Jump to content

Recommended Posts

Posted

 

వరదల్లో కర్నూల్ మునిగిపోయినప్పుడు మేడం గారు స్పదించలేదు .

దేశమంతా కన్నీరు కార్చిన మద్రాస్ వరదలప్పుడు కూడా మేడంకి మనస్సు రాలేదు .

మై బ్రిక్ మై అమరావతి పేరుతో బాబుగారు ప్రజలదగ్గర విరాళాలు వసూల్ చేసినప్పుడు మేడం గారు బిజీగా ఉండి స్పదించలేదు .

అమరావతి పేరుతో హుండీలు పెట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వసూళ్లు మొదలెట్టినప్పుడు కూడా మేడం గారు లైట్ తీసుకొన్నారు . 

** అంటే చంద్రబాబు సొంత కుటుంభానికి నొప్పి కలిగినప్పుడే ఇలా దానాలు చేస్తారా ? **

ఇప్పుడు సడన్ గా ఎంత పెద్ద విపత్తు వచ్చిందని గాజు ఇచ్చిందో అర్థం కావటం లేదు . ఏమైనా పెద్ద విపత్తు వచ్చి బాధితులు తిండిలేక ఆర్తనాదాలు చేస్తున్నారా ? 

గతంలో మేడం గారు చంద్రబాబు మీద నక్సల్స్ దాడి జరిగినప్పుడు 2003 , అక్టోబర్ 18 న తిరుమలలో నిలువుదోపిడీ ఇచ్చారు . సరే , సొంత భర్త ప్రమాదం నుండి బయటపడ్డందుకు స్వామివారి మొక్కు తీర్చుకున్నారులే అనుకోవచ్చు . దానిలో తప్పు పట్టటానికి లేదు . 

మరి ఇప్పుడు ' ఫ్లాటినం గాజు ' ఎందుకు ఇచ్చినట్లు ? 

బినామీల పేరుతో చంద్రబాబు కొన్న వేల ఎకరాలు విలువ తగ్గిపోతుందనే దిగులుతోనే ఇచ్చిందా ? ఎంతో ముందు చూపుతో రాబోయే కొన్ని తరాలు కూడా మీరే రాజ్యం చేయాలని  , మిగిలిన రాష్ట్రం మీద పెత్తనం చేయాలనే ముందు చూపుతో కన్న కలలు కూలిపోతున్నాయనే బాధలో ఇచ్చిందా ? 

అంటే చంద్రబాబు సొంత కుటుంభానికి నొప్పి కలిగినప్పుడే ఇలా దానాలు చేస్తారా ? 

ఇంతకీ గాజు ఎవరి చేతికి ఇచ్చింది ? 

భువనేశ్వరి గారూ , మీరు ఇవ్వాల్సింది గాజు కాదు . బినామీల పేరుతో కొన్న భూములన్నీ తిరిగి రైతులుకివ్వండి . మీరిచ్చిన గాజు వలన ఎవ్వరికీ ప్రయోజనం లేదు . మీరు దోచుకున్న వేల ఎకరాలు తిరిగి రైతులుకిస్తే అందరూ సంతోషిస్తారు .

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...