raghuraj Posted March 31, 2020 Report Posted March 31, 2020 ఇప్పుడు ప్రపంచం కరోనా వైరస్ వ్యాప్తి తో ఇబ్బందులు పడుతుండటానికి కారణం ఒకరకంగా తన శాప ఫలితమే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వివాదాస్పద స్వామీజీ నిత్యానంద. ఆ మధ్య తనను చాలా మంది గేలి చేశారని, ఇండియాలోనే కొందరు తన మీద జోకులు వేశారని, ఇప్పుడు అలాంటి వాళ్లే ఇళ్లకు పరిమితమై భయంభయంగా బతుకుతున్నారని ఈ స్వామీజీ చెప్పుకొచ్చారట. తన ఏకాంత వాసాన్ని చూసి నవ్విన వాళ్లు ఇప్పుడు బలవంతంగా ఏకాంత వాసాన్ని గడుపుతున్నారని.. తనను పరిహసించిన వారికి ఇప్పుడు తగిన శాస్తి జరిగిందనేంత రీతిలో ఆనంద పడిపోతున్నాడట ఈ శృంగార స్వామీజీ! గత ఏడాది డిసెంబర్లో నిత్యానంద గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిత్యానంద ఎక్కడో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడని, ఇక్కడ భక్తి ముసుగులో సంపాదించిన సొమ్ముతో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి.. నిత్యానంద అక్కడకు తరలి వెళ్లాడని వార్తలు వచ్చాయి. తను కొనుగోలు చేసిన ద్వీపాన్ని నిత్యానంద ఒక దేశంగా ప్రకటించుకున్నాడని, కైలాసం అంటూ పేరు పెట్టుకుని తన దేశానికి గుర్తింపును ఇవ్వాలని ఐక్యరాజ్యసమితిని సైతం నిత్యానంద కోరినట్టుగా వార్తలు వచ్చాయి. నిత్యానంద అంటే ఇండియాలో ఒక కమేడియన్ లా చూడటం కొనసాగుతూ ఉంది. ఆ క్రమంలో.. అతడి సొంత దేశం కాన్సెప్ట్ మీద కూడా నెటిజన్లు జోకులు వేశారు. ఆ జోకులు నిత్యానందకు కోపం తెప్పించినట్టుగా ఉన్నాయి. తన ఏకాంత వాసాన్నే పరిహసించారని, ఇప్పుడు భారతీయులు క్వారెంటైన్ పాట్లు పడుతున్నారని అంటున్నాడట నిత్యానంద. తనకు కోపం తెప్పించినందుకు ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని అంటున్నాడట. మరి ఈ స్వాములోరి మాటలను నమ్మేవారు ఎవరో కానీ, కరోనా వైరస్ వ్యాప్తిని నిత్యానంద తనను పరిహసించినందుకు ప్రతిఫలమే అని చెప్పుకుంటూ.. తను చాలా మహిమాన్వితుడిని అని చెప్పుకోదలిచినట్టుగా ఉన్నారు. అదట ఈ స్వామీజీ పవర్! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.