kothavani Posted January 29, 2020 Report Posted January 29, 2020 ఐటీ వదిలి అరక పట్టి¨... ఆరోగ్యవంతమైన సాగు కోసం... ఆమె అరక పట్టింది... పచ్చని పంట పండిస్తూ... రెక్కల కష్టాన్ని నమ్ముకునే రైతుల కోసం పిడికిలి ఎత్తింది... పోరాడి ప్రజాప్రతినిధిగా మారింది. ఆమే తమిళనాడులో స్థిరపడ్డ తెలుగుతేజం రేఖా రాము. ఆ విశేషాలివి... ఐటీలో ఉద్యోగం. లక్షల్లో జీతం. వీటన్నింటినీ కాదనుకుంది తమిళనాడులోని పుత్తిరన్‌కొట్టైకి చెందిన రేఖారాము. సేద్యం బాట పట్టి రైతులకు స్ఫూర్తినిచ్చింది. ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రజాప్రతినిధిగా మారింది. ఆమె 2008లో తిరువళ్లూర్ జిల్లా పాండేశ్వరానికి చెందిన పార్థసారథిని పెళ్లి చేసుకుంది. ఆయనా ఐటీ ఉద్యోగే. వారికో బాబు. ఆ అబ్బాయి తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. కారణాలేంటని ఆరా తీస్తే రసాయనాలతో పండించిన ఆహారం అని తెలిసింది. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల కోసం కొన్ని రోజులు అన్వేషించారు. సరైన ఫలితం లేదు. దీంతో లక్షల జీతాన్ని వదులుకొని ఆలుమగలిద్దరూ కాడి పట్టారు. పల్లేర్లు మొలిచిన ఏడెకరాల పొలాన్ని సాగులోకి తెచ్చారు. ఆకు కూరలతో మొదలైన సేద్యం అనేక రకాల పంటలు పండించే వరకు వెళ్లింది. మొత్తం 35 ఎకరాలను పచ్చగా మార్చారు. వ్యాపారం ఇలా... అక్కడితోనే రేఖారాము ఆగిపోలేదు. నిత్యం చుట్టుపక్కల ఉండే రైతులకు రసాయనాల వినియోగంతో కలిగే నష్టాలు వివరించేది. ఇది రైతుల్లో ఎంతో మార్పు తీసుకువచ్చింది. దాదాపు 300 మంది రైతులు సేంద్రియ సాగు బాట పట్టారు. వాళ్లు మార్కెటింగ్‌కు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ‘ఫార్మర్ అండ్ కో’ అని రెండు స్టోర్లను తెరిచి... రేఖనే వాటిని కొనుగోలు చేసింది. మహిళా స్వయం సహాయక బృందాలతో కలిసి ఈ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను మరింత విస్తరించింది. తమిళనాడులోని వివిధ నగరాలకూ ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారు. మొత్తం 116 స్టోర్లకు వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తుండటం విశేషం. పోరాటం మొదలు... అక్కడి ప్రాంతాల్లో ఇటుక బట్టీలు విపరీతంగా ఉంటాయి. వాళ్లు ఇష్టం వచ్చినట్లు చెరువులో మట్టి తీసేవారు. ఇది నీటి నిల్వపై ప్రభావం చూపించేది. దీనివల్ల రైతులకు కలిగే ముప్పుపై పిడికిలి ఎత్తారు. ఒక రోడ్డు ప్రాజెక్టు కోసం సారవంతమైన భూములను సేకరిస్తుండటంతో దీనికి వ్యతిరేకంగా పోరాడారు. రైతుల సహకారంతో పోరాడి ఇది నిలిచిపోయేలా చేసింది. ఇలా రైతులకు కలిగే ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి రాజకీయాల్లోకి రావడమే సరైన మార్గం అనుకుంది రేఖారాము. ఈ క్రమంలో ఆమెను ఎంతో మంది విమర్శించారు. ఆ విమర్శలని ఆమె పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిగా... ఇటీవల స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో పాండేశ్వరం పంచాయతీ అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా రేఖారాము పోటీ చేశారు. తమిళనాట ద్రవిడ పార్టీలదే ఆధిక్యం. అవి జట్టులు కట్టి బరిలో నిలిచాయి. అయినా సమీప ప్రత్యర్థిపై 265 ఓట్ల మెజారిటీతో విజయబావుట ఎగరవేసింది. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, పంచాయతీ ప్రభుత్వ పాఠశాలకు స్థలం ఇవ్వడం, రైతుల మద్దతు తనను విజయబాటలో పయనించేలా చేశాయి. పాండేశ్వరంలో మౌలిక వసతులు కల్పించి, పోషకాహార లోపం లేని గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతోందామె. - కటికల సతీష్‌బాబు, చెన్నై, న్యూస్‌టుడే Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.