kakatiya Posted January 4, 2020 Report Posted January 4, 2020 లో స్టీవ్‌వా, గిల్‌క్రిస్ట్‌లను రివర్స్ స్వింగ్‌తో ఔట్ చేసిన తీరు చాలు అతని బౌలింగ్ విశిష్ఠతను చెప్పుకోడానికి! 2006 లాహోర్‌లో పాకిస్థాన్‌తో టెస్టులో హ్యాట్రిక్ చాలు అతని నైపుణ్యమెలాంటిదో చెప్పడానికి.. బ్యాటింగ్‌లోనూ గుర్తుంచుకోదగ్గ మెరుపులున్నాయి అతడి కెరీర్లో! బంతితో, బ్యాటుతో సత్తా చాటి కపిల్‌దేవ్‌లా మరో మేటి ఆల్‌రౌండర్ అవుతాడనే ఆశలు రేకెత్తించి.. మధ్యలో అంచనాల్ని అందుకోలేక కనుమరుగైపోయిన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్! కొన్నేళ్లుగా ఆటలో అంత చురుగ్గా లేని ఈ ఆల్‌రౌండర్.. అన్ని రకాల క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబయి ఇర్ఫాన్ పఠాన్.. ఈ పేరు చెప్పగానే కళ్లుచెదిరే స్వింగింగ్ బంతులు గుర్తొస్తాయి లోయర్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అతని మెరుపులూ గుర్తుకొస్తాయి.. కపిల్‌దేవ్ వారసుడిగా పేరు సంపాదించి.. కొన్నాళ్లు భారత క్రికెట్లో వెలిగిన ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆటకు వీడ్కోలు చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ఈ 35 ఏళ్ల బరోడా ఆటగాడు ప్రకటించాడు. ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నా.. ఫామ్ లేమితో పాటు గాయాల కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయి చాలా కాలమే అయ్యింది. ఈ మధ్య దేశవాళీ క్రికెట్‌కూ పఠాన్ దూరమయ్యాడు. 2019 ఫిబ్రవరిలో ఆఖరిగా జమ్ము కశ్మీర్ తరఫున ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బరిలో దిగిన పఠాన్.. మళ్లీ మైదానంలోకి రాలేదు. జమ్ము కశ్మీర్ జట్టుకు ఆటగాడిగా, మార్గదర్శిగా ఉన్న పఠాన్.. 12 నెలలుగా క్రికెట్ ఆడలేదు. తాజాగా ఐపీఎల్ వేలం నుంచీ వైదొలిగాడు. 2003లో తొలిసారి అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన పఠాన్ తన ఎడమచేతి వాటం పేస్ బౌలింగ్‌తో ఆరంభం నుంచే ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా కపిల్‌దేవ్‌ను, స్వింగ్ బౌలర్‌గా వసీం అక్రమ్‌ను గుర్తుకు తెచ్చిన పఠాన్‌ను మాజీలు కూడా ఒక దశలో ఆకాశానికెత్తారు. 2006 పాకిస్థాన్ పర్యటనలో టెస్టులో ఇర్ఫాన్ హ్యాట్రిక్ తీసి తనపై అంచనాలు మరింత పెంచుకున్నాడు. 2008 ఆసీస్ పర్యటనలో పెర్త్ టెస్టులో భారత్ విజయంలో అతను కీలకపాత్ర పోషించాడు. గాయాలు, ఫామ్‌లేమి పఠాన్‌ను జట్టుకు దూరం చేశాయి. ఆఖరిగా 2008లో దక్షిణాఫ్రికాపై టెస్టు ఆడిన పఠాన్.. 2012లో శ్రీలంకపై చివరి వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో ఇర్ఫాన్ సభ్యుడు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.