TOM_BHAYYA Posted January 17, 2020 Author Report Posted January 17, 2020 44 minutes ago, GullyBoy said: sirapadu.. guntadu.. chinnodu.. ila vadukovachu 37 minutes ago, tamu said: భావం: ఉత్తరం దిక్కున ఉండే సిరపడు అనే వ్యక్తి ఎన్నో చిత్రాలు చేస్తాడు(సిరపడు అనే పదాన్ని సురుకైన వాడు, ఏదైనా చేద్దామనుకుంటే చేసేసేవాడు అనే అర్ధం లో ఉపయోగిస్తారు. వంశధార, నాగవల్లి ప్రాంతం లో ఈ పదాన్ని వాడతారు. అక్కడ LIC officer గా పనిచేస్తున్నప్పుడు ఈ పదాన్ని విన్నారంటా విజయ్ కుమార్ గారు.). పెత్తనాలు (పెద్ద పెద్ద పనులు) చేస్తాడు. ఒక్కసారి తను ఏదైనా అనుకుంటే అస్సలు వదలడు. ఊరంతా వదిలినా కానీ, ఆ పని మీద తను పట్టిన ఉడుంపట్టు వదలడు. (ఉడుము అనే crab జాతికి చెందిన జీవి పట్టే పట్టు చాలా గట్టిగా ఉంటుంది ఆలా ఉడుంపట్టు అనే పేరు వచ్చింది). బుగుతడి(బుగత అంటే భుక్త కి వికృతి. భుక్త అంటే పెత్తనం చలాయించేవాడు, డబ్బు ఎక్కువ ఉన్నవాడు అనే అర్ధం లో ఉపయోగిస్తారు.) ఆంబోతు కుమ్మడానికి వస్తే, ఆ ఆంబోతు కొమ్ములని విరిచి ఆ కొమ్ములని పీపలుగా (trumpet) లా ఊదడంట. జడలున్న మర్రిచెట్టు ని అందరు దెయ్యాలు ఉండే చోటు అనే భయపడుతుంటే, ఆ దెయ్యము తో కయ్యానికి తొడకొట్టి దిగాడు. అమ్మోరు జాతర రావణుడు లాంటి మనిషి అమ్మాయిలని ఏడిపిస్తూ వెంట పడుతుంటే, వాళ్ళని కొట్టి మట్టి కరిపించాడు (నేలకూల్చాడు). వరదలో చిక్కుకుని కుర్రాళ్ళు భయపడుతుంటే, ఆ వరదలో కూడా ఈదుకుంటూ పోయి వాళ్ళని ఒడ్డు కి తీసుకొచ్చాడు. పొన్నూరు కి చెందిన వస్తాదు(కండలు తిరిగిన బలవంతుడు), దమ్ముంటే తనతో పోటీకి రమ్మంటే, అతని రొమ్ము మీద ఒక దెబ్బకొట్టి కుమ్మి అవతలేసాడు. పది మంది కూడా లాగలేని పది మూరల (మన చెయ్యిని మోచెయ్యి వరకు 10సార్లు కొలిస్తే ఎంతుంటుందో అంత) సొరచేపా ని కూడా ఒడుపుగా (జాగ్రత్త గా gripping గా) పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. రోజు సాము (excercise) చేసే కండ అతనిది. దేనికైనా గట్టి పోటీ ఇవ్వగలడు. అతడు అడుగువేస్తే అవతల ఎవరున్న బెదిరిపోతాడు. అలాంటి ఎన్నో వింతలు చిత్రాలు చేసే సిరపడు. గండు పిల్లిలాగ చురుకైన చూపు తో శత్రువు గుండెలో గుచ్చాడు.. అలా తన వెంట పడిన పోకిరోళ్ళని సిరపడు తంతుంటే, ఆ సక్కనమ్మ కళ్ళు సుక్కలు వచ్చినట్లు వెలిగిపోతున్నాయి.. పూర్వం పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఆ పని అలసట తెలీకుండా ఉండటానికి ఇలా తాము చుసిన కథలను, వ్యక్తుల గురించి పాటలుగా పాడేవాళ్లు వాటినే జానపదాలు అంటారు. సినిమాలో కూడా ప్రతినాయకుడు పని చేస్తూనే ఈ పాట పాడుతాడు. ఒక పక్క ఈ పాట వస్తుంటే ఆ సాహిత్యానికి తగ్గట్టు గా fight ని fight masters Ram – Laxman చాలా బాగా compose చేశారు. జానపదాలు మన సంపద, వీటిని ఇలా సినిమాలలో ఇమడ్చడం వల్ల వాటిని కొంతైనా తరువాతి తరానికి తెలిసేలా చేసే ఆస్కారం ఉంది. 21 minutes ago, dasara_bullodu said: sirapadu ante ... guntadu, poradu laaga inkoka padam anthe sitrala sirapadu ante ... chitralu (miracles) chese sirapadu ani ... @TOM_BHAYYA 👍🏼👍🏼👍🏼 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.