Jump to content

Recommended Posts

Posted

అమరావతి అంగుళం కూడా కదలదు అని ప్రకటించిన సుజనా చౌదరి మౌనంగా ఉన్నారెందుకు ? బీజేపీ ఎందుకు జోరు తగ్గించేసింది ? అమరావతి మీద టీడీపీ సింగిల్ ఎందుకు అయ్యింది ? పవన్ కల్యాణ్ కూడా సీన్ లోకి రాకుండా వ్యూహాత్మకంగా సింగిల్ చేసేశారా ? త్వ రలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మారతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో సుజనా పేరు పెద్దగా ప్రస్తావనలోకి రావడం లేదు ఎందుకని ? ఆరోపణలతో సాయిరెడ్డి, సుజనా లాంటి వాళ్లని తన్ని తరిమేయాలంటూ అసెంబ్లీలో జగన్ చేసిన వ్యా ఖ్యలు గట్టిగానే పని చేశాయా ? అసలు సొంత పార్టీలో కూడా సుజనాను సమర్థించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది ?

o8ip89uptg6789i5fr6t8i6g7o.gif&cfs=1&ups

ఓ వ్య వస్థను నడపడంలో, ప్రత్య ర్థి బలహీనతను పిడికిట బిగించి ఉక్కిరి బిక్కిరి చేయడంలో సాయిరెడ్డిది ప్రత్యేక స్టైల్. క్లినికల్. ఎవరిపైన అయినా దృష్టి పెట్టారంటే ఇక అల్లాడిపోవాల్సిందే అని వైసీపీ నాయకులు అంటారంటే, అదేం అబద్ధం కాదు. లోకేశ్ విషయంలో అదే జరిగింది. టీడీపీ మొదట లైట్ తీసుకుంది. ఇంటెన్సిటీ అర్థం చేసుకునే సరికి లేట్ అయ్యింది. తీరా తేరుకునే లోపు పరిస్థితి చేయి దాటిపోయింది. ఆరోపణలు, పప్పుగా ముద్ర కొట్టడం, ప్రతీదీ తప్పుగానే మాట్లాడతాడు అని, మాలోకం అని ఇంకేవేవో సునామీలా ముంచెత్తాయ్. ఓ పాయింట్ మీద ఫోకస్ పెడితే ఎలా పనిచేయాలో, ఎంత వరకూ అయినా ఎందుకు వెళ్లిపోవాలో టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ పని చేస్తున్నట్టుగా ఉంటుంది సాయిరెడ్డి స్టైల్. ఇక ఈ మధ్య  సాయిరెడ్డి… బీజేపీ ఎంపీ సుజనా మీద బాగా గట్టిగానే ఫోకస్ పెట్టారు. సుజనా టీడీపీలో ఉన్నప్పటి నుంచి సాయిరెడ్డి గురిపెట్టినా ఈ మధ్య న వెంటాడిన తీరు మాత్రం మరీ ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో ఒకటి రెండు కాదు మూడు కోణాలు ఉన్నాయ్. బీజేపీని సాయిరెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించడు. తప్పు పట్టడు. వాళ్ల విధానాల్ని క్వ శ్చన్ చేయడు. రెండోది ఢిల్లీ స్థాయిలో సంబంధాలు గట్టిగా, టైట్ గా కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ నిమిషం వరకూ ! ఏ బిల్లు పెట్టినా మేం మద్దతిస్తామంటూ ఆయన ముందుకు వెళ్లిపోతాడు. ముందుగా ముందు వరసలో నిలబడతాడు. కానీ మూడో పాయింటే కీలకం. సుజనా విషయంలో మాత్రం అస్సలు లేట్ చేయడు. చంద్రబాబు ఏజెంటు అనే అంటాడా, బినామీ అనే ముద్ర వేస్తాడా, రాజధాని విషయంలో సుజనా కామెంట్లను తప్పు పడతాడా ఎంత చేయాలో అంతా చేసేశాడు సాయిరెడ్డి. ఆఖరికి సుజనా ఏం మాట్లాడినా ముందు మారిషస్ కేసులు, బ్యాంకులు, ఆరు వేల కోట్లు అంటూ కట్ అండ్ పేస్ట్ ఎటాక్ వచ్చేస్తది, సహజంగానే నామోషీ ఫీల్ అవుతాడు సుజనా ! ఆ ఆరోపణల్ని తిప్పి కొట్టేందుకు, సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేయడంతోనే, అప్పటి వరకూ మాట్లాడుతున్న అసలు పాయింట్ దారి మళ్లి పోతుంది చాలాసార్లు. అంతే ఆ తర్వాత అంతా మొక్కుబడి యవ్వారంగా మారిపోతుంది. సాయిరెడ్డి అనుకున్న పర్పస్ సర్వ్  అవుతుంది.

ఇది యుద్ధం. ఈ బ్యాటిల్ ఇక్కడికే పరిమితం కాలేదు. ఢిల్లీ వరకూ పాకింది. హైకమాండ్ కు కూడా చేరింది అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సుజనా ముందు నుంచి టీడీపీకి చంద్రబాబుకి మాత్రమే విధేయుడు అని – బీజేపీలో ఉన్నా కూడా బాబు కోసం మాత్రమే పనిచేస్తున్నాడని ముద్ర గట్టిగానే వేయగల్గినట్టు కనిపిస్తున్నారు ఇప్పటికి అయితే ! వైసీపీ చెబుతున్న లెక్క  ప్రకారం – ఏపీ బీజేపీ నాయకుడు కూడా వైసీపీకి సానుకూలంగా ఉండే వ్యక్తే వస్తాడని అంటున్నారు. ఇప్పుడు మొత్తంమ్మీద చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది. కొన్నిసార్లు బీజేపీలోకి ఎంట్రీ సునాయాసమే కానీ తర్వాత పార్టీలో పట్టు దొరకడం మాత్రం అంత సులభం కాదు. నిరూపించుకోవడాలూ, పాత వాళ్ల పోరును తట్టుకోడాలు, ఇలా దొడ్డి దారి స్నేహితుల దాడిని తట్టుకోవడాలు చాలానే ఉంటాయ్. వీటిలో పడి సుజనా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా అనిపిస్తోంది. లైజొనింగ్ విషయంలో తిరుగులేదని, చంద్రబాబు వ్యూహ బృందంలో కీలక సభ్యుడని, రాజకీయ మంత్రాంగం పటిష్టంగా నడుపుతారనే ముద్ర ఉన్న సుజనా ఇప్పుడు ప్రస్తుతానికి వెయిట్ అండ్ సీ జోనర్ లో ఉన్నారేమో అనిపిస్తోంది. అవునో కాదో తెలియడానికి ఇంకొంత కాలం పడుతుంది !

Posted

తాడిని తన్నే వాడు ఉంటె వాడిని తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు ... చూద్దాం ఎన్ని రోజులు ఈ ముచ్చట ఉంటుందో ...

  • Haha 1
Posted
2 hours ago, Android_Halwa said:

@TokyoJaani nuvu YCP covert agent le ?

paytm lo enni paisal padinayi ?

Paytm Chillara IDs AA ivvanni🧐🧐🧐

Posted
3 minutes ago, ARYA said:

Paytm Chillara IDs AA ivvanni🧐🧐🧐

+69. Mee reputation ni match cheyyali ante time pattudhi

Posted

recent Telangana CBI cases  in charges from Delhi  ni CBN  & JD friend some telugu from karnataka cadre

ni pettalani chuste apinchaadu.. just by exposing  the nexus

Posted
12 minutes ago, TokyoJaani said:

+69. Mee reputation ni match cheyyali ante time pattudhi

K..poyi chillara erko..

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...