Jump to content

Recommended Posts

Posted

image_default_535225dbc38aae3ead.jpg

 

కేఏ పాల్ అంటే తెలియని సగటు టీవీ ప్రేక్షకుడు ఉండకపోవచ్చు.. ఇక సోషల్ మీడియాలో ఆయన చేసిన హంగామా నెటిజన్లు మర్చిపోరు.. ఆయన మాట్లాడితే కామెడీగా తోచేవాళ్లు.. కనిపిస్తే చాలు నువ్వుకునే వాళ్లు లేకపోదు. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు, ర్యాలీలు, ప్రచారం, ప్రెస్‌మీట్లు, ఎన్నికల సింబల్, అధికార, ప్రతిపక్ష నేతలపై ఆయన వేసిన పంచ్ డైలాగ్స్‌, విమర్శలు.. ఇలా ఆయన ఏది చేసినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఆయన రాజకీయంగా ప్రజలను ప్రభావితం చేయలేకపోయినా... తన వింత వ్యవహారశైలితో చాలామందిని అట్రాక్ట్ చేశారు. ఆయన ప్రసంగాలు, హావభావాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే, ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయారు. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు కేఏ పాల్.. అంటే ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ సంగతి ఏమో గానీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" సినిమాతో వెండితెరపై కనువిందు చేయనున్నాడు పాల్. 

అంటే సినిమాలో కేఏ పాల్ నటించడం లేదు.. కానీ, ఆయన పాత్రను తెరపై చూపించనున్నారు వర్మ.. ఇప్పటికే.. ఏపీ రాజకీయాల్లో ఎవ్వరినీ వదలను అనే తరహాలో.. అందరినీ టార్గెట్ చేసిన వర్మ.. ఈ సినిమాలో కేఏ పాల్ క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుందనే విషయాన్ని ట్రైలర్‌లో ఆయన పాత్ర చెప్పే డైలాగ్‌తోనే ఇంట్ ఇచ్చేశారు. ఇక, అంతేకాదు.. ఈ సినిమాలో కేఏ పాల్‌కు సంబంధించిన ఓ పాటను రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు వర్మ.. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలంటూ.. వ్యంగ్యంగా రాస్తూ.. నవంబర్ 2వ తేదీన ఉదయం 9.36 గంటలకు వరల్డ్ ఫేమస్ పర్సన్.. ఆయన పేరు కేఏ పాల్ అని.. కేఏ పాల్‌పై పాట రాబోతోందని పేర్కొన్నారు. మరి పాల్‌పై వచ్చే ఆ పాటలో వర్మ ఎన్ని సెటైర్లు వేశారు తెలియాలంటే మాత్రం రేపటి వరకు వేచిచూడాల్సిందే. 

Posted

Andhra politics lo K A paul ane character nu srushtinchindi nene, aa marchipoyara thammulu 

 

DistinctHappygoluckyAmmonite-size_restri

Posted
50 minutes ago, jefferson1 said:

Elections emaina vasthunnaya...

Movie vastundi ga

Posted
59 minutes ago, Assam_Bhayya said:

Andhra politics lo K A paul ane character nu srushtinchindi nene, aa marchipoyara thammulu 

 

DistinctHappygoluckyAmmonite-size_restri

kota-comedy1-o.gif?1290163557

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...