Jump to content

Recommended Posts

Posted
నా ప్రాణాలకు ముప్పు

ఆంధ్రప్రదేశ్‌లో నాకు, నా కుటుంబానికి భద్రత లేదు
పాలకులు ఎంతో అసహనంగా ఉన్నారు
వారిది ఫ్యాక్షన్‌ చరిత్ర, కక్ష సాధింపు వైఖరి
కేంద్రమే జోక్యం చేసుకోవాలి, రక్షణ కల్పించాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ పేరుతో కేంద్ర హోంశాఖకు లేఖ
లేఖ తనదేనని ధ్రువీకరించని రమేశ్‌కుమార్‌
 ఈనాడు - అమరావతి

18ap-main2a_11.jpg

నాపైనా, నా కుటుంబసభ్యులపైనా భౌతికదాడులు చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుత పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహన వైఖరి, ప్రతీకారేచ్ఛలను పరిగణనలోకి తీసుకుని నాకు, నా కుటుంబసభ్యులకు ఆపద ఏర్పడిందని ఆందోళన చెందుతున్నాను. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖను శరణు కోరడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కేంద్ర రక్షణ బలగాలను అందించి మాకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాను.

‘తరచూ నాకు బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. కనీసం నా కుటుంబ సభ్యులనూ వాళ్లు విడిచిపెట్టలేదు. వాళ్లకు మాత్రమే మేలుచేసే ఎన్నికలు ఆగకూడదని, నేను ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే ఉద్దేశంతోనే నన్ను ఇంతలా బెదిరిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన భద్రత, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను అనుసరించి ఎన్నికలను నిష్పక్షపాతంగానే నిర్వహించాలనే సంకల్పానికే నేను కట్టుబడి ఉన్నాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోను. ఇప్పుడు సుప్రీంకోర్టు నా చర్యలనే సమర్థించింది. కానీ మున్ముందు నా దారి అంత సాఫీగా ఉండబోదు. రాజ్యాంగ వ్యవస్థలకు సరైన గౌరవం ఇవ్వడం తెలియని ప్రభుత్వ తీరుతో నాకు చాలా పరీక్షలు, సవాళ్లు, వైరుధ్యాలు ఎదురుకానున్నాయి’’  

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ పేరుతో కేంద్ర హోంశాఖకు లేఖ!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ రాసినట్లుగా ఉన్న ఒక లేఖ బుధవారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో నాకు, నా కుటుంబానికి ఎలాంటి భద్రతా లేదు. కేంద్రప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలి. ఇక్కడి పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్‌ చరిత్ర, కక్షసాధింపు వైఖరితో ఈ నిర్ణయానికి వచ్చాను’ అని ఆ లేఖలో రమేశ్‌కుమార్‌ పేర్కొన్నట్లుగా ఉంది. ఆ లేఖలో ఉన్న విషయాలు స్థూలంగా ఇలా ఉన్నాయి..‘‘రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో నాకు, నా కుటుంబానికి భద్రత విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ సమయంలో నేను హైదరాబాద్‌లో ఉండటమే కొంత సురక్షితం. అలాగని పూర్తిగా కాదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కార్యాలయంలోనే పోలీసుల రక్షణలో ఉంటున్నాను. పూర్తి రక్షణ లేకుండా బయటకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నాను. ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతే నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుంది. నా శ్రేయోభిలాషులు, నాతో కలిసి పనిచేసేవారు, భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారూ నన్ను జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. నాకు వస్తున్న బెదిరింపులపై రాష్ట్ర యంత్రాంగానికి పూర్తి అవగాహన ఉన్నట్లు లేదు. నాపైనా, నా కుటుంబసభ్యులపైనా భౌతికదాడులు చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుత పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహన వైఖరి, ప్రతీకారేచ్ఛలను పరిగణనలోకి తీసుకుని నాకు, నా కుటుంబసభ్యులకు ఆపద ఏర్పడిందని ఆందోళన చెందుతున్నాను. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖను శరణు కోరడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కేంద్ర రక్షణ బలగాలను అందించి మాకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఈ రక్షణ ఏర్పాట్లు కొనసాగాలి. ఈ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వారి అనుయాయులు, నేరగాళ్లు నాపై దాడికి సిద్ధంగా ఉన్నారు. వారి నేరచరిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ బాధాకరమైన అభిప్రాయానికి వచ్చాను’’ అని లేఖలో ఉంది.
‘‘మీరు తక్షణమే నాకు రక్షణ ఏర్పాట్లు చేయగలిగితే కనీసం మిగిలిన ఎన్నికల ప్రక్రియనైనా కొంత స్వేచ్ఛగా నిర్వహించేందుకు వీలుంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి పూర్తిన్యాయం చేయగలను. అప్పుడు తక్షణమే నా విధులను చట్టప్రకారం, సమయానుగుణంగా నిర్వహించేందుకు వీలుంటుంది. మీరు సానుకూల నిర్ణయం తీసుకుంటే ఆత్మవిశ్వాసంతో నా ధర్మాన్ని నిర్వహిస్తాను’’ అని ఉంది.

పోలీసులపై అంచనాలు తలకిందులయ్యాయి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ప్రకటనను మార్చి 7న విడుదల చేశాం. ఎన్నికల ప్రకటనకు ముందే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీఐజీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించాను. రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు, హింస జరగకుండా ఉండేందుకు రక్షణ చర్యలు కల్పిస్తామని, బలగాలను అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోలీసుశాఖ మీద నేను పెట్టుకున్న అంచనాలన్నీ తొలిదశ నామినేషన్ల నాటికే తారుమారయ్యాయి. చిన్న, పెద్ద ప్రతిపక్షపార్టీలన్నీ ముక్తకంఠంతో గగ్గోలు పెట్టినట్లే పోలీసుల సాయంతో అధికార పార్టీ హింసకు, బెదిరింపులకు పాల్పడింది. దాదాపు 35 చోట్ల నామినేషన్లను అడ్డుకోవడం, 23 చోట్ల బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెదేపాను, భాజపా-జనసేన కూటమిని లక్ష్యంగా చేసుకుని 55 చోట్ల దాడులు జరిగాయి. ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించారు. ఎప్పుడూ లేనంత స్థాయిలో ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయి’’ అని ప్రస్తావించారు.

18ap-main2c_2.jpg

అదో కిరాతక ఆర్డినెన్సు
‘‘రాష్ట్ర ప్రభుత్వం కిరాతకమైన ఆర్డినెన్సును (2/2020) తీసుకొచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేరాలకు పాల్పడేవారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, ఎన్నికల్లో అనర్హత వేటు వేసేలా ఈ ఆర్డినెన్సు వీలు కల్పిస్తోంది. వాళ్ల ఇళ్లలో మద్యం, నగదు దొరికితే ఎన్నికల్లో గెలిచినవారినీ అనర్హులను చేయొచ్చు. తమను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ ఆర్డినెన్సును తెచ్చారని ప్రతిపక్షాలు అభివర్ణించాయి.
వారి వాదనకు బలం చేకూర్చేలా అధికార పార్టీవారు ప్రతిపక్ష అభ్యర్థులు, నాయకుల ఇళ్లలో మద్యం సీసాలుంచి పోలీసులను పంపి అరెస్టు చేయించిన ఉదంతాలూ వెలుగులోకి వచ్చాయి. రాజకీయ పక్షాలు ప్రచారానికి వెళ్లడానికే భయపడే పరిస్థితి ఉంది. ఈ హింసతో ఎప్పుడేం జరుగుతుందో అనే మానసిక ఆందోళనతో పోలింగ్‌ శాతం పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న కరోనా భయంతో ఎగువ, ఉన్నతస్థాయి ప్రజలు పోలింగు కేంద్రాలకు వెళ్లే పరిస్థితీ లేదు. 70% పంచాయతీలు ఏకగ్రీవాలు చేసుకునేలా అధికారపార్టీ వ్యూహం రచించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో హింసను అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కఠినచర్యలు చేపట్టింది. మరోవైపు కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, జనం పెద్ద ఎత్తున ఒకచోట గుమిగూడకూడదనే ఆదేశాలతో ఈ ఎన్నికల దృశ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగితే భారీగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చే అవకాశం ఉండటంతోపాటు బ్యాలెట్‌ పేపర్ల వినియోగంతో ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. జాతీయ యంత్రాంగం సూచనలు, కేంద్ర వైద్యారోగ్య నిపుణుల సలహాలు తీసుకున్నాక.. ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సరైన నిర్ణయమే తీసుకుంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఎన్నికల కమిషన్లు ఎన్నికలను వాయిదా వేశాయి. కానీ ఏపీలో అధికారపక్షానికి తమ వ్యూహం ప్రకారం అంతా నడవట్లేదనే భయం ఈ నిర్ణయంతో మొదలైంది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ చర్యలనే సమర్థించింది. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మాత్రం ఎత్తివేయాలని సూచించింది’’ అని ఆ లేఖలో తెలిపారు.
మా ఆదేశాలు అమలు కాలేదు
‘‘తదుపరి విడత ఎన్నికల్లోనైనా ఉల్లంఘనలను అడ్డుకుని ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆ లక్ష్యం అందని ద్రాక్షే. మొదటి విడత ఎన్నికల్లో జరిగిన అవకతవకలు రానున్న రెండు విడతల్లో జరగకూడదని గట్టి సంకల్పంతో ఉన్నాం. అదే సమయంలో పలు నివేదికలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు, మీడియా కథనాల ఆధారంగా అవకతవకలకు పాల్పడిన పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాం. ఆ చర్యలు ఇవీ..
* గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, గుంటూరు రూరల్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీల బదిలీ
* శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీల బదిలీ
* పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐల బదిలీ
* మాచర్ల సీఐ సస్పెన్షన్‌
ఈ చర్యలేవీ నచ్చని రాష్ట్ర ప్రభుత్వం మా ఆదేశాలను ఇంతవరకు అమలు చేయలేదు. ఇంతకుముందు చెప్పినట్లు ప్రభుత్వం సుప్రీంకు వెళ్లినా.. అక్కడా మా వాదనకే బలం చేకూరింది. తీర్పు పూర్తిపాఠం ఇంకా రాలేదు’ అని పేర్కొన్నారు.

‘‘నాకు ఎంతో గొప్ప ట్రాకు రికార్డు ఉంది. జిల్లా కలెక్టర్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత పిన్న వయసు గల ఈవోగా, పన్నుల కమిషనర్‌గా నాలుగేళ్ల పాటు పనిచేశాను. ఎంతో కీలకమైన గృహనిర్మాణం, సహకారం, వ్యవసాయం, మార్కెటింగ్‌, ఆర్థికశాఖలకు కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శి స్థాయిలో పనిచేశాను. 2009 నుంచి రాష్ట్ర గవర్నర్‌కు ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహించాను. తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా 2016లో నియమితుడినయ్యాను’’ అని తెలిపారు.
ధ్రువీకరించని కమిషనర్‌
‘ఈ లేఖ మీరు రాసిందేనా’ అని ఈనాడు-ఈటీవీ ప్రతినిధి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ను ప్రశ్నించగా.. ఆయన ధ్రువీకరించలేదు.


ప్రభుత్వ హామీలు అపహాస్యం

‘‘కడప జడ్పీ స్థానం ఒక్క ఓటు కూడా పడకముందే అధికారపార్టీకి ఏకగ్రీవంగా దక్కింది. అందుకు అక్కడ ముందెన్నడూ లేనంత హింస జరిగింది. హింస జరగకుండా చూస్తామని పదేపదే ప్రభుత్వం హామీ ఇచ్చినా అది అపహాస్యమే అయింది. గెలవకపోతే మంత్రుల పదవులు పోతాయని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లివ్వబోనని ముఖ్యమంత్రి చెప్పడంతో ఎలాగైనా ఏకగ్రీవం చేయాలని అధికార పార్టీ నాయకులు చూశారు. అందుకే ఇష్టానుసారం దాడులు చేశారు. వీటిని ప్రసార మాధ్యమాలు సాక్ష్యాలతో బయటపెట్టాయి. పౌరులు ఈ పరిణామాలు చూసి నిర్ఘాంతపోయారు. గంటగంటకీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులొచ్చాయి. వీటిని పరిష్కరించేందుకు ఎన్నికల పరిశీలకులుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కలెక్టర్లకు, ఎస్పీలకు ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనిపించలేదు. వారు రోజూ క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నమైన నివేదికలు ఇచ్చేవారు’’ అని వివరించారు.


ముఖ్యమంత్రి కులపక్షపాతం అంటగట్టారు

18ap-main2b_6.jpg

‘‘మార్చి 15న ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచి వ్యక్తిగతంగా నాపైన, ఎన్నికల కమిషన్‌పైన గతంలో ఎప్పుడూలేని విధంగా దాడి ప్రారంభమైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆక్షేపణీయ పదాలతో నాకు కుల పక్షపాతం అంటగట్టారు. అక్కడినుంచి మంత్రులు, అసెంబ్లీ స్పీకర్‌ సహా.. నాకు లేనిపోని దురుద్దేశాలను ఆపాదిస్తూ దూషించారు. ప్రభుత్వ పక్షపాత ధోరణి, సత్తా లేని ప్రభుత్వ, పోలీసు అధికారులను చూస్తుంటే.. వచ్చే విడత ఎన్నికలను సజావుగా నిర్వహించాలంటే ఎన్నికల యంత్రాంగం నుంచే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాలి. కానీ ప్రభుత్వం నా ఆదేశాలను సుప్రీంకోర్టులో కేసుందనే నెపంతో అమలు చేయలేదు.  ఈ స్థాయిలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ప్రతిపక్షాలకు కనీసం పోరాడే అవకాశం కూడా ఉండదు. అధికారపక్షం చెప్పినట్లు నేను ఎట్టి పరిస్థితుల్లో చేయను. కానీ వాళ్లు చెప్పిందే చేయాలని వాళ్లు నన్ను బెదిరించడానికి, బలవంతపెట్టడానికి ప్రయత్నించే అవకాశముంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

 

@kittaya

Posted
6 minutes ago, kidney said:

Its official: Fake dramas by Phulkas

 

 

He neither denied nor accepted. Leave it at that instead of spweing your bile.

Posted
17 minutes ago, Somedude said:

He neither denied nor accepted. Leave it at that instead of spweing your bile.

intha clear ga stmt ichadu gaa khakha..  we believe in ABN not ANI antunnava??

N Ramesh Kumar: I haven't written any letter to Union Home Secretary Ajay Bhalla which is being circulated in a section of media.

 

Posted
39 minutes ago, kidney said:

intha clear ga stmt ichadu gaa khakha..  we believe in ABN not ANI antunnava??

N Ramesh Kumar: I haven't written any letter to Union Home Secretary Ajay Bhalla which is being circulated in a section of media.

 

Ante clear ga @Somedude cheptunadu kada...neither denied nor accepted ani...nammochu kada..!!! 

  • Haha 1
Posted
43 minutes ago, Somedude said:

He neither denied nor accepted. Leave it at that instead of spweing your bile.

Denied...Accepted.

Idi etlundi ante...CBN vote for note case la dormi apudu a voice neede na ante, how can they tap my phone anatu vundi..

  • Haha 1
Posted

Ee sari matram pulka media self goal esukunatte

Letter vishayam jaggadu vadilipettadu

Tikka regindi ante ban chesi mingina mingutadu ABN ni fake news spreading on govt ani

Posted
2 minutes ago, Hydrockers said:

Ee sari matram pulka media self goal esukunatte

Letter vishayam jaggadu vadilipettadu

Tikka regindi ante ban chesi mingina mingutadu ABN ni fake news spreading on govt ani

MLC la leg petti gelikinanduku ekanga Council ae poindi

ipudu Lemongadda gadi elections postpone ki Sendraal saar Leader of the opposition povadam khayam

  • Haha 1
Posted

Time bad vunapudu, all holes close chesukuni, situation kosam wait cheyale....Sendraal saar endi vaa itla self goal eskoni suicide chesukunta antadu...

Evadayya CBN ni visionary annadi ? Idi ae rakam chanakyam ra ayya..

  • Haha 1
Posted
1 hour ago, Android_Halwa said:

MLC la leg petti gelikinanduku ekanga Council ae poindi

ipudu Lemongadda gadi elections postpone ki Sendraal saar Leader of the opposition povadam khayam

Already 3 fut

Inko 4 lagite leader of opposition fasal.

Posted

ధ్రువీకరించని

 

idi okkati petti kadupu manta mottam rasi chupincharu ga yellow pulka paper gadu

Posted
1 hour ago, Android_Halwa said:

Time bad vunapudu, all holes close chesukuni, situation kosam wait cheyale....Sendraal saar endi vaa itla self goal eskoni suicide chesukunta antadu...

Evadayya CBN ni visionary annadi ? Idi ae rakam chanakyam ra ayya..

Rajya sabha elections kuda post pone chestara ?

 

Posted

This showcases.... 

Media lo kooda vachevi nijama kada Ani maname druvakarinchali ika nunchi... 

 

🦶

Posted
Just now, kittaya said:

This showcases.... 

Media lo kooda vachevi nijama kada Ani maname druvakarinchali ika nunchi... 

 

🦶

Lemongadda is nippu

Posted
3 minutes ago, Migilindi22 said:

Lemongadda is nippu

Paracetamol tho nippu Ni kooda thokkachu

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...