Hydrockers Posted March 6, 2020 Report Posted March 6, 2020 ప్రస్తుతం దేశంలో బ్యాకింగ్ వ్యవస్థ బాగాలేదు. ఆర్థిక విధానాలతో బ్యాంకులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మొండి బకాయిలు పెరగడం ఆర్బీఐ ఆంక్షలు తీవ్రంగా విధించడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగంలో కుదేలవుతోంది. ఈ క్రమంలో ఎన్నో బ్యాంకులు మనుగడ సాగించలేకపోతున్నాయి. దీంతో ప్రజల సొమ్మును భద్రంగా ఉండే బ్యాంకులు ఆకస్మాత్తుగా మూతపడుతున్నాయి. లేదా ఇతర బ్యాంకుల్లో విలీనమవుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకులతో ప్రైవేటు బ్యాంకులు ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన ఎస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయింది. ఖాతాదారులకు సమధానం చెప్పలేని స్థితికి చేరింది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఈ బ్యాంక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ బ్యాంకు భవిష్యత్ ను ఊహించి తిరుమల తిరుపతి దేవస్థానం తన సొమ్మును ఉపసంహరించుకోవడంతో ఆ సొమ్ము భద్రంగా ఉంది. అయితే ఎస్ బ్యాంక్ లో పెట్టిన పెట్టుబడులను ముందే ఉపసంహరించుకోవడం కాకతాళీయమే. కానీ టీటీడీ తీసుకున్న అనంతరం ఎస్ బ్యాంక్ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం చిత్రంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొన్ని నెలల కిందటే ఆ బ్యాంకు నుంచి సుమారు 900 కోట్ల రూపాయల శ్రీవారి డిపాజిట్లను ఉపసంహరించుకుంది. ఒకేసారి 900 కోట్ల రూపాయలను విత్ డ్రా చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ డిపాజిట్ల మొత్తాన్ని కొనసాగించాలంటూ ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోకుండా తీసేసుకుంది. అదే ఇప్పుడు మేలు చేసింది. లేకుంటే ఇప్పుడు ఆ డబ్బుల కోసం టీటీడీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. రిజర్వ్ బ్యాంకు ఎస్ బ్యాంక్ ను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆ బ్యాంకులోని నగదు ఉపసంహరణపైన ఆంక్షలను విధించింది. ఖాతాదారులు తమ 50 వేల రూపాయల వరకు మాత్రమే నగదును ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ ఆంక్షలు విధించారు. అయితే టీటీడీ ఈ పరిస్థితిని ముందే ఊహించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్ బ్యాంకుతో సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీకి సంబంధించిన డిపాజిట్లు వేశారు. ఈ క్రమంలో ఎస్ బ్యాంకులో 900 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేశారు. అనంతరం ప్రభుత్వం మారింది.. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా వచ్చారు. ఆయన రాగానే ఆ నాలుగు ప్రైవేటు బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను గమనించి డిపాజిట్ల ఉపసంహరణకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎస్ బ్యాంకు నుంచి రూ.900 కోట్లు విత్ డ్రా చేశారని సమాచారం. ఇక టీటీడీకి సంబంధించిన డిపాజిట్లు మిగతా బ్యాంకుల్లో ఉండడంతో వాటిని కూడా ఉప సంహరించుకునే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే టీటీడీ పాలకమండలి ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.