Jump to content

Babori PA ... care of address for neethi nijayithi


Recommended Posts

Posted

ప్రత్తిపాటి శరత్‌ కంపెనీలో సోదాల

TI.jpg?itok=AgewGUrh ప్రత్తిపాటి శరత్‌, కిలారు రాజేష్ (పాత ఫొటోలు)

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ‌/కడప: ఆదాయపన్ను శాఖ దాడులతో టీడీపీ నాయకుల అక్రమాల డొంక కదులుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం మొదలైన ఐటీ శాఖ సోదాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
kdp.jpg
మరోవైపు మాదాపూర్‌లోని డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్టర్‌ను అరెస్ట్‌ చేసినట్టు డైరెక్టరేట్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) ప్రకటించింది. తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించి 69 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ మేరకు చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ యాజమాని నరేన్‌ చౌదరికి టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. నారా లోకేశ్ అనుచరుడు కిలారి రాజేశ్‌తో నరేన్‌ చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం. కిలారి రాజేశ్‌కు చెందిన రెండు ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కిలారు రాజేష్ వ్యవహారంతో చంద్రబాబు, లోకేశ్‌ టెన్షన్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
TI1.jpg
రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు
కాగా, చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 9 మందితో కూడిన ఐటీ అధికారుల బృందం నిన్నటి నుంచి సోదాలు కొనసాగిస్తోంది. మరోవైపు సీఆర్‌పీఎఫ్‌ అదనపు సిబ్బంది ఈ ఉదయం శ్రీనివాసరావు నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశముందని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
TI2.jpg
జాడ లేని శ్రీనివాసులరెడ్డి
తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) హైదరాబాద్ కార్యాలయంలో ఐటీ సోదారులు ఈ ఉదయం ముగిశాయి. పలు కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న శ్రీనివాసులరెడ్డి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసులరెడ్డి ఎక్కడ ఉన్నారనేది తెలియరాలేదు. వరుస ఐటీ దాడులతో టీడీపీ ముఖ్య నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ అక్రమాలు బయటపడతాయన్న భయంతో టీడీపీ నేతలు వణుకుతున్నారు.

Posted

బాలయ్య చిన్నల్లుడు భరత్‌కు మరో షాక్‌!

 

Sri-Bharat.jpg?itok=6oojhbhy

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత భరత్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. రుణాల చెల్లింపు ఎగవేసిన కారణంగా భరత్‌ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తునకు అబిడ్స్‌ కరూర్‌ వైశ్యా బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా టెక్నో యూనిక్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరిట భరత్‌ కుటుంబీకులు తీసుకున్న రుణం అసలు, వడ్డీ కలిపి రూ. 124 కోట్ల 39 లక్షల 21 వేల, 485 పైసలు.. జనవరి 21, 2020లోగా చెల్లించాలని గతంలో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. అయితే వారు ఇందుకు స్పందించపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ క్రమంలో రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన గాజువాక మండలం, భీమిలి మండలంలోని భూములను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని హెచ్చరించింది. ఇక గతంలో భరత్‌ ఆంధ్రా భ్యాంకుకు సుమారు రూ. 100 కోట్ల రుణం ఎగవేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కరూర్‌ వైశ్యా బ్యాంకుకు రుణం ఎగవేయడంతో ఆస్తుల జప్తునకు నోటీసు జారీ అయ్యింది. కాగా గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

bank.jpg

Posted

చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు

 
DFf.jpg?itok=Xhb0llOG ఆర్‌కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కార్యాలయం ఉన్న భవనం

బాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు ఆస్తులపై గురి

ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఆరోపణలు

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌/కడప అర్బన్‌: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.

ఐటీ అధికారులు  ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఎన్నికల తర్వాత సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్నారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. గురువారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు విజయవాడలోని శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు. అలాగే లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన రాజేశ్‌ ఇంటిలోనూ సోదాలు జరిగాయి.
TRFfd.jpg
ఐటీ శాఖ తనిఖీలుచేస్తున్న భవనంలోకి వెళ్లేందుకు సీఆర్‌పీఎఫ్‌ పోలీసులతో మాట్లాడుతున్న టీడీపీ నాయ్యవాదులు

శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ..
తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ శాఖ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న ఇంటితోపాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల పహారాలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని అధికారులే ఈ సోదాల్లో పాల్గొనడం గమనార్హం. హైదరాబాద్‌ పంజాగుట్ట లుంబినీ ఎన్‌క్లేవ్‌లోని ఆర్‌కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయంతోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.13లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కడపలో శ్రీనివాసులరెడ్డి ఇంట్లో లభించిన సమాచారంతో కడపలోని మరో సబ్‌ కాంట్రాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి ఇంటిలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంట్రాక్టులకు సంబంధించిన పలు లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రూ.300 కోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు 
మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్‌రెడ్డి తనయుడైన శ్రీనివాసులరెడ్డి ఆర్‌కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రూ.కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ పనులు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ కాంట్రాక్ట్‌ పనులు చేసేవారు. ఆదాయానికి సంబంధించిన పన్నులు చెల్లించకుండా ఎగవేశారని పేర్కొంటూ ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. పన్నుల ఎగవేతతోపాటు శ్రీనివాసులరెడ్డి కుమార్తె వివాహం నిశ్చయమైన సమయంలో దాదాపు రూ.300 కోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల వివరాలను తెలియజేసేందుకు అధికారులు నిరాకరించారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ  సోదాలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉత్తర తెలంగాణలోని నేతల ఇళ్లు, కార్యాలయాల్లో.. 
తెలంగాణలోని కరీంనగర్‌లో గురువారం ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు నేతలకు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు ఉన్నాయి.

Posted

Looks like center decided to keep baboru away for ever and targetting his financial resources 

Posted
16 minutes ago, snoww said:

Looks like center decided to keep baboru away for ever and targetting his financial resources 

Sakshi Ni chusi kooda nuvvu modi bodi ante Ela...

Leader movie ni opposition mmeda vaduthunadu

Posted
26 minutes ago, snoww said:

 

Oka donga vidu Donga anadam... Vitahatta hasam 

Posted
19 minutes ago, snoww said:

Looks like center decided to keep baboru away for ever and targetting his financial resources 

so far sannihithulu medhe gaa...babori entruka kooda eekaleru antunnaru

Posted
1 minute ago, kittaya said:

Oka donga vidu Donga anadam... Vitahatta hasam 

adey comedy ...oka donga inkodadini donga anatam...

dhorikina ley ley antha bodi cheyinchaadu ani cover drives already stalk lo vunduntaayi

Posted
2 minutes ago, kittaya said:

Oka donga vidu Donga anadam... Vitahatta hasam 

Adeyga kyamydy. Donga yevaro telypoyindy may 23rd 🤣🤣🤣

Posted
11 minutes ago, Naaperushiva said:

adey comedy ...oka donga inkodadini donga anatam...

dhorikina ley ley antha bodi cheyinchaadu ani cover drives already stalk lo vunduntaayi

Andaru dongale.. janale verri puuvulu Ani marchipothunaru.. 

 

Posted
6 hours ago, kittaya said:

Andaru dongale.. janale verri puuvulu Ani marchipothunaru.. 

 

Yitla anypystundey. Burnol is working 🤣🤣🤣

Posted
7 hours ago, kittaya said:

Oka donga vidu Donga anadam... Vitahatta hasam 

You mean Srujana Chowdhary

Posted

emindi @bhaigan  samara sallaga ee theddulo durinav.... ippudu raids aithey vallaki emanna dorikithe cases pedatharu le kangaru enduku...

esupadam anna tho kalisi  oh forogt iyyala friday anta kada...   Ra...Ja... ka...ja

Posted
Just now, TheBrahmabull said:

emindi @bhaigan  samara sallaga ee theddulo durinav.... ippudu raids aithey vallaki emanna dorikithe cases pedatharu le kangaru enduku...

esupadam anna tho kalisi  oh forogt iyyala friday anta kada...   Ra...Ja... ka...ja

jailganna ki vote vese vallu andhara yesupadam kaaru Samara @3$%

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...