psycopk Posted August 5, 2009 Report Posted August 5, 2009 మరో పి. ఆర్. పి. వికెట్ ఔట్? ప్రజారాజ్యం పార్టీ పార్టీ నుంచి ఒకొక్కరే నిష్క్రమిస్తున్నారు. నిన్న ఆ పార్టీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ పార్టీని వదిలి పెట్టారు. ఇపుడు అదే మార్గంలో మరో నేత కూడా పయనించనున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ లో ఉంది ఆ పార్టీని వదిలి వెళ్ళిన గట్టు భీముడు తిరిగి టి. డి. పి. లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల కు చెందిన మాజీ ఎం. ఎల్. ఏ. గట్టు భీముడు ను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్దంగా ఉన్నట్లు సమాచారం. గట్టు భీముడు టి. డి. పి. లో చేరితే మహబూబ్నగర్ జిల్లా లో పార్టీ మరింత బలపడుతుందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడుతోంది. అయితే ఈ విషయం పై మాట్లాడటానికి టి. డి. పి. కి చెందిన నేతలు ఎవరు మాట్లాడటానికి ఇష్ట పడటం లేదు.
Recommended Posts