WHATSSAPP Posted April 1, 2020 Report Posted April 1, 2020 తెలుగువారికి అండగా.. Apr 02, 2020, 03:42 IST అమెరికాలోని మన విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అక్కడి ప్రభుత్వ ప్రతినిధులకు సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయిన వేలాది తెలుగు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు ఆర్థిక, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకాకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ (ఆపి), నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) తదితర సంస్థల ద్వారా విద్యార్థులకు సహకారం అందేలా చర్యలు చేపట్టింది వర్సిటీలతో సంప్రదింపులు ► తెలుగు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్న అమెరికా యూనివర్సిటీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ► యూటీ డల్లాస్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ – డెంటాన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజ్ స్టేషన్, జార్జియా టెక్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, టెక్సాస్ ఏ అండ్ ఎం కార్పస్ క్రిస్టి, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ, క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, టల్ లహస్సీ తదితర వర్సిటీల్లో మన తెలుగు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ► విద్యార్థులకు ఏ సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు ‘సాక్షి’కి చెప్పారు. ► విద్యార్థుల్ని ఫ్లాట్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని.. ఏ విద్యార్థికీ ఇలాంటి ఇబ్బంది వస్తే వెంటనే ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎస్ఏ)ను నేరుగా సంప్రదించవచ్చన్నారు. విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రతి వర్సిటీలో కో–ఆర్డినేటర్లు ఉన్నారన్నారు. ► యూనివర్సిటీలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయని, విద్యార్థులు వర్సిటీ క్యాంపస్‌లను వినియోగించనందున స్టైఫండ్ రూపంలో కొంత మొత్తం తిరిగి చెల్లిస్తున్నాయన్నారు. భయమొద్దు.. మేమున్నాం తెలుగు విద్యార్థుల యోగక్షేమాల గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం జగన్ సూచనల మేరకు విద్యార్థులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ కుమార్ అన్నవరపు, అట్లాంటా, యూఎస్ఏ email: saikumarannavarapu@gmail. com (+16786407682) ‘ఆపి’ ఆపన్న హస్తం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ (ఆపి) ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థుల సంరక్షణ, సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. ‘ఆపి’ వైద్యులు సదా అందుబాటులో ఉంటారు. – డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ, ‘ఆపి’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జాగ్రత్తలు తీసుకున్నాం లూసియానాలోని సదరన్ వర్సిటీతో పాటు ఇతర వర్సిటీల్లోని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనవాళ్లెవరూ కరోనా బారినపడలేదు. –శ్రీనివాసరెడ్డి గవిని, సదరన్ వర్సిటీ ప్లానింగ్ డైరెక్టర్, లూసియానా email: reddy& gavini@ subr.edu (225 771 2277) ‘నాటా’ బాసట నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో యూఎస్‌లోని తెలుగు విద్యార్థులకు సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. – డాక్టర్ రాఘవరెడ్డి, అధ్యక్షుడు, నాటా ఫెలోషిప్స్ ఆపలేదు అమెరికా వర్సిటీల్లో ఫెలోషిప్స్ ఆపేశారన్నది అవాస్తవం. విద్యార్థుల క్షేమంపై మేమంతా శ్రద్ధ వహించాం. ఎలాంటి ఇబ్బందుల్లేవు. – ప్రొఫెసర్ అప్పారావు, డైరెక్టర్, క్లెమ్సెన్ యూనివర్సిటీ email: [email protected] భద్రంగా ఉన్నారు మన విద్యార్థులు భద్రంగా ఉన్నారు. ఎటువంటి అవసరమొచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు. – ప్రొఫెసర్ శ్రీనివాసరావు మెంట్రెడ్డి్డ, అలబామా ఏ అండ్ ఎం యూనివర్సిటీ email: [email protected] మేమంతా క్షేమం తెలుగు విద్యార్థులకు ఎలాంటి భయం లేదు. మేమంతా ఇక్కడ క్షేమంగా ఉన్నాం. – రవితేజ పసుమర్తి, కెన్నెస్సీ స్టేట్ వర్సిటీ విద్యార్థి, అల్ఫారెటా Quote
Catabolite Posted April 1, 2020 Report Posted April 1, 2020 I think Jagan anna is checking AFDB everyday. Quote
cosmopolitan Posted April 1, 2020 Report Posted April 1, 2020 12 minutes ago, Catabolite said: I think Jagan anna is checking AFDB everyday. I think @bhaigan Id jagan dhi.. Quote
cosmopolitan Posted April 1, 2020 Report Posted April 1, 2020 Ikada and social media trolls valle.. anna recorded live vadiladu Quote
bhaigan Posted April 2, 2020 Report Posted April 2, 2020 19 minutes ago, cosmopolitan said: I think @bhaigan Id jagan dhi.. ayiunte manchide ede dialogue PK H1's ki andaga nilabadatha ani matladinappudu emi ayindi appudu @cosmopolitan id PK dha Quote
bhaigan Posted April 2, 2020 Report Posted April 2, 2020 MLA's , MP's and MLC's ki paisalu takkuva enti cheppu bhayya , vallaki salaries cut chesthe entha cut cheyakapothe entha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.