WHATSSAPP Posted April 4, 2020 Report Posted April 4, 2020 రోగం కన్నా చికిత్స వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా ? : రావణాసురుడి తో శనేశ్వరుడు ఒక సారి ఛాలెంజ్ చేసాడట ! "నేను పట్టానంటే ఎవడైనా అష్ట కష్టాలు పడాల్సిందే ! త్వరలో నిన్ను పడుతాను . మూడు నెలల పాటు నా పీడా నీకు ఉంటుంది నీకు అష్ట కష్టాలు గ్యారంటీ " - ఇది శనీశ్వరుడి ఛాలెంజ్ ! రావణాసురుడు " నేను ముల్లోకాలను జయించాను . దేవతలందరు నా చేతిలో ఓడి పోయారు . నువ్వు నీ ఛాలెంజ్ లో గెలవ లేవు " అని చెప్పి శనీశ్వరుడికి దొరకకుండా ఒక మడుగు లోపల దాక్కున్నాడట ! సమయం కాగానే బయటకు వచ్చి " శని! నువ్వు నీ ఛాలెంజ్ లో ఓడావు! నన్ను పట్టలేక పోయావు . చూడు నేనే గెలిచాను " అన్నాడట. అందుకు శని గట్టిగా నవ్వి " ఒరేయ్ పిచ్చాడా ! రాజా భవనం లో అన్ని సుఖాలతో బతకాల్సిన నువ్వు మడుగు లో దాక్కున్నావంటే అది నా ప్రభావం కదా ?" అన్నాడట . ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది . ఇది నూటికి నూరు పాళ్ళు సమంజసం ! కర్ఫ్యూ ముగియడానికి ఇంకా పది రోజులు వుంది . లాక్ డౌన్ ప్రకటించినప్పుడు మనకు ఈ కరోనా వల్ల ఇటలీ లాగే ప్రమాదం జరుగుతుంది అనే భయాందోళనలు ఉండేవి . ఈ 15 రోజుల్లో కరోనా భారత దేశం పై చూపుతున్న ప్రభావం బిన్నం అనేది అందరూ ఒప్పు కొంటున్న విషయం . దీనికి కారణం నేను చెప్పినట్లు మలేరియా నిరోధకత జన్యు పూల్ ను మనం కలిగి ఉండడమా లేదా బీసీజీ టీకా ల ప్రభావమా మరొకటా అనేది ఇదమిత్తంగా తేలాక పోయినా ప్రభావం పాశ్చాత్య సమాజం పై ఉన్న స్థాయిలో ఇక్కడ లేదనేది తేట తెల్లం అయ్యింది . మనం కరోనా పై పోరులో ఇటలీ మోడల్ ను అనుసరిస్తే లాభం లేదు దీని కోసం ఇండియన్ మోడల్ ను రూపొందించు కోవాలి అని ఈ రోజు చాల మంది అనుకొంటున్నారు . వ్యక్తులకన్నా ప్రభుత్వం గొప్పది . ప్రభుత్వానికి సూచనా లు సలహాలు ఇస్తే మంచిదే . ప్రభుత్వానికి అన్ని వైపులా నుండి ఇన్పుట్స్ ఉంటాయి . ప్రభుత్వ నిర్ణయం వెలువడానికి ఇంకా సమయం వుంది . ఈ లోగా సోషల్ మీడియా లో కింది మెసేజ్ వైరల్ అవుతోంది . ఏప్రిల్ 15 తరువాత మరో 45 రోజులు పొడిగిస్తే కరోనా పీడా మనకు వదిలి పోతుంది అనేది దీని సారాంశం . ఇది ఎవరు చెప్పిన విషయమో తెలియదు . సరే జనాలు చదువుతున్నారు .. కాబట్టి ఈ మోడల్ ను ప్రతిపాదించిన వారికి కొన్ని ప్రశ్నలు . 1 . రోగం కంటే చికిత్స ఘోరం అనే సామెత వుంది . 21 రోజుల కర్ఫ్యూ కే జనాలు అల్లాడి పోతున్నారు . ప్రభుత్వం అలాగే దాతల సాయం అందినా ఇంకా దిన సరి వేతనం పై బతికే వారి బాధలు వర్ణనాతీతం . రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేని స్థితికి వెళ్లాయి . మరి మరో 45 రోజులు పొడిగిస్తే పరిస్థితి ఏమిటి ? ఎన్ని ఆకలి చావులు సంభవిస్తాయి ? మధ్య తరగతి సంగతి ఏంటి ? ఆర్థిక మాంద్యం నెలకొని నిరుద్యోగం పెరిగి బతక లేక బలవన్మరణాలు పొందాలనే వారి సంఖ్య పెరిగి పోదా ? అసలు ఆహారం ఇంకా నిత్యావసర సరుకుల కొరత ఏర్పడితే పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే హృద్రోగం , కిడ్నీ సమస్యలు మొదలైన రకరకాల వ్యాధులతో బాధ పడుతున్నవారు వైద్య సాయం అందక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు . ఆకలి తో నిరుద్యోగం తో ఇతరత్రా జబ్బులతో వేల మంది చనిపోయినా పరవా లేదు .. కరోనా మరణాలు మాత్రం జరగకూడదు అంటారా ? ఈ స్ట్రాటజీ ఎంత వరకు కరెక్ట్ ? 2 . మూడు నెలలు లాక్ అవుట్ ప్రకటించి కరోనా రోగం మాయమయ్యింది అని చైనా సంబర పడే లోపు ఇప్పుడు అది మళ్ళి ప్రత్యక్షం అయ్యింది . ఇప్పుడు మరో మూడు నెలలు లాక్ అవుట్ ప్రకటిస్తారా ? ఇలా ఎంత కాలం? ఇలాగె ఇండియా కూడా జూన్ లో మళ్ళీ మరో మూడు నెలలు లాక్ అవుట్ ప్రకటించాలా? 3 . సరే మీరు చెప్పినట్టు జూన్ దాక లాక్ అవుట్ చేస్తే కరోనా పొయ్యింది అనుకొందాము . అప్పుడు మళ్ళీ విదేశాలనుండి తిరిగి బీజాలు రావా ? విదేశీ విమానాలు , రాక పోకలు పూర్తిగా నిషేదించండం సాధ్యమా ? ఇండోనేషియా లాంటి దేశాలు ఎలాంటి లాక్ అవుట్ ప్రకటించ లేదు . ఇలాంటి దేశాల్లో కరోనా పోయిందని తేల్చేది ఎవరు ? వారి నుంచి ఇంకో దేశస్తులకు . ఆలా ప్రపంచం అంతా పాకదా? ప్రపంచం లోని 200 దేశాలు కరోనా ను పూర్తిగా జయించాయని ఎవరు సర్టిఫై చేయగలరు ? అప్పటి దాకా మనం అన్నీ బంద్ చేసి కూర్చోగలమా ? 4 . మూడు నెలలకో ఆరు నెలలలకో వాక్సిన్ వస్తే అది ప్రపంచ మానవాళి అంటే 800 కోట్ల మందికి ఇవ్వడానికి అయ్యే ఖర్చు , సమయం ఎంత ? ఇవన్నీ చదివితే మీకు భయం పెరిగి పోతోందా ? అవసరం లేదండీ ! సమస్యను సరైన కోణం లో చూడాలి . ఒకప్పుడు కమ్యూనిస్ట్ ల పై ఒక విమర్శ ఉండేది . రష్యా లో వాన పడితే ఇక్కడ గొడుగు పడుతారు అని .. దీని సంగతి ఏమిటో కానీ ఇప్పడు మనం గుడ్డిగా ఇటాలిన మోడల్ లేదా చైనా మోడల్ ను అనుసరిస్తే ఇదే పరిస్థితి ఉంటుంది . కరోనా అదుపుకు మనదైన ఇండియన్ మోడల్ రూపొందించుకోవాలి . ఇక్కడ జనాభా , జన సాంద్రత , ఆసుపత్రులు , కరోనా మన పై చూపుతున్న ప్రభావం .. మన దేశం జనాభా లో వివిధ ఏజ్ గ్రూప్ ల వారి శాతం .. ఇలా అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి . ఇలాంటి ఇండియా మోడల్ నా దగ్గర వుంది . కరోనా పై విస్తృత అధ్యనం ద్వారా ఇది నేను రూపొందించింది . ఈ మోడల్ ప్రకారం అసలు మరణాలు ఉండవా అని అడగకండి . అంతటి మంత్రం దండం నా దగ్గర లేదు . అతి తక్కువ నష్టం జరిగేలా శాస్త్రీయం గా రూపొందించిన మోడల్ ఇది . దీన్ని పాలసీ మేకర్స్ తో పంచుకోవడానికి నేను సిద్ధం . నా ఐడియా కనీసం ఒకసారి వింటే బాగుంటుంది అని అనుకొంటున్నాను . నా మోడల్ ఏంటో నేను పేస్ బుక్ పై షేర్ చెయ్యలేను .. టీవీ చానెల్స్ తో పంచుకోలేను .. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా .. ఎవరైనా వివాదాస్పదంగా మార్చితే వచ్చే విమర్శలను నేను భరించలేను . ఇది నా ఫుల్ టైం డ్యూటీ కాదు .. ఒక భాద్థ్యత కలిగిన పౌరుడిగా నా ఆలోచన .. కృషి .. అంతే ! ఏది ఏమైనా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడికి ఇన్ పుట్స్ ఇవ్వడానికి నా కంటే వందల వేల రేట్లు తెలివైన వారు .. సామజిక స్పృహ కలిగిన వారు కోకొల్లలుగా వుంటారు . ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం గొప్పగా ఉంటుంది . అందరికీ మంచే చేసేలా ఉంటుంది . సర్వే జనా సుఖినోభవంతు !! Quote
AFDB_Director Posted April 4, 2020 Report Posted April 4, 2020 Thanks for wasting 5 mins of my life 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.