Jump to content

Recommended Posts

Posted
ధరణి ఆశలు ఆవిరి

అమరావతి చుట్టూ భారీగా తగ్గిన భూముల ధరలు
50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో పతనం
మూగబోయిన మాగాణి
3 రాజధానుల ప్రకటనతో వేల కోట్ల నష్టం
ఈనాడు - అమరావతి

ధరణి ఆశలు ఆవిరి

ఓడలు బళ్లయ్యాయి. ఆశలు ఆవిరయ్యాయి. యంత్రాలు, కార్మికుల సందడితో నిన్నటివరకు పులకించిన నేలతల్లి ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. చెమటచుక్కలు చిందిన చోటే ఇప్పుడు అశ్రుధారలు కారుతున్నాయి. తమ సమీప ప్రాంతంలోనే అద్భుత రాజధానికి పునాదులు పడుతున్నాయన్న ఆనందం అంతలోనే కనుమరుగైంది. ఆవిష్కారమవుతున్న అమరావతి కంఠాభరణాలు కళావిహీనమయ్యాయి. మా చుట్టుపక్కల నేల రాష్ట్రానికి మణిమకుటం కానుందని సంబరంగా చెప్పుకొన్న గొంతులే నేడు గోడుగోడుమంటున్నాయి. పట్నం దర్జాను పొదివి పట్టుకుంటున్న పల్లె సీమల్లో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. రాజధాని నిర్మాణంలో త్యాగధనులుగా కీర్తి పొంది ఉప్పొంగిన గుండెలు ఇప్పుడు అవిసిపోతున్నాయి. రెంటికీ చెడ్డ రేవడిలా మారి రైతన్న మోము చిన్నబోతోంది. 3 రాజధానుల ప్రకటన వల్ల రాజధాని అమరావతి, సమీప పల్లెల్లో ఏర్పడిన దుర్భర పరిస్థితులివి.

రాజధాని అమరావతి చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి చిన్నాభిన్నమైంది. రూ.వేల కోట్ల సంపద ఆవిరయింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో, ఆవల ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రాజధానుల గురించి డిసెంబరు17న ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో ప్రస్తావించేవరకు ఎకరా రూ.30లక్షలు పలికిన భూములు ఇప్పుడు రూ.15లక్షలు, రూ.10లక్షలకు తగ్గిపోయాయి. కొందరైతే బయానాగా ఇచ్చిన రూ.లక్షలను కూడా వదులుకుంటున్నారు. అమరావతి నగర పరిధిలోని 29 గ్రామాల్లో ఎకరా, అరెకరా భూములను అమ్ముకుని సమీపంలోని పల్లెటూళ్లలో భూములు కొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదే సమయంలో తెలంగాణలోని మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో భూములవిలువ బాగాపెరిగింది. అక్కడి భూములను రైతులు అమ్ముకుని పల్నాడు ప్రాంతానికి వచ్చి తక్కువ ధరకు కొనుక్కుంటున్నారు.


సగానికి కూడా అడగడం లేదు

‘రాజధానికి 40 కి.మీ.దూరంలో ఉండే క్రోసూరులో మూడున్నరేళ్ల కిందట ఎకరా రూ.36 లక్షల చొప్పున రెండెకరాలు కొన్నా. ఇప్పుడు ఎకరా రూ.14 నుంచి రూ.15 లక్షలూ కొనే దిక్కులేదు’ అని ఒక రైతు వివరించారు. ‘2019 జనవరిలో ఎకరం రూ.32 లక్షల చొప్పున అమ్మి పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చా. ఇప్పుడైతే ఎకరా రూ.12 లక్షలకూ అడగడం లేదు’ అని సమీప గ్రామానికి చెందిన మరో రైతు ఒకరు తెలిపారు.


తాకట్టు పెట్టి తల్లడిల్లుతూ

ఎన్నికలయ్యాక రాజధాని విస్తరణ అవకాశాలు మెరుగుపడతాయని, అప్పుడు మరింత ధర వస్తుందని రైతులు ఆశపడ్డారు. అందుకే తమ అవసరాల కోసం భూములను కుదువ పెట్టి (స్వాధీన రిజిష్టర్‌) ఎకరాపై రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల రుణం తీసుకున్నారు. నెలకు రూ.వందకు రూ.2 వడ్డీ చొప్పున చెల్లించడంతోపాటు రిజిస్ట్రేషన్‌ రుసుములనూ భరించారు. అప్పు తీర్చే సమయంలో భూముల్ని తిరిగి తమ పేరుతో రిజిష్టర్‌ చేయించుకోవడానికి అయ్యే ఖర్చులనూ భరించేందుకు అంగీకరించారు. ఇంత భారీగా అప్పు అంటే పరపతి తగ్గుతుందని బయటకు చెప్పలేదు. ఇలాంటి వారంతా ఇప్పుడు మానసిక వేదనను అనుభవిస్తున్నారు. అప్పుగా తీసుకున్న మొత్తానికి కూడా భూములు అమ్ముడయ్యే పరిస్థితి లేదు. వడ్డీలు చెల్లించడమూ భారమవుతోంది. ఇక భూములపై ఆశలు వదులుకోవడమేనని వాపోతున్నారు.

ధరణి ఆశలు ఆవిరి

అమరావతి విస్తరణపై రైతులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులవంటి వారంతా ఆశలు పెంచుకున్నారు. అమరావతిని నిర్మించడంతోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడితే బాహ్యవలయ రహదారి ఏర్పడుతుందని.. ఫార్మా, వ్యవసాయాధారిత పరిశ్రమలూ వస్తాయని స్థానికులు ఆశించారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంత బృహత్‌ ప్రణాళిక ప్రకటించాక చుట్టూ 30 నుంచి 40 కి.మీ.పరిధిలో భూమి ఎకరా రూ.60లక్షల నుంచి రూ.కోటి వరకు పలికింది. వ్యాపారులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు భూములను కొన్నారు. తమ భూములు ఎప్పటికైనా మంచి ధరలు పలుకుతాయని ఆశించిన రైతులంతా ఇప్పుడు తీవ్ర నిరాశలో మునిగారు.
* ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా దావులూరు/గని ఆత్కూరులో ఒక రియల్‌ఎస్టేట్‌ సంస్థ వ్యవసాయ భూములను ఎకరా రూ.75లక్షల నుంచి రూ.1.30 కోట్లు చెల్లించి అయిదెకరాలకు పైగా కొనుక్కుంది. బయానాగా ఎకరాకు రూ.40లక్షల వరకు ఇచ్చారు. ఒప్పందం మేరకు సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన గడువు ముగిసింది. ఇప్పుడు బయట అమ్ముకోవాలన్నా అడిగే వారు లేరు.
* కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం వద్ద గతేడాది ఎకరం రూ.30లక్షలకు అడిగితే రైతు భూమి అమ్మలేదు. ఇప్పుడు అదే భూమి ఎకరా రూ.13 లక్షలకు విక్రయించారు.
* కంచికచర్లకు 6కి.మీ. దూరంలో ఉండే వీరులపాడు మండలం జుజ్జూరు ప్రాంతంలో ఎకరా గతంలో రూ.45 లక్షల చొప్పున విక్రయించారు. ఇప్పుడు రూ.19లక్షలకు పడిపోయింది. పెనుగంచిప్రోలులో రోడ్డు పక్కన రూ.75 లక్షలకు అడిగిన భూమిని ఇటీవల రూ.42 లక్షలకు అమ్మారు.
* రాజధానికి అంచునే ఉన్న గుంటూరు జిల్లా పెదమద్దూరులో గతంలో ఎకరా రూ.1.09 కోట్లకు విక్రయించారు. దాని కాడిగట్టు భూమిని కొద్ది రోజుల కిందట ఎకరా రూ.30 లక్షలకు విక్రయించారు.
* పెదవడ్లపూడి సమీపంలో రేగడి పొలం గతేడాది రూ.కోటి చొప్పున అడిగారు. ఇంకా ఎక్కువ ధర వస్తుందని అమ్మలేదు. ఇప్పుడదే భూమిని ఎకరా రూ.50 లక్షల చొప్పున అమ్మాల్సి వచ్చింది. దుగ్గిరాల మండలం పేరుకులపూడి, మోరంపూడి ప్రాంతాల్లో ఏడాది కిందట ఎకరా రూ.60 లక్షల వరకు పలకగా.. ఇప్పుడు రూ.40 లక్షల్లోపు ఉంది. నంబూరు ప్రాంతంలో గతంలో ఎకరం రూ.కోటికి పైగా పలికిన భూమిని ఇప్పుడు అడిగేవారే లేరు.
* మేడికొండూరు ప్రాంతంలో రోడ్డు పక్కన ఎకరా గతంలో రూ.80లక్షలకు అమ్మిన భూమికి నెలన్నర కిందట రూ.30 లక్షలకు విక్రయ ఒప్పందం కుదిరింది. రాజధాని మార్పుపై శాసనసభలో సీఎం ప్రకటన చేశాక కొనుగోలుదారు బయానాను వదులుకుని వెళ్లిపోయారు. ఇదే గ్రామంలో రహదారికి బాగా లోపలి వైపు ఉండే భూములు ఒకప్పుడు ఎకరా రూ.30లక్షల వరకు పలకగా, నెలన్నర కిందట రూ.18.50 లక్షల చొప్పున అమ్మారు.
* రాజధాని ప్రాంతానికి 20కి.మీ.దూరంలో.. అవుటర్‌ రింగ్‌రోడ్డు పక్కనే వచ్చే పెదకూరపాడు మండలం తాళ్లూరులో లోగడ ఎకరా రూ.60లక్షల నుంచి రూ.కోటి వరకు క్రయవిక్రయాలు చేసేవారు. రెండు నెలల కిందట ఎకరా రూ.27 లక్షల చొప్పున విక్రయించారు. రాజధాని తరలింపు ప్రకటన తర్వాతైతే రూ.20లక్షలకూ అడిగేవారు కాదని రైతులు పేర్కొంటున్నారు.
* రాజధాని వచ్చిన కొత్తలో అక్కడ భూములు విక్రయించిన రైతులు అమరావతికి 70 కి.మీ. దూరంలోని అద్దంకి- నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పక్కన రూ.25 లక్షల వరకు, గ్రామాల్లో అయితే రూ.15 లక్షల వరకు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ భూములను అడిగేవారే లేరు.


విశ్వాసమే కొంపముంచింది..

రాజధానిని ప్రకటించాక భూములు కొనేందుకు ఇతర ప్రాంతాల వ్యాపారులు, వివిధ వర్గాల వారు ఇక్కడికి వచ్చారు. స్థానికులు కొందరు భూములు చూపించి కొనుగోలులో సహకరించారు. ఒకటి నుంచి రెండు శాతం వరకు కమీషన్‌గానూ పొందారు. ఇంతటితో సరిపెట్టుకోకుండా కొందరు రూ.లక్షల్లో అప్పు తెచ్చి భూములు కొని వాటిని విక్రయించడంపై దృష్టి పెట్టారు. భూముల ధరలు ఇప్పుడు సగానికి సగం తగ్గడంతో వాటిని అమ్ముకోలేక సతమతమతవుతున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఒక రైతు ఇలా రూ.20కోట్ల వరకు అప్పు చేశారు. రుణదాతలూ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు.


పల్నాడుకు తెలంగాణ రైతులు.. ఉద్యోగులు

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల క్రయవిక్రయాలు బాగా తగ్గడంతో పాటు ఇదే సమయంలో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి నుంచి 150 కిలోమీటర్ల దూరంలోనే పల్నాడు ప్రాంతాలు ఉండటంతో అక్కడి ఉద్యోగులు ఇక్కడ  భూములను కొంటున్నారు. పల్నాడులో ఎకరా రూ.7 లక్షల నుంచి రూ.10లక్షల లోపు పలుకుతోంది. నల్గొండ జిల్లాలో ఎకరా అమ్ముకుని వచ్చి ఇక్కడ  రెండు,  మూడు ఎకరాలను కొనుక్కుంటున్నారు.


కమీషన్‌ ఇప్పుడెక్కడ?

‘ఏడాది కిందటి వరకు భూముల క్రయవిక్రయాలపై 1 నుంచి 2 శాతం కమీషన్‌ రూపంలో నెలకు రూ.50వేల చొప్పున ఏడాదిలో సగటున రూ.4లక్షల పైనే ఆదాయం వచ్చేది. ఆరేడు నెలలుగా మొత్తంగా చూసినా రూ.50వేలు రాలేదు. ధరలు తగ్గడంతో అమ్మేందుకు రైతులూ ముందుకు రావడం లేదు. కొనుగోలుదారులూ ఇంకా తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్నారు.

Posted

ante Amaravati is all about real estate ani eenadu paper cheputunatte kada...

 

Posted
5 minutes ago, Android_Halwa said:

ante Amaravati is all about real estate ani eenadu paper cheputunatte kada...

 

Orey dramoji gaa. Don't cry on poor farmers. 

Posted

Naanna athiga aasa pade magadu , athiga aavesa pade aadadi sukhapaddattu charitra lo ledu.... 

Posted

Namo venkatesa movie lo venky itlane edo story cheptadu..Vinjamarlu janjamarlu ainay ani. Atlane undi story :giggle:

Posted
12 hours ago, ChinnaBhasha said:

Namo venkatesa movie lo venky itlane edo story cheptadu..Vinjamarlu janjamarlu ainay ani. Atlane undi story :giggle:

Eedio link please if available

Posted
3 minutes ago, snoww said:

Eedio link please if available

40.40 daggara.. 

Posted

Yendi idi eenadu vadu thelisi vesada thelika vesada ? Idi clear indication isthundinga neutral vunnodiki kuda. Oh my eenadu. Last time ABN vadu rod dimpadu ippudu eenadu vado duty yemo. 

Posted
3 hours ago, Sucker said:

Yendi idi eenadu vadu thelisi vesada thelika vesada ? Idi clear indication isthundinga neutral vunnodiki kuda. Oh my eenadu. Last time ABN vadu rod dimpadu ippudu eenadu vado duty yemo. 

Musugulo guddhulaata yennaallu anukunnademo :)

  • Haha 2
Posted
7 hours ago, Chinna84 said:

Musugulo guddhulaata yennaallu anukunnademo :)

:giggle: frustration ochindemo inka 

Posted
6 hours ago, chandrabhai7 said:

Lol eee arthanadalu bale sammaga unnay 

😂😂😂

Posted
11 hours ago, Sucker said:

Yendi idi eenadu vadu thelisi vesada thelika vesada ? Idi clear indication isthundinga neutral vunnodiki kuda. Oh my eenadu. Last time ABN vadu rod dimpadu ippudu eenadu vado duty yemo. 

Keeping a side of media house

Do you think there were no losses?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...