్యతో కలిసి ఉండేవారు. చందు ఫ్లెక్స్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతూ జీవిస్తున్నాడు.
 
 
డెంగ్యూతో కుటుంబం నాశనం
ఇటీవల చందు భార్యకు డెంగ్యూ జ్వరం వచ్చింది. దీంతో ఆమెను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి ఆమె ఈనెల 5న మరణించింది. అప్పటినుంచి చందు ఇంట్లో కూమార్తెతో ఒంటరిగా ఉంటున్నాడు. భార్య మరణం తర్వాత బంధువులు అతడ్ని రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినా చందు అంగీకరించలేదు.
 
 
ముగ్గురికి ఆస్తుల విభజన
ఓ ఐదు పేజీల లేఖను తండ్రి, అత్త, చెల్లిల పేరిట రాసి ప్రధానంగా చాలా విషయాలు వెల్లడించాడు. తన ఆస్తులు వారి ముగ్గురికీ విభజన చేశాడు. తాను పెళ్లి చేసుకుని భార్యకు పిల్లలు పుడితే తన భార్య నవ్యలా తన కూమార్తె పరిస్థితి వస్తుందని రాశాడు. తనకు రెండోపెళ్లి ఇష్టంలేదని, తన కూతురును వాళ్ల అమ్మమ్మ ఇంటికి పంపించడం ఇష్టం లేదని, తన కుమార్తె ఎపుడూ అమ్మ నాన్న పాప అంటుంది. అమ్మ ముందు వెళ్లిపోయింది, తర్వాతే తామిద్దరం వెళ్లిపోతున్నామని తెలిపాడు. ముందు నేను చనిపోతే మీరు ఏం చేస్తారంటూ భార్య తరచూ అనే మాటను లేఖలో ప్రస్తావించాడు. నీకంటే ముందు నేనే వచ్చేస్తానని చెప్పేవాడినని, కనీసం దినం కూడా చేయరా అంటూ భార్య సరదాకో.. ఎందుకో అంటూ ఉండేదని, ఇపుడు ఆమె ముందు వెళ్లిపోయిందని చందు లేఖలో రాశాడు. ఆమె కోరిక ప్రకారం తన మరణం తర్వాత అన్ని పూర్తి చేశానని, తన ఆర్థికపరమైన విషయాలు కూడా వివరంగా రాశాడు. తాను ఎవరికీ అప్పులేనని, ఎవరికి ఏమివ్వాలో, ఎవరికి ఎలా చెందాలో కూడా స్పష్టంగా రాసి సంతకం చేశాడు.
 
 
తండ్రికి రాసిన లేఖ..
‘డాడీ నన్ను క్షమించండి.. ఈ వయసులో మిమ్మల్ని బాధపెట్టి నేను వెళ్లిపోతున్నాను. అంతా బాగుందనుకున్న సమయంలో ఇలా జరగడం ఉహించలేనిది. నా చిన్న తనంలో మా అమ్మ చనిపోయింది. మీరు రెండో పెళ్లి చేసుకున్నారు. నేను, చెల్లి అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగాం.. నా కూతురికి నా పరిస్థితి రాకూడదనే నేను రెండో పెళ్లికి అంగీకరించలేదు. నా భార్యను మర్చిపోయి నేను మరో వ్యక్తితో జీవించలేను. మన వంశానికి ఉన్న శాపం నాతో పోవాలి.  కొంత బంగారం, వెండి వస్తువులు కవరులో పెడుతున్నాను. ఇంట్లో అన్ని సామన్లు, షాపులో జిరాక్స్‌ మిషన్‌ మీరే తీసుకోండి. ఏసీ మాత్రం లత(చెల్లి)కి ఇవ్వండి. కింద షాపులో ఉన్న మిషన్‌ అమ్మితే అప్పులు పోను రూ.లక్ష మిగులుతుంది. అదీ మీరే తీసుకోండి. నా కార్యక్రమాల కోసం నా బండి అమ్మేయండి.. నాకు డబ్బులు ఇవ్వాల్సినవాళ్ల లిస్టు పెడుతున్నాను. రెండూ కలిపి రూ.65వేల వరకు వస్తాయి..’ అంటూ రాసి ఈ నెలాఖరులోపు ఇల్లు, షాపు ఖాళీ చేయాల్సిందిగా కోరాడు.
 
 
చెల్లికి రాసిన లేఖ
‘లత నేను వెళ్లిపోతుంటే ఎక్కువగా బాధపడేది నీ గురించే. నువ్వు గుండె ధైర్యం చేసుకుని జాగ్రత్తగా ఉండు. నా డబ్బులతో కొన్న బంగారం, వెండి కవర్‌లో పెడుతున్నాను. బావగారు నా భార్య పేరున ఇప్పనపాడులో రెండు సెంట్లు సైట్‌ కొన్నాను. దాని విలువ రూ.5లక్షలుపైబడే ఉంటుంది. దాన్ని వీలైనంత త్వరగా అమ్మేసి నా మేనకోడలు విన్మయి పేరున డిపాజిట్‌ చేయండి. దీని నిమిత్తం విజయనగరంలోని చినమావయ్యవద్ద రూ.లక్ష తీసుకున్నాను. మరో మావయ్య దగ్గర చీటీవేశాను. అది రూ.60వేలు వస్తుంది. నా భార్యకు చికిత్స చేయించిన ఆస్పత్రినుంచి రూ.40 వేల వరకు వస్తుంది. అంతా కలిపి ఆ రూ.లక్ష అప్పు తీర్చేయండి. నా పేరు మీద ఉన్న ఎల్‌ఐసీ పాలసీలు, బ్యాంక్‌ అకౌంట్‌లు చిన్న పుస్తకంలో రాసి పెడుతున్నాను. ఒరిజినల్స్‌ కవర్‌లో పెడుతున్నా. అన్నీ కలిపి నా మేనకోడలు పెళ్లికి మేనమామగా నాకు తోచినది ఇచ్చిన తృప్తి నాకు లభిస్తుంది.’
 
 
అత్తమామలకు..
‘అత్తయ్య, నానమ్మలకు నమస్కారం. మీరు వద్దంటున్నా వినకుండా మీకు ఇష్టం లేకుండా నవ్య నన్ను పెళ్లి చేసుకుంది. దానికి నన్ను మీరు క్షమించండి. మీ కూతురును దూరం చేశానని మీరు అనుకోవచ్చు. ఇందులో నేనే కావాలని చేసింది ఏమీ లేదు. కానీ మీ అమ్మాయి నాతో ఉన్నంతకాలం మిమ్మల్ని మరిచిపోయేంత హ్యాపీగా ఉంచగలిగాను. తను జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చి వెళ్లిపోయింది. మరోసారి పాపను పెంచే బాధ్యత మీకు అప్పగించదలచుకోలేదు. మీ వయసు సహకరించదు. తన డైరీలో ఒక పేజీ మీ గురించి రాసింది చదవండి. మీ అమ్మాయి తెచ్చుకున్న బంగారం కవర్‌లో పెడుతున్నా.. మీ అమ్మాయిని ఎలాగో తిరిగివ్వలేను.. కనీసం ఈ బంగారాన్నైనా ఆమె గుర్తుగా మీరే తీసుకోండి..’ అని రాశాడు.
 
 
అసలు ఏమైంది..?
చందుకు ఎక్కడికి వెళ్లినా భార్య జ్ఞాపకాలే గుర్తుకు వచ్చేవి. ఆమె వెళ్లిపోవడంతో అతడికి అంతా శూన్యంలా కనిపించింది. ఒంటరితనం అలముకుంది. ఈ నేపథ్యంలో ఇక మరణించడమే మేలనుకున్నాడు. తన బిడ్డ ఎవరికీ భారం కాకూడదని, ఆమె తనలా, తన భార్యలా కాకూడదని భావించాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం చందు తన కుమార్తె మరణించేలా చేశాడు. తలగడతో నొక్కాడా.. కూల్‌డ్రింక్‌లో విషం కలిపాడా అన్నది తెలియలేదు. ఆమె మృతి చెందిందని ధ్రువీకరించుకున్నాక తాను ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం చందు సోదరి లత కోరుకొండనుంచి ఫోన్‌ చేయగా ఎంతకి తీయకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చందు షాపు పక్కనే ఉండే వేరే వ్యక్తికి ఫోన్‌ చేసింది. అతడు ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా తెరవకపోవడంతో కిటికీలోంచి చూడగా చందు ఉరివేసుకుని, చిన్నారి మంచంపై విగత జీవులుగా పడి ఉండడాన్ని చూశాడు. ఆమె విషయం తెలిపి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనా ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు తాను, తన బిడ్డ ఎందుకు మరణించాం, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయన్నదానిపై ఐదు పేజీల సుదీర్ఘలేఖను డీటీపీ చేసి తన సంతకం చేశాడు.
 
 
కేసు నమోదు
సంఘటనా ప్రదేశంలో విగత జీవులైన తండ్రీ, కుమార్తెలను చూసిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. 19రోజుల క్రితం భార్య చనిపోగా ఇప్పుడు ఈ ఘటన జరగడం బాధాకరమని, ఈ ఘటనను స్థానికులు వారి బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడు చందు రాసిన లేఖ ప్రతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై మండపేట సీఐ నాగమురళీ కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Posted

elaagu vaalla life mugimpu seyyali anukunevallu desaniki use ayyelanti pani tho life muginchukovachu kada.. %$#$

Posted
7 minutes ago, Ram59 said:

elaagu vaalla life mugimpu seyyali anukunevallu desaniki use ayyelanti pani tho life muginchukovachu kada.. %$#$

ante POK velli yuddam cheyyali ani ni opinion?

Posted
Just now, AndhraneedSCS said:

ante POK velli yuddam cheyyali ani ni opinion?

antha bhariga akkarle.. local ga evaraina politician ni mingesi aadi life kuda mingeskunte kastaina vaadi life ki oka use untundiga

Posted
3 minutes ago, Ram59 said:

antha bhariga akkarle.. local ga evaraina politician ni mingesi aadi life kuda mingeskunte kastaina vaadi life ki oka use untundiga

Politicians are selfish but they do some good to people in the process 

Posted
1 minute ago, AndhraneedSCS said:

Politicians are selfish but they do some good to people in the process 

politicial process, politicians, valla bhashalu.. valla eshalu.. asalu sylabus antha outdated.. slate needs to be wiped 

Posted

sad, can understand his pain but he is psycho. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...