hyperbole Posted February 28, 2020 Report Posted February 28, 2020 హైదరాబాద్ : పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి ఆర్థిక చేయూత కోసం ఎప్పుడూ ఎదురుచూసే గ్రేటర్ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ చరిత్రలో గ్రేటర్ హైదరాబాద్‌ను లాభాలబాట పట్టిస్తున్నది. ఎటువంటి చేయూత తీసుకోకుండా స్వయంగా అడుగులు వేస్తున్నది. నగరంలోని 29 డిపోల పరిధిలో తిరుగుతున్న 2,800 బస్సులు కనీవినీ ఎరుగని రీతిలో రెవెన్యూ సాధిస్తున్నది. ప్రతిఏటా రూ.450 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్న ఆర్టీసీ 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఆశాజనకంగా పనిచేస్తున్నది. ఇదే సంప్రదా యం కొనసాగితే కచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నష్టా లు లేకుండా లాభాల్లోకి రావడం ఖాయమని అధికారు లు అంచనాకు వచ్చారు. ఆర్టీసీలో అధికారులు, ఉద్యోగు ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడటం, కండక్టర్లు, డ్రైవర్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు లాభాల్లోకి తెచ్చి బోనస్ తీసుకుందామనే లక్ష్యంతో పనిచేస్తుండటం, ఆపరేషన్ రేషియో(ఓఆర్)ను పెంచుకోవడం వంటి చర్యలతో డిసెంబర్ 2019 నుంచి ఫిబ్రవరి వరకు ఆదాయం పెంచుకుంటూ వస్తున్నది. పెరిగిన చార్జీలతోపాటు రూట్ల రీ షెడ్యూలింగ్, బస్సులు ఖాళీగా రోడ్ల మీద ప్రయాణించకుండా ప్రయాణికులు నిండుగా ఉండేట్లు, రద్దీ సమయాల్లో ఎక్కువ ట్రిప్పులు నడుపుతుండటంతో నష్టాలను తప్పించుకోవడానికి ఆదాయమార్గాల వైపు ప్రయణిస్తున్నది. సమ్మెకు ముందు 3,560 బస్సులుండగా వీటిలో కాలం చెల్లిన బస్సులను తీసివేయగా 2,800 బస్సులు మిగిలాయి. బస్సులు తగ్గినా ప్రయాణికులు తగ్గకపోవడంతోపాటు నిర్వహణ వ్యయం తగ్గడం వల్ల రెవెన్యూ ఆటోమేటిక్‌గా పెరిగింది. అంతేకాకుండా సమ్మెకు ముం దు గ్రేటర్ ఆర్టీసీ ఆదాయం రూ.3.06 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.3.27 కోట్లకు పెరిగింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.450కోట్ల నష్టం ప్రతీ సంవత్సరం వస్తుండగా ప్రస్తుత సంవత్సరంలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు పెరిగిన ఆదాయంతో రూ.380 కోట్లకు కుదించబడింది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఈపీకే బెస్ట్ ఆర్టీసీకీ గుదిబండగా మారిందనే గతంలో ఉన్న విమర్శలను తిప్పికొడుతూ ఇతర జిల్లాలకు మించి గ్రేటర్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. సమ్మెకు ముందు ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్(ఈపీకే) కేవలం కిలోమీటరుకు వచ్చే ఆదాయం రూ.26 ఉండగా ప్రస్తుతం 6 రూపాయలు పెరిగి 32కు చేరింది. రాష్ట్రంలో ఏ జిల్లాలోను కిలోమీటరుకు ఆదాయం పెరుగలేదు. గతంలో 9,15,000 కిలోమీటర్లు తిప్పిన బస్సులను ప్రస్తుతం 8,25,000 కిలోమీటర్లు మాత్రమే తిప్పుతున్నారు. దీనివల్ల బస్సుల నిర్వహణతోపాటు, డీజిల్ ఖర్చు కూడా తగ్గుతున్నది. దీనివల్ల ఆదాయం పెరుగుతున్నది. ఐతే ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ బస్సుల తొలిగింపు వల్ల 3,500 మంది ఉద్యోగులు సర్‌ప్లస్‌గా మిగిలారు. ఇందులో కొంతమందిని వివిధ పనులకు పురమాయిస్తున్నప్పటికీ చాలామంది సర్‌ప్లస్‌గా ఉన్నారు. దీంతో ప్రతినెలా రూ.14 కోట్ల వేతనం ఇవ్వాల్సి వస్తున్నది. కండక్టర్లను ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేస్తున్నప్పటికీ డ్రైవర్లు ఎక్కువగా సర్‌ప్లస్‌గా ఉన్నారు. ఇది కూడా భారం కాకుండా ఉంటే మరింత ఆదాయం పెరిగేది. ఆర్టీసీ ఆదా యం పెంచేందుకు దోహదపడుతుందని గ్రేటర్ హైదరాబా ద్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ని త్యం ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలతో సమీక్షలు జరుపుతూ పక్కాప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి వాస్తావాలను ఉద్యోగుల నుంచి సేకరిస్తూ అవసరమైన రూట్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే ట్రెండ్ కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ ఆర్టీసీకీ నష్టాలు రాకుండా ఉంటాయన్నా రు. ఆర్టీసీకీ లాభాలు వచ్చి ఉద్యోగులు బోనస్ తీసుకోవడం ఖాయమన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.