Sreeven Posted May 1, 2020 Report Posted May 1, 2020 8 hours ago, chinnabhai said: ఇదీ అసలైన ఛాలెంజ్ ! మొదట్లో సల్మాన్ అంటే నాకూ ఇష్టం ఉండేది కాదు . ఒకసారి కులుమనాలి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్క డాబా దగ్గర లంచ్ కోసం ఆగాము . ఆ హోటల్ నిండా సల్మాన్ ఫొటోలే ..ఓనర్ ఏమో బీజేపీ భక్తుడు ( పెద్ద నిలువు బొట్టు ) , పక్క హోటల్ కూడా అలానే ఉంది , దాని ఓనరేమో సర్ధార్ . వాళ్ళ ద్వారా మొట్టమొదటి సారి సల్మాన్ గురించి తెలుసుకున్నాను .ప్రతిసినిమాకు వచ్చే డబ్బుని తన అవసరాలు పోగా మిగిలిన మొత్తం పేదలకి పంచుతాడు అంట ( అప్పులతో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే ..సల్మాన్ వాళ్ళతో హోటల్స్ పెట్టించాడు అంట , షూటింగ్ కి కులుమనాలి వచ్చినప్పుడల్లా వీళ్ళ దగ్గరకి వచ్చి వెళ్తాడట ) .ముంబయిలో తిరిగే ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబం సల్మాన్ దగ్గర ఏదో ఒక సహాయం పొందినదే . చాలా ఎమోషనల్ పర్సన్ . వాళ్ళ చెల్లి అర్పిత కూడా అనాథే . ఆమెని వాళ్ళింట్లో ఎలా చూసుకొంటారో చెప్పాల్సిన పనిలేదు . దాదాపుగా అందరూ ( సంగీత ..ఐశ్వర్య ..కత్రినా వరకూ ) సల్మాన్ ని వాడుకొని వదిలేసిన వాళ్ళే . బలహీనతలు ఉండటం మానవ సహజం . కాకపోతే మిగతా వాళ్ళతో పోల్చితే గొప్ప మానవతావాది . లాక్డౌన్ పెట్టిన దగ్గర నుండి 25 వేల కుటుంబాలకి 6 వేల చొప్పున డబ్బు పంచాడు . ఇప్పుడు ఏకంగా లక్షా ఇరవై వేల కుటుంబాలకి నిత్యావసర సరుకులు ( 15 కోట్లు విలువ ) పంచుతూ మిగిలిన వాళ్లకి ఛాలెంజ్ చేసాడు . మన హీరోలు ఇప్పటికైనా పెళ్ళానికి కాఫీ చేశాను , కాళ్ళు పట్టాను , లంగాలు ఉతికాను లాంటి ఛాలెంజులు కాకుండా సమాజానికి ఉపయోగపడే ఇలాంటి ఛాలెంజులు చేయాలి . సల్మాన్ నిజమైన హీరో ! Neeku ippudu telusaa..he dronates 90% of his earnings. Chala shows lo chala mandi chepparu..recent bb show lo kuda rajat Sharma gadu direct ga annadu..he changed a lot after the road accident he did..anger is the big problem with him, now he changed a lot Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.