Jump to content

* INDIAN mela in Denmark - Succesful *


Recommended Posts

Posted

[url=http://tv5news.in/international_news/article-id-138-name-indian-mela-at-denmark-.htm]http://tv5news.in/international_news/article-id-138-name-indian-mela-at-denmark-.htm[/url]
[img]http://tv5news.in/international_news/photos/138/denmar%20-%20ind.jpg[/img]
[size=12pt]
డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల భారతీయ మేళా కార్యక్రమాన్ని డెన్మార్క్‌లో నిర్వహించారు. అక్కడ మొట్టమొదటి సారిగా జరిగిన ఈ మేళాలో దాదాపు 1300 మంది పాల్గొన్నారు. ఈ మేళా ముఖ్య ఉద్దేశం డెన్మార్క్‌లో భారతీయ సంస్కృతిని అందరికీ తెలపడం. ఇందులో భాగంగా రకరకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేసి అందులో భారతదేశ ఆహార పదార్థాలను, చేనేత వస్త్రాలను, కళలను, ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌ను భారతీయులే గాక విదేశీయులు కూడా సందర్శించారు. అంతే కాక దక్షిణ, ఉత్తర భారతదేశ నృత్యాలు, పంజాబీయుల సంగీత విభావరి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ వారు భారతీయులంతా ఒక్కటే, ఎలాంటి మతపరమైన భేదాలు లేవు అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా దిగ్విజయంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగారు. ఈ కార్యక్రమం మన్మోహన్‌సింగ్, మన్వీర్ సింగ్, అమర్‌నాథ్ పొట్లూరి, రాజేంద్ర తునుగుంట్ల, హజీమ్, కిరణ్ చెవ్వూరు, సునీల్ గుర్రం, వెంకీ, విజయ్ భాస్కర్, కరీమ్, సునీల్, జయ చంద్ర, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
[/size]

×
×
  • Create New...