Jump to content

Recommended Posts

Posted

విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని సూచించాం: జీఎన్ రావు

 
Fri, Dec 20, 2019, 05:55 PM
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సూచించాం
  • అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
  • అమరాతిలో రైతులకు అన్ని విధాలా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని సిఫారసు 

ఏపీని పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తమ నివేదికలో సూచించామని జీఎన్ రావు తెలిపారు. ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎన్ రావు మాట్లాడుతూ,
నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్టు చెప్పారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని సూచించామని చెప్పారు. తుళ్లూరులోనే అసెంబ్లీ
ఉండాలని, వేసవికాలంలో మాత్రం అసెంబ్లీ సమావేశాలను విశాఖలో నిర్వహించాలని తమ నివేదికలో సూచించినట్టు చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, అమరాతిలో రైతులకు అన్ని విధాలుగా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని, అమరావతి, మంగళగిరిలో రాజ్ భవన్, మంత్రుల నివాసాలకు, తుళ్లూరు ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు చెప్పారు. 

https://www.ap7am.com/flash-news-672025-telugu.html

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • timmy

    7

  • tacobell fan

    6

  • aakathaai789

    6

  • Meowalpha

    6

Popular Days

Top Posters In This Topic

Posted
18 minutes ago, timmy said:

వేసవికాలంలో మాత్రం అసెంబ్లీ సమావేశాలను విశాఖలో నిర్వహించాలని తమ నివేదికలో సూచించినట్టు చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, అమరాతిలో రైతులకు అన్ని విధాలుగా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని, అమరావతి, మంగళగిరిలో రాజ్ భవన్, మంత్రుల నివాసాలకు, తుళ్లూరు ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు చెప్పారు. 

ANkLP4W.gif

Posted

Sashit Paper confirms

సాక్షి, అమరావతి: ప్రజాభిప్రాయం మేరకే తమ నివేదిక ఉంటుందని జీఎన్‌ రావు కమిటీ స్పష్టం చేసింది. 

కమిటీ సిఫార్సులు ఇవే

  • తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు
  • అమరావతిలో రాజభవన్‌, అసెంబ్లీ, సీఎం క్యాంప్‌ కార్యాలయం
  • విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్‌ కార్యాలయం, హైకోర్టు బెంచ్‌
  • వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలి
  • శ్రీబాగ్‌ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు
Posted
14 minutes ago, kidney said:

ప్రజాభిప్రాయం మేరకే తమ నివేదిక ఉంటుందని జీఎన్‌ రావు కమిటీ స్పష్టం చేసింది. 

Can they make it public @3$%

Posted

Basically Capital is shifted to Vizag. Migatha vallaki kukka biscuits vesaru .

 

Have to see how they will deal with Amaravathi lands 

 

 

Posted
23 minutes ago, AndhraneedSCS said:

Basically Capital is shifted to Vizag. Migatha vallaki kukka biscuits vesaru .

 

Have to see how they will deal with Amaravathi lands 

 

 

Lacha kotlu petti katte badulu 15k 20k crs lo close cheyali anukuntunadu emo

Posted
7 minutes ago, aakathaai789 said:

yendakalam lo oka chota chali kaalam lo oka chota 

4 regions anta uncle krishna east and west oka region anta aa area lo vachey taxes aa area lo development key spend cheyyali ani demand cheddam emantaav?? Image result for brahmi gif"

Posted
1 minute ago, timmy said:

4 regions anta uncle krishna east and west oka region anta aa area lo vachey taxes aa area lo development key spend cheyyali ani demand cheddam emantaav?? 

Image result for brahmi gif"

Posted

అమరావతిలో ఉద్రిక్తత... జీఎన్ రావు కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు యత్నించిన రైతులు

 
Fri, Dec 20, 2019, 07:10 PM
tn-366dc504a6f9.jpg
  • సీఎంకు నివేదిక సమర్పించిన జీఎన్ రావు కమిటీ
  • రాజధానిపై అధ్యయనం కోసం కమిటీ
  • నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచన
  • భగ్గుమన్న రాజధాని రైతులు

ఏపీ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. ఈ కమిటీ తమ నివేదికలో చేసిన సిఫారసుల పట్ల రాజధాని ప్రాంత రైతులు భగ్గుమంటున్నారు. కమిటీ నివేదికగా వ్యతిరేకంగా మందడం వై జంక్షన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. వెలగపూడిలో ఉన్న సచివాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రాజధాని అధ్యయన కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కమిటీ సభ్యులను వేరే మార్గంలో పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ దశలో రైతులు రోడ్డుకు బుల్ డోజర్ ను అడ్డంగా పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పురుషులు రోడ్డుపై పడుకోగా, మహిళలు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వానికి, జీఎన్ రావు కమిటీకి శాపనార్థాలు పెట్టారు. ఈ ధర్నాలో పలువురు చిన్నారులు సైతం పాల్గొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీఎన్ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను ఎప్పుడు తెలుసుకుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు, రాజధానిపై అధ్యయనం చేయడానికి జీఎన్ రావు కమిటీకి ఉన్న చట్టబద్ధత ఏంటని వారు నిలదీశారు.
froala-6f20bd3d99a23e5d4a0b6f1c77256609c7236926.jpeg

https://www.ap7am.com/flash-news-672032-telugu.html

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...