Jump to content

Recommended Posts

Posted

రాజకీయాలు ద్వారా ఎలా సంపాదించుకోవచ్చో,ఎందుకు రాజకీయులు అధికారం కోసం అంత కష్టపడతారో తెలుస్తుంది.

అసలు విషయం వేరు. 

అమరావతి పేరుతో ఇరవై తొమ్మిది గ్రామాల భూములు బాబు గారు తీసుకున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని వాళ్ళు ఇచ్చారు. మన పిల్లలు బాగుండాలి అని కోరుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు. వాళ్ళెవరూ మాకు రాజధాని ఇవ్వండి అని అడగలేదు. రాజధాని లేకుంటే వాళ్ళెవరూ ఆకలి చావులు చావలేదు. నలభై రకాల పంటలు అక్కడ పండుతాయి. నెదర్లాండ్స్ లాంటి అద్భుతమయిన భూమి. బంగారం కూడా పండుతుంది. వాళ్ళు పండించుకుని వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు. 

ప్రజల భూములు కాక మైనర్ సర్క్యూట్ ( ప్రభుత్వ పోరామ్బోకు), దేవాలయ భూములు, అటవీభూములు కలిసి ఒంకో ఇరవై వేల ఎకరాలు వున్నాయి. మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు. 

బాబు గారి దుర్మార్గం అక్కడ ప్రజలకి అర్ధం కాలేదు. బహుశా వాళ్ళెవరూ స్కూల్ కి, కాలేజీకి వెళ్ళి చదువుకోలేదు అని నా అనుమానం. కింద మాస్టర్ ప్లాన్ చూడండి. మూడు విలేజి లు పెట్టా. తుళ్ళూరు, రాయపూడి , దొండపాడు. వీటికి ఏ రంగూ లేదు. అంటే వీటిని జోనింగ్ చేయలేదు. అవి అలానే వుంది పోతాయి. రోడ్ లు విలేజి ల మధ్యలో నుంచి పోతాయి ఆట. అది కూడా వంద ఫీట్ ల రోడ్ లు. రాయపూడి సగం లో గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తుంది. ఆ సగం లాగేసుకుంటారు. ఈ గ్రామాలు అన్నీ దిష్టి చుక్కల లాగా మహా నగరం లో ఓల్డ్ సిటీ వున్నట్టు వుంటాయి. వీటికి డ్రెయినేజి, వాటర్ లాంటివి ఎలా ఇస్తారో దేవుడికి ఎరుక. 

రోడ్ లు అన్నీ గ్రామాల దగ్గర నిలబడి వున్నాయి, మళ్ళీ గెలిస్తే వూర్లు లాగేసుకుని రోడ్ లు వేసి తరిమెసే వాళ్ళు. అదృష్టం వాళ్ళది 

ఏకరాకీ పద్నాలుగు వందల చిల్లర గజాలు ఇస్తాం అని చెప్పారు. కానీ అవి ఎక్కడ ఇస్తున్నారో చెప్పలేదు. చెప్పడానికి ముందు వీళ్ళకి తెలిసి చస్తే కదా. బాబు గారికి ఎప్పుడూ తన కులం కన్సల్టెంట్ ల మీద వున్న నమ్మకం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ల మీద ఉండదు. ఈ కన్సల్టెంట్ లు ఆటో కాడ్ లో ఆఫ్ సెట్ లు కొట్టి ఎవరికి ఎంత భూమి ఇవ్వాలో గీసి పారేశారు. దాని మీద మాస్టర్ ప్లాన్ పెట్టి అటూ ఇటూ జరిపి ఏదో చేశారు. లాండ్ హెచ్చు , తగ్గులు వుంటుంది, దాన్ని జాగ్రత్త గా ఫీల్డ్ మీద చెయ్యాలి అని వాళ్ళకి ఎవరూ చెప్పలేదు. రాయపూడి దగ్గర అనుకుంటా కాంక్రీట్ పిల్లర్ లు కాస్టింగ్ యార్డ్ పెట్టి కాస్ట్ చేశారు. అవి భూమి మీద పాతాలి కదా. సినిమా కనపడింది. ఏదో చేశారు. 

కొంత మంది బీద రైతుల వివరాలు ఇలా వున్నాయి 

తొట్టెంపూడి హరిత, తొట్టెంపూడి శివ ప్రసాద్, కొత్తపల్లి దేవి పూజిత, వడ్లమూడి సీతా మహా లక్ష్మి. వీళ్ళందరికీ పక్క పక్కనే వెయ్యి గజాలు ఇచ్చారు , కానీ యాక్చ్యువల్ గా మెజర్మెంట్ చేస్తే 8999 గజాలే వుంటుంది. ఒక గజం తక్కువ, గజం యాభై వేలు అట. సరే 1921 ఎస్ & బి యాక్ట్ ప్రకారం రికార్డ్ లో వున్నదే కరెక్ట్ అవుతుంది. అలా తగ్గడానికి కారణం నాకు తెలుసు, కాకుంటే అది ఎక్స్ప్లెయిన్ చెయ్యాలంటే పైథాగరస్ థియరీ నుంచి త్రిగానోమెట్రీ వరకూ చెప్పాలి. అంత టైమ్ లేదు. తలా ఒక కాగితం ఇచ్చారు, ఇంత భూమికి నువ్వు ఓనర్ అని. 

ఇదంతా అయ్యాక, ఇంకా అక్కడ డెవలప్మెంట్ ఏమీ అవలేదు కదా. కానీ ఈ రైతుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్ లు రంగా ప్రవేశం చేశారు. వెయ్యి గజాల్లో ఆరు వందల గజాలు వదిలేసి కట్టుకోవాలి.మహా అయితే చిన్న ఇల్లు వస్తుంది, అదేమాకు అమ్మేయ్యండి, అని కోట్లు పెట్టి ఆ కాగితాలు కొనేసుకున్నారు. కానీ రిజిస్టర్ చేసుకోలేదు. మొదటి సారి అమ్మితే కాపిటల్ గెయిన్ టాక్స్ లేదు. తరువాత ఎకరా వంద కోట్లు అయ్యాక అమ్ముకుందాం అనుకున్నారు. 

గవర్నమెంట్ ఇప్పుడు లాండ్స్ వెనక్కి ఇస్తే రైతులకి ఇస్తుంది తప్ప, కాగితాలు కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వదు. ఇందు మూలము గా గుండు అయ్యింది ఈ దురాశాపరులకి తప్ప, రైతులకి కాదు. 

అదీ సంగతి..

ఇంకా దుర్మార్గం ఏమిటో తెలుసా, పదిహేను ఎకరాలు సొంత బావమరిది కి రాశి ఇచ్చేశారు బాబు గారు 
 
 

Posted
16 minutes ago, Joker_007 said:

are babu ..Ide pani YCP vallu already strat chesaruga Vizaq lo

Vallu chesina correct vallaki

Posted

Babu kathalu bane rastannaru paytm batch Kali a ga....  Nadhi a region a.. as per master plan govt shouldn't touch existing village Panchayat limits...  So a grama khantala area vadilesi land pooling chesaru and no rooad should touch villages...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...