jetwings Posted April 14, 2020 Report Posted April 14, 2020 https://nymag.com/intelligencer/2020/04/best-case-scenario-for-coronavirus.html Quote
jetwings Posted April 14, 2020 Author Report Posted April 14, 2020 https://www.sakshi.com/news/telangana/corona-positive-case-filed-hyderabad-quarantine-people-1277611 నగరంలో గడప దాటని ఇద్దరికి కరోనా పాజిటివ్ పక్షవాతంతో ఇంట్లో ఉన్న గాంధీనగర్ వాసిసహా టోలిచౌలికి చెందిన బాలిక ట్రేస్‌కానీ కాంటాక్ట్ హిస్టరీ.. తలపట్టుకుంటున్న సర్వేలెన్స్ ఆఫీసర్లు లక్షణాలు లేని వారి నుంచి కూడా కరోనా వైరస్ బయటికి వెళ్లినా.. ఇంట్లో ఉన్నా మాస్క్‌లు తప్పనిసరి సాక్షి, సిటీబ్యూరో: గాంధీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి(48) పక్షవాతంతో బాధపడుతున్నాడు. కాళ్లు, చేతులు పని చేయడం లేదు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు కానీ, ఇతర ప్రాంతాలకు కానీ వెళ్లి వచ్చిన నేపథ్యం లేదు. దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించగా, కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో కుటంబ సభ్యులే కాదు చికిత్స చేసిన వైద్యులు కూడా షాక్‌కు గురి కావాల్సి వచ్చింది. ఇక టోలిచౌకికి చెందిన బాలిక(8) ఉన్నట్టుండి దగ్గు, జలుబు, జ్వరం బారిన పడింది. చికిత్స కోసం తల్లిదండ్రులు బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులకు అనుమానం వచ్చి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిజానికి ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం ఆమెకు కానీ, ఆమె తల్లి దండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు లేదు. ఎలాంటి కాంటాక్ట్ హిస్టరీ లేకపోయినా బాలికకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులతో పాటు కాంటాక్ట్ హిస్టరీ ట్రేస్ చేసేందుకు వెళ్లిన సర్వె లెన్స్ ఆఫీసర్లకు అంతుచిక్కడం లేదు. బాధితులకు వైరస్ ఎలా సోకిందో తెలియక వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలపట్టుకుంటున్నారు. (కరోనా కాపాడింది!) వారు వెళ్లిన దారిలో ప్రయాణించినా... ఇప్పటి వరకు విదేశాల నుంచి, మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి ద్వారా మాత్రమే వైరస్ వ్యాపిస్తున్నట్లు భావించాం. నిజానికి ఎలాంటి ట్రావెలింగ్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ హిస్టరీ లేని వాళ్లకు కూడా వైరస్ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొంత మందిలో వైరస్ లక్షణాలు స్పష్టంగా కన్పిస్తుంటే.. మరికొంత మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు. లక్షణాలు లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. వీరిలో ఎవరైనా రోడ్డుపై ప్రయాణించే సమయంలో తుమ్మడం, దగ్గడం, ఉమ్మడం వంటివి చేస్తుంటారు. ఇలా తుంపర్ల ద్వారా బయటి వచ్చిన వైరస్ గాలిలో మూడు మీటర్ల పరిధిలో విస్తరించి, మూడు గంటల పాటు జీవిస్తుంది. ఆ తర్వాత కింద పడిపోతుంది. ఈ సమయంలో అదే దారిలో ప్రయాణించిన వ్యక్తులకు వైరస్ వ్యాపిస్తుందని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. గాంధీనగర్, టోలిచౌకి బాధితులకు ఇలాగే వైరస్ విస్తరించినట్లు వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇప్పటి వరకు తుమ్మినప్పుడు, దగ్గిప్పుడు మాత్రమే ముక్కుకు, నోటికి మాస్క్‌లను అడ్డుపెట్టుకోవాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బయటికి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్న సమయంలోనూ విధిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేయడం వెనుక ఉన్న ఆంత్యరం ఇదేనని స్పష్టమవుతోంది. ఎవరిలో వైరస్ ఉందో గుర్తించడం కష్టమవుతుండటంతో కేవలం బయటికి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్‌లు ధరించాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.