tamu Posted February 24, 2020 Report Posted February 24, 2020 అయినా ట్రంప్ తన ప్రసంగంలో ఏఏ పదాలను తప్పుగా పలికారన్న విషయానికి వస్తే... భారత ప్రధాని నరేంద్ర మోదీని అందరూ ‘చాయ్ వాలా’ అంటారు కదా. మోదీ కూడా తనను తాను చాయ్ వాలాగానే చెప్పుకుంటారు. ఇదే పదాన్ని పలికేందుకు ఆపసోపాలు పడిన ట్రంప్... చాయ్ వాలాను కాస్తా ‘చివాలా’గా మార్చిపారేశారు. మోదీ తనకు అత్యంత సన్నిహితుడని చెప్పుకునే ట్రంప్... మోదీకి అత్యంత ప్రజాదరణ కలిగించిన చాయ్ వాలా పేరును కూడా సరిగ్గా పలకలేకపోవడం గమనార్హం. ఒక్క చాయ్ వాలాతోనే ట్రంప్ తప్పుల తడకలు ఆగలేదండోయ్.. చాలా పదాలను పలు రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను కూడా పలకలేక ఆయన ఆపసోపాలు పడ్డారు. ‘ది వేదాస్’అనే పదాన్ని ‘ది వెస్తాస్’ అంటూ పలికిన ట్రంప్... స్వామి వివేకానంద పేరును ‘స్వామి వివేక్ మాన్ ‘ అని పలికారు. అలాగే సచిన్ టెండూల్కర్ పేరును ‘సూచిన్ టెండూల్కర్’ అని విరాట్ కోహ్లీని ‘విరూట్ కోహ్లీ’ అని ఉచ్ఛరించిన ట్రంప్... బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ ‘షోలే’ను ‘షోజే’ అని పలికారు. ట్రంప్ తన ప్రసంగాన్ని అలా కొనసాగిస్తూ పోతుంటే... ఆయన నోట నుంచి వచ్చిన తప్పుడు పదాలను గుర్తించిన చాలా మంది వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి ఆయనను ఓ రేంజిలో ఆటాడేసుకున్నారు. Quote
JohnSnow Posted February 24, 2020 Report Posted February 24, 2020 Aina sare avanni chudakunda cheppadu, great. Adhe mana rahu gadu potatoes antadu, Jagan gadu janagana mana palakadam raadhu antadu, Loki gadu aithe TDP ki uri antadu. Quote
cosmopolitan Posted February 24, 2020 Report Posted February 24, 2020 Bane chepadu. Edho thapulu vethakalani kakpothe Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.