Sreeven Posted November 22, 2019 Report Posted November 22, 2019 విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి రప్పించి దాన్నంతటినీ సామాన్య ప్రజల ఖాతాలో పడేలా చేస్తానని 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే నిజమని నమ్మిన ఓ వ్యక్తి తన ఖాతాలోకి నెలనెలా వచ్చి పడుతున్న డబ్బును హాయిగా తీసుకుంటూ అవసరాలకు వాడేసుకున్నాడు. ‘మోదీ ఇచ్చారు.. నేను తీసుకున్నా’ అని చెబుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో జరిగిందీ ఘటన. రురై గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్, రోని గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్ ఇద్దరూ ఒకే శాఖలో ఖాతాలను తెరిచారు. ఇద్దరు పేర్లు ఒక్కటే అవ్వడంతో ఆ ఇద్దరికీ పొరపాటున ఒకే ఖాతా నంబరు కేటాయించారు. దీంతో ఒక హుకుమ్ సింగ్ దాచుకుంటున్న నగదు మరో హుకుమ్ సింగ్ అవసరాలకు ఉపయోగపడ్డాయి. తన ఖాతాలో నగదు జమ అవ్వడంతో అవి ఎక్కడ నుంచి వచ్చాయో తెలియని హుకుమ్ ప్రధాని మోదీ ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారనుకొని వాటిని వాడుకుంటున్నాడు. అలా ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో దాదాపు రూ.89 వేలు డ్రా చేసుకున్నాడు. మరో హుకుమ్ సింగ్ తన ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకుందామని ప్రయత్నించగా తన ఖాతాలో కేవలం రూ.35 వేలు మాత్రమే ఉన్నట్లు గుర్తించాడు. దీనిపై బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా జరిగిన తప్పును కనుగొన్నారు. హుకుమ్‌ను ప్రశ్నించగా ‘ప్రధాని మోదీ నా ఖాతాలో డబ్బులు వేస్తున్నారనుకున్నాను. అందుకే వాటిని తీసుకుని వినియోగించా’ అంటూ అమాయకంగా సమాధానం ఇచ్చాడు. దీంతో బ్యాంకు సిబ్బంది అతడి అమాయకత్వానికి ఏం చేయాలో తెలీక తలలు పట్టుకున్నారు. ఇప్పటికీ ఇద్దరికి ఒకే ఖాతా నంబరు ఎలా వెళ్లిందో తెలియడం లేదంటూ సిబ్బంది బదులివ్వడం గమనార్హం. Quote
Somedude Posted November 22, 2019 Report Posted November 22, 2019 2 minutes ago, Sreeven said: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి రప్పించి దాన్నంతటినీ సామాన్య ప్రజల ఖాతాలో పడేలా చేస్తానని 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే నిజమని నమ్మిన ఓ వ్యక్తి తన ఖాతాలోకి నెలనెలా వచ్చి పడుతున్న డబ్బును హాయిగా తీసుకుంటూ అవసరాలకు వాడేసుకున్నాడు. ‘మోదీ ఇచ్చారు.. నేను తీసుకున్నా’ అని చెబుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? హుకుమ్‌ను ప్రశ్నించగా ‘ప్రధాని మోదీ నా ఖాతాలో డబ్బులు వేస్తున్నారనుకున్నాను. అందుకే వాటిని తీసుకుని వినియోగించా’ అంటూ అమాయకంగా సమాధానం ఇచ్చాడు. Acche din to at least one person Quote
jefferson1 Posted November 23, 2019 Report Posted November 23, 2019 2 hours ago, Somedude said: thats true Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.