siru Posted February 19, 2020 Report Posted February 19, 2020 ప్రకాశంగారు నిరుపేదగా జన్మించారు. స్వయంకృషితో లాయరై, బారిస్టరై విపరీతంగా ఆర్జించారు. అయితే ఆస్తంతా స్వాతంత్రోద్యమానికి ఖర్చు పెట్టేశారు. ఎవరైనా తన దగ్గరకు వచ్చి సాయం అడిగితే జేబులో ఎంతుంటే అంతా యిచ్చేసేవారు. ఆయన అలా యిచ్చేస్తున్నాడని ఆందోళన పడి అభిమానులు, ప్రజలు ఆయనకు విరాళాలు యిచ్చేవారు. ఆయన దాన్ని దాచుకునేవాడు కాదు. మళ్లీ అదంతా అర్థులకు యిచ్చేసేవాడు. జేబులో డబ్బుందా లేదా అన్న చింతే వుండేది కాదాయనకు. ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై అనేకమంది దర్శకులకు, నటీనటులకు తొలి అవకాశం యిచ్చిన నిర్మాత కె.రాఘవకు మా ‘‘హాసం క్లబ్’’లో సన్మానం చేసినప్పుడు ఆయన ఒక ఉదంతం చెప్పాడు. రాఘవ అనాథ. పొట్టకూటి కోసం మద్రాసు చేరి ప్రకాశం గారి దగ్గర కారు తుడిచే కుర్రాడిగా చేరారు. అప్పుడాయన మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఓ రోజు పొద్దున్నే కారులో చెంగల్పట్టుకి బయలుదేరారు. దారిలో ఆకలేసి టిఫెన్లు తిందామన్నారు. రాఘవ వెళ్లి దగ్గర్లో ఉన్న హోటల్లో టిఫెన్లు కట్టించుకుని వస్తే అందరూ తిన్నారు. బిల్లు ఎంతయింది అంటే రెండో, మూడో రూపాయలైంది. ప్రకాశం తన సెక్రటరీ కేసి తిరిగి, ఇచ్చేయ్ అన్నారు. ‘మీరు వంద రూపాయలిచ్చి, అది ఖర్చయ్యాక మళ్లీ అడగమంటారు. వందా నిన్ననే ఖర్చయిపోయాయి. జేబులో ఏమీ లేదు’ అన్నాడతను. ప్రకాశం గారి జేబు ఎప్పటిలాగానే ఖాళీ. ఇక మిగిలింది డ్రైవరు, క్లీనర్ రాఘవ. ప్రకాశం రాఘవతో ‘‘వెళ్లి ఆ హోటల్ వాడితో ఇలా ప్రకాశం తాలూకు అని చెప్పు. చెంగల్పట్టులో ఎవరినైనా అప్పడిగి, తిరిగి వచ్చేటప్పుడు బాకీ తీర్చేస్తామని చెప్పు’’ అన్నారు. రాఘవ చెప్పగానే హోటల్ వాడు అయ్యయ్యో ప్రకాశం గారా, టిఫిన్ తెప్పించుకున్నది అంటూ మరిన్ని టిఫిన్లు ప్యాక్ చేయించి, కారు దగ్గరకు వచ్చి ఆయనకు దణ్ణం పెట్టి, డబ్బూగిబ్బూ ఏమీ వద్దు, మీలాటి వారు నా హోటల్ టిఫిన్ తినటమే నా అదృష్టం అని చెప్పుకున్నాడు. అదీ ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి. డబ్బు పట్ల ఆయన నిర్లక్ష్యం. ప్రకాశం గారు మనుష్యులను నమ్మి బోల్తా పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి Quote
siru Posted February 19, 2020 Author Report Posted February 19, 2020 ఓ సిమెంటు డీలరు వద్దకు కోటేశ్వర్రావు అనే వ్యక్తి వచ్చి 200 బస్తాల సిమెంటు ఎలాట్మెంట్ ఆర్డరు చూపించి, ‘నువ్వు నాకు సిమెంటు యివ్వనక్కరలేదు, బస్తాకి రూపాయి చొప్పున యిచ్చేసి, యీ బస్తాలను బ్లాక్‌లో బస్తాకు రెండు రూపాయలు ఎక్కువేసి అమ్ముకో’ అన్నాడు. ఆ ఆర్డరు మీద ముఖ్యమంత్రి ప్రకాశం సంతకం ఉంది. ఆ డీలరు దాన్ని ప్రతిపక్ష నాయకులకు అందజేశాడు. కనుక్కుంటే ఆ వ్యక్తికి స్థలం లేదని, యిల్లు కట్టుకునే స్తోమత లేదని తేలింది. ముఖ్యమంత్రే అలాటి కొందరు ఏజంట్ల ద్వారా సిమెంటు బ్లాక్ మార్కెట్‌ను ఎన్‌క్యాష్ చేసుకుంటున్నారని, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ప్రతిపక్షం వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో యీ ఉత్తరం చూపించి నిలదీద్దామనుకున్నారు. స్పీకరు తన ఛాంబర్లో ప్రకాశం గారికి, ప్రతిపక్ష నాయకులకు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశం గారికి అప్పుడు 80 ఏళ్లు. అందర్నీ ఏరా అనే అవాటు. వీళ్లు చెప్పేదేమిటో ప్రకాశం గారికి మొదట అర్థం కాలేదు. ‘సిమెంటేమిటిరా?’ అన్నారు. ఉత్తరం చూపిస్తే ‘అవును, యీ సంతకం నాదే. ఓర్నీ పైన సిమెంటు అని రాశాడా వీడు!’ అని ఆశ్చర్యపడ్డారు. అదేమిటి, చూడకుండానే సంతకం పెట్టారా? అని అందరూ ఒక్కసారిగా అడిగారు. ‘అవునురా, సంగతి చెప్తానుండండి. ఈ కోటేశ్వర్రావు వాళ్ల నాన్న చలపతి అని బాగా డబ్బున్నవాడు. స్వాతంత్య్రపోరాటంలో జైలుకి వెళ్లినవారి కుటుంబాలను ఆదుకునేవాడు. వేలాది కుటుంబాలను పోషించే భారం నెత్తిన వేసుకుని ఆస్తంతా కరగదీసేశాడు. పోయాడు. ఇప్పుడు ఆయన భార్యకి పెద్ద రోగమొచ్చింది. వెల్లూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. చేతిలో పైసా లేదు. అప్పుడు కోటేశ్వర్రావు నా దగ్గరకు వచ్చి సాయం చేయమన్నాడు. జేబులన్నీ వెతికితే ఎనిమిది రూపాయలున్నాయి. అది యిస్తే నిష్ఠూరంగా చూశాడు. ఏం చెయ్యమంటావురా, నా దగ్గర యింతే ఉంది అన్నాను. ‘ముఖ్యమంత్రివి, రెండొందలివ్వలేవా అని వాడంటూంటే నాకు ఎందుకు బతికున్నానా అనిపించింది. లెక్కలేనంత సొమ్ముని మాలాటి వాళ్ల కోసం, మనం యీనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం కోసం చేతికి ఎముక లేకుండా దానం చేసిన చలపతి భార్యను యీ రోజు మృత్యుముఖం నుంచి రక్షించుకోవడానికి రెండొందలైనా యివ్వలేని నేనెందుకు? ఈ పదవెందుకు? అనిపించింది. నువ్వు తలచుకుంటే రెండొందలు యివ్వలేవా? అని వాడు నిలదీశాడు. తలచుకుంటున్నానురా, ఎలాగివ్వమంటావో చెప్పు, ఏం చెయ్యమన్నా చేస్తాను అన్నాను. మర్నాడు యీ కాగితం తెచ్చి సంతకం పెట్టు, నాకు డబ్బు సర్దుబాటవుతుంది అన్నాడు. మీరనేది నిజమే, సంతకం పెట్టేముందు చదవాల్సింది, కానీ చదివినా సంతకం పెట్టేసి వుండేవాణ్ని. అది నా బలహీనత. వాడిని ఎలాగైనా ఆదుకోవాలనే నా తాపత్రయం. నా సొంత డబ్బయినా, ప్రభుత్వం డబ్బయినా అంతే. ‘ఇంత బలహీనమనస్కుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రసంపద కాపాడలేడు అని మీరు అనుకుంటే తప్పేమీ లేదు. నా సొంత ఆస్తే తగలేసుకున్నవాణ్ని, యింత బాధ్యత ఏం మోస్తాను. అన్నట్టు చలపతి భార్య ఆసుపత్రికి తీసుకెళ్లకుండానే పోయిందట. ఆ డబ్బు వెనక్కి యిచ్చేస్తానని కబురు చేశాడు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినవాడ్రా. తల్లికోసం యీ వెధవపని చేశాడు. ఇచ్చేస్తాడులే. ఇక నా రాజీనామా సంగతంటారా, దానిలో అనారోగ్య కారణమో మరోటో రాసి లేఖ తయారు చేయించండి. ఈ కథంతా అందరికీ తెలియటం నాకంత యిష్టం లేదు.’ అని ముగించారు ప్రకాశం. కళ్ల వెంబడి నీళ్లు కారుతూండగా ప్రతిపక్ష నాయకుడు లేచి నిలబడి ‘‘పంతులుగారూ, క్షమించండి’’ అన్నాడు. స్పీకరుగారు తలదించుకుని కన్నీరు కారుస్తున్నాడు. గదిలో అందరికీ ఏడుపు ఆగటం లేదు. ఎందుకంటే వారిలో చాలామంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారున్నారు. తాము జైలులో వుండగా తమ కుటుంబాలు ఎటువంటి అవస్థలు పడ్డాయో తెలుసు వారికి. విషయం అంతటితో ముగిసిపోయింది. ఎవరూ రాజీనామా గురించి యిక ప్రస్తావించలేదు. ఇలాటి పరిస్థితిని ధర్మసంకటం అని నేనెందుకు అంటానంటే ప్రకాశం గార్ని యీ విషయంలో తప్పు పట్టాలా లేదా, ఆయన చేత రాజీనామా చేయించాలా వద్దా అని చటుక్కున చెప్పడం కష్టం. చట్టప్రకారం నేరం చేశారు. కానీ దాని వెనకాల వున్న కారణాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష వేయకూడదు అనగలమా? Quote
aakathaai789 Posted February 19, 2020 Report Posted February 19, 2020 3 minutes ago, siru said: ఓ సిమెంటు డీలరు వద్దకు కోటేశ్వర్రావు అనే వ్యక్తి వచ్చి 200 బస్తాల సిమెంటు ఎలాట్మెంట్ ఆర్డరు చూపించి, ‘నువ్వు నాకు సిమెంటు యివ్వనక్కరలేదు, బస్తాకి రూపాయి చొప్పున యిచ్చేసి, యీ బస్తాలను బ్లాక్‌లో బస్తాకు రెండు రూపాయలు ఎక్కువేసి అమ్ముకో’ అన్నాడు. ఆ ఆర్డరు మీద ముఖ్యమంత్రి ప్రకాశం సంతకం ఉంది. ఆ డీలరు దాన్ని ప్రతిపక్ష నాయకులకు అందజేశాడు. కనుక్కుంటే ఆ వ్యక్తికి స్థలం లేదని, యిల్లు కట్టుకునే స్తోమత లేదని తేలింది. ముఖ్యమంత్రే అలాటి కొందరు ఏజంట్ల ద్వారా సిమెంటు బ్లాక్ మార్కెట్‌ను ఎన్‌క్యాష్ చేసుకుంటున్నారని, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ప్రతిపక్షం వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో యీ ఉత్తరం చూపించి నిలదీద్దామనుకున్నారు. స్పీకరు తన ఛాంబర్లో ప్రకాశం గారికి, ప్రతిపక్ష నాయకులకు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశం గారికి అప్పుడు 80 ఏళ్లు. అందర్నీ ఏరా అనే అవాటు. వీళ్లు చెప్పేదేమిటో ప్రకాశం గారికి మొదట అర్థం కాలేదు. ‘సిమెంటేమిటిరా?’ అన్నారు. ఉత్తరం చూపిస్తే ‘అవును, యీ సంతకం నాదే. ఓర్నీ పైన సిమెంటు అని రాశాడా వీడు!’ అని ఆశ్చర్యపడ్డారు. అదేమిటి, చూడకుండానే సంతకం పెట్టారా? అని అందరూ ఒక్కసారిగా అడిగారు. ‘అవునురా, సంగతి చెప్తానుండండి. ఈ కోటేశ్వర్రావు వాళ్ల నాన్న చలపతి అని బాగా డబ్బున్నవాడు. స్వాతంత్య్రపోరాటంలో జైలుకి వెళ్లినవారి కుటుంబాలను ఆదుకునేవాడు. వేలాది కుటుంబాలను పోషించే భారం నెత్తిన వేసుకుని ఆస్తంతా కరగదీసేశాడు. పోయాడు. ఇప్పుడు ఆయన భార్యకి పెద్ద రోగమొచ్చింది. వెల్లూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. చేతిలో పైసా లేదు. అప్పుడు కోటేశ్వర్రావు నా దగ్గరకు వచ్చి సాయం చేయమన్నాడు. జేబులన్నీ వెతికితే ఎనిమిది రూపాయలున్నాయి. అది యిస్తే నిష్ఠూరంగా చూశాడు. ఏం చెయ్యమంటావురా, నా దగ్గర యింతే ఉంది అన్నాను. ‘ముఖ్యమంత్రివి, రెండొందలివ్వలేవా అని వాడంటూంటే నాకు ఎందుకు బతికున్నానా అనిపించింది. లెక్కలేనంత సొమ్ముని మాలాటి వాళ్ల కోసం, మనం యీనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం కోసం చేతికి ఎముక లేకుండా దానం చేసిన చలపతి భార్యను యీ రోజు మృత్యుముఖం నుంచి రక్షించుకోవడానికి రెండొందలైనా యివ్వలేని నేనెందుకు? ఈ పదవెందుకు? అనిపించింది. నువ్వు తలచుకుంటే రెండొందలు యివ్వలేవా? అని వాడు నిలదీశాడు. తలచుకుంటున్నానురా, ఎలాగివ్వమంటావో చెప్పు, ఏం చెయ్యమన్నా చేస్తాను అన్నాను. మర్నాడు యీ కాగితం తెచ్చి సంతకం పెట్టు, నాకు డబ్బు సర్దుబాటవుతుంది అన్నాడు. మీరనేది నిజమే, సంతకం పెట్టేముందు చదవాల్సింది, కానీ చదివినా సంతకం పెట్టేసి వుండేవాణ్ని. అది నా బలహీనత. వాడిని ఎలాగైనా ఆదుకోవాలనే నా తాపత్రయం. నా సొంత డబ్బయినా, ప్రభుత్వం డబ్బయినా అంతే. ‘ఇంత బలహీనమనస్కుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రసంపద కాపాడలేడు అని మీరు అనుకుంటే తప్పేమీ లేదు. నా సొంత ఆస్తే తగలేసుకున్నవాణ్ని, యింత బాధ్యత ఏం మోస్తాను. అన్నట్టు చలపతి భార్య ఆసుపత్రికి తీసుకెళ్లకుండానే పోయిందట. ఆ డబ్బు వెనక్కి యిచ్చేస్తానని కబురు చేశాడు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినవాడ్రా. తల్లికోసం యీ వెధవపని చేశాడు. ఇచ్చేస్తాడులే. ఇక నా రాజీనామా సంగతంటారా, దానిలో అనారోగ్య కారణమో మరోటో రాసి లేఖ తయారు చేయించండి. ఈ కథంతా అందరికీ తెలియటం నాకంత యిష్టం లేదు.’ అని ముగించారు ప్రకాశం. కళ్ల వెంబడి నీళ్లు కారుతూండగా ప్రతిపక్ష నాయకుడు లేచి నిలబడి ‘‘పంతులుగారూ, క్షమించండి’’ అన్నాడు. స్పీకరుగారు తలదించుకుని కన్నీరు కారుస్తున్నాడు. గదిలో అందరికీ ఏడుపు ఆగటం లేదు. ఎందుకంటే వారిలో చాలామంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారున్నారు. తాము జైలులో వుండగా తమ కుటుంబాలు ఎటువంటి అవస్థలు పడ్డాయో తెలుసు వారికి. విషయం అంతటితో ముగిసిపోయింది. ఎవరూ రాజీనామా గురించి యిక ప్రస్తావించలేదు. ఇలాటి పరిస్థితిని ధర్మసంకటం అని నేనెందుకు అంటానంటే ప్రకాశం గార్ని యీ విషయంలో తప్పు పట్టాలా లేదా, ఆయన చేత రాజీనామా చేయించాలా వద్దా అని చటుక్కున చెప్పడం కష్టం. చట్టప్రకారం నేరం చేశారు. కానీ దాని వెనకాల వున్న కారణాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష వేయకూడదు అనగలమా? Chinnu prakasam gaaru really great ani simple ga cheppalenantha greatest personality British vodi thupaaki gundu ki rommu choopinchina soorudu 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.