Jump to content

Please follow lockdown folks


Recommended Posts

Posted
IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

కర్నూలు : కూరగాయలు కొనేందుకు వచ్చిన ప్రజలతో కిక్కిరిసిన నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతం. కర్నూలు జిల్లాలో ఆదివారం 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నగరంలో కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నా సామాజిక దూరం పాటించడంలో ప్రజలు అలసత్వం వహిస్తున్నారు.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

శ్రీకాకుళం: నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేసిన మార్కెట్‌లో కూరగాయలు, మాంసం కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

నిజామాబాద్‌లోని నెహ్రూ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోలీస్‌ పికెట్‌ను చూసి ఆందోళనకు గురై ద్విచక్ర వాహనదారులు ఒకరినొకరు ఢీకొన్నారు. దీంతో ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కొడుతున్న పోలీసులు..


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

గుంటూరు మార్కెట్‌ సెంటర్‌లో గతేడాది ఫుడ్‌ కోర్టును ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ప్రాంతం ప్రజలతో రద్దీగా ఉండేది. తమకిష్టమైన రుచులను ఆస్వాదించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చేవారు. లాక్‌డౌన్‌ కారణంగా ఫుడ్‌ కోర్టును మూసివేయడంతో ఆ ప్రాంతం నిర్మానుషంగా మారింది.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

ఆదివారం కావడంతో గుంటూరు చేపల బజారు వీధిలో జనం పోటెత్తారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల్ని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మార్కెట్‌ను మూసివేయించారు.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వాహనదారులు లాక్‌డౌన్‌ నిబంధనలు గాలికొదిలేసి రోడ్లపై కనిపించారు. పలు మాంసం దుకాణాలా వద్ద కూడా గుంపులుగుంపులుగా కనిపించారు.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

దిల్లీ: లాక్‌డౌన్‌ సందర్భంగా నిరాశ్రయులకు స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. క్రమశిక్షణతో వరుసలో నిలబడి సామాజిక దూరం పాటించేలా వారిని పోలీసులు సమీపం నుంచి పరిశీలిస్తున్నారు. పాత దిల్లీలోని ఖారీ బావ్లీ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆహార పంపిణీ కార్యక్రమం వద్ద బందోబస్తులో ఉన్న పోలీసు.. తుపాకీ స్థానంలో శానిటైజర్‌ను పెట్టుకున్నాడు.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

బెంగళూరు: లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వాహనదారుల వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి ఓ చోట భద్రపరిచారు. రికార్డు ప్రకారం సీజ్ చేసిన వాహనాలను తనిఖీ చేస్తున్న మహిళా పోలీసు.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

కోల్‌కతాలో దాతలు అందజేసిన ఆహారాన్ని తన చెల్లికి తినిపిస్తున్న ఓ బాలిక.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

బెంగళూరు: విదేశాల నుంచి వచ్చి 14 రోజులు క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ఆనందంతో స్వస్థలాలకు వెళుతున్న దృశ్యం.


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

వాహనదారులు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోవడంతో వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తీసుకొనేందుకు షోలాపూర్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బారులు తీరిన వాహనదారులు.

Posted

Emo le anna at least numbers are in control in India,  ikada inka chudadam.kuda apesa enni lock down chesi emi labam 

Posted
2 hours ago, kothavani said:

Emo le anna at least numbers are in control in India,  ikada inka chudadam.kuda apesa enni lock down chesi emi labam 

Kurnool alone 53 anta today... All Delhi visitors..mostly..

We have not entered the next phase yet..may end daka vunte we all safe ..India and usa

Posted
55 minutes ago, kakatiya said:

Kurnool alone 53 anta today... All Delhi visitors..mostly..

We have not entered the next phase yet..may end daka vunte we all safe ..India and usa

India lo this week numbers doubled 90% related to the delhi event travel else intha number spike ledhu when it was normal...

Also now in this week rapid testing is going started at many places so more testing could lead to more numbers but one thing it seems that we are not yet in to community spread phase.. If public remain cautious & restraint it will be good..

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...