AndhraneedSCS Posted January 31, 2020 Report Posted January 31, 2020 కరోనా భయం... కనీసం మృతదేహం వైపు కూడా... 31-01-2020 17:59:56 చైనా : ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయ భ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ రద్దీగా వుండే చైనాలోని వీధులు మనుషులు లేక వెలవెలబోతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ భయంతో అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావడం లేదు. ప్రాణాంతక వ్యాధితో భయ భ్రాంతులకు గురవడం సహజమే కానీ... ఆ భయం మానవత్వాన్ని చంపేస్తోంది. చైనాలోని వుహాన్‌లో రోడ్డు పక్కన ఓ శవం పడి వున్నా సరే, కరోనా వైరస్ భయంతో ఎవ్వరూ కనీసం అటువైపు కూడా తొంగి చూడలేని ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కనీసం చనిపోయిన వ్యక్తి ఎవరో అని తెలుసుకునేందుకు కూడా వ్యక్తులు సాహసించలేదంటే భయం మనుషులను ఎంతగా కమ్మేసిందో ఒకసారి ఆలోచించాలి. కాసేపటి తర్వాత ఓ పాత్రికేయుడు ఫోటో తీయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. చాలా సేపటి తర్వాత ఆ మృతదేహాన్ని వైద్య సిబ్బంది, పోలీసులు కలిసి ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికులు మాత్రం కరోనా వైరస్ భయం వల్లే తాము మృతదేహం వైపు వెళ్లలేదని స్పష్టంగానే ప్రకటిస్తున్నారు. కరోనా వైరస్ సోకి ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఆయన కూడా ఆ వైరస్ సోకే చనిపోయాడని మా భయం. ఒకవేళ మృతదేహం దగ్గరికి వెళితే... వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టే దగ్గరికి వెళ్లలేదు’’ అని తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఎలా చనిపోయారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మృతదేహాన్ని తరలించిన తర్వాత ఆ పరిసరాలను రసాయనాలతో పోలీసులు శుభ్రం చేయడం గమనార్హం. Quote
VictoryTDP Posted January 31, 2020 Report Posted January 31, 2020 Corona beer tho start ayyindi Ani samacharam as per TV9 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.