Kool_SRG Posted December 31, 2019 Report Posted December 31, 2019 ప్రేమకు వయసుతో పని లేదు. ఎవరైనా ఎప్పుడైనా సరే ప్రేమలో పడొచ్చు. ప్రేమించే మంచి మనసు ఉంటె చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. అర్ధం చేసుకునే మనసు ఉంటె అంతకనే కావాల్సింది ఏముంటుంది. కేరళలో నివసించే ఓ జంటకు 30 ఏళ్ల క్రితం ముఖపరిచయం ఉన్నది. ఆ తరువాత ఇటీవలే వీరు ఓ వృద్ధాశ్రమంలో కలుసుకున్నారు. అలా వృద్ధాశ్రమంలో కలుసుకున్న ఈ వృద్ధ జంట మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది వెంటనే పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... 30 ఏళ్ల క్రితం లక్ష్మి అమ్మాళ్ అనే మహిళ భర్త వద్ద కొచ్చనియన్ మేనన్ అనే వ్యక్తి అసిస్టెంట్ గా ఉండేవారు. 21 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె తన బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆ తరువాత మేనన్ గురించి పట్టించుకోలేదు. 30 ఏళ్ల తరువాత అమ్మాళ్ వృద్ధాశ్రమంలో చేరింది. అక్కడ ఉన్న మేనన్ చూసి గుర్తుపట్టింది. ఇద్దరి మనసులు కలిశాయి. చివరి రోజుల్లో ఒకరికొకరు సాయంగా ఉండాలని అనుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ పెళ్ళికి కేరళ మంత్రి కూడా హాజరు కావడం విశేషం. ప్రస్తుతం ఈ వృద్ధ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Quote
ChinnaBhasha Posted December 31, 2019 Report Posted December 31, 2019 Idedo mana db ki match ayyela unde ani @TOM_BHAYYA telling Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.