tamu Posted March 17, 2020 Author Report Posted March 17, 2020 2008 లో కత్రిన ఓ పెద్ద బర్త్ డే వేడుకను నిర్వహించింది. ఆ పార్టీకి బాలీవుడ్ లో టాప్ స్టార్లు ఎటెండయ్యారు. షారుఖ్ - గౌరీ ఖాన్.. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్ .. తదితరులు హాజరయ్యారు. ఈ పార్టీలో సల్మాన్ - షారూఖ్ మధ్య ఈగోలు మనస్ఫర్థలు గొడవలకు దారి తీసాయి. ఆ ఇద్దరూ ఆ రాత్రి గొడవలో దాదాపు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నంత పనైంది. ఆ తరువాత.. కత్రినా పార్టీలో సల్మాన్ - ఐశ్వర్య రాయ్ గురించి షారూఖ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని .. దాంతో కోపంగా ఉన్న సల్మాన్ కత్రినా పార్టీని విడిచిపెట్టి వెళ్లాడని అప్పటి వార్తలు వచ్చాయి. Quote
tamu Posted March 17, 2020 Author Report Posted March 17, 2020 ఆ తర్వాత కాలక్రమేణా మార్పు కనిపించింది. 2015 లో సల్మాన్ - షారుఖ్ పాచ్ అప్ అయ్యి తిరిగి కలిసి కనిపించారు. అటుపై ఖాన్ లు కొత్త జీవితాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఇద్దరూ తరచూ ఈవెంట్స్ లో కలిసి కనిపిస్తున్నారు. అభిమానులు వారి స్నేహాన్ని చూసేందుకు అమితంగా ఇష్టపడుతున్నారు. 2018 లో సల్మాన్ - షారూక్ నటించిన `జీరో` చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో కనిపించాడు. తరువాత 2019 లో బచ్చన్ ఇంట్లో దీపావళి పార్టీలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ మేనేజర్ బట్టలు మంటలకు ఆహుతి అయినప్పుడు ఆ మంటలను ఆర్పడం ద్వారా షారుఖ్ పెద్ద సాయం చేశాడు. దానిపై సల్మాన్ ఖాన్ SRK ను ఉద్ధేశిస్తూ ఒక ప్రత్యేక పోస్టును షేర్ చేశాడు. అభిమానులు ఆ ఇద్దరి స్నేహాన్ని కోరుకుంటున్నారు. కలిసి ఉంటే ఆనందిస్తున్నారు. ఇటీవల షారూక్ కెరీర్ డౌన్ ఫాల్ అయినా సల్మాన్ మాత్రం రేసులో ఇంకా దూసుకెళుతున్నాడు. కింగ్ ఖాన్ తిరిగి ట్రాక్ లోకి వచ్చేందుకు కాస్త వేచి చూస్తున్నాడు. ఇప్పటికైతే ఖాన్ ల మత్తు దిగిపోయినట్టే. కలిసి ఉంటేనే కలదు సుఖం.. అంటున్నారు. కాలంతో పాటే వచ్చిన మార్పు ఇది. Quote
johnydanylee Posted March 17, 2020 Report Posted March 17, 2020 appati news...ippudu enduku estunnadu? ennodhi?? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.