All_is_well Posted May 6, 2020 Report Posted May 6, 2020 Naku doubt why Requests are not sent by Jagan to other state CM’s or is it not publicized??? మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకి చంద్రబాబు విజ్ఞప్తి షోలాపూర్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు మహారాష్ట్ర సీఎంకు లేఖ రాయాలని చంద్రబాబును కోరిన అఖిలప్రియ సురక్షితంగా వారిని పంపించాలని ఉద్ధవ్ ను కోరిన చంద్రబాబు మహారాష్ట్రలోని షోలాపూర్ లో 100 మందికి పైగా తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయి 30 రోజులు దాటుతోందని, వీరిని వెనక్కి రప్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. వీరంతా క్షేమంగా రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను ఆమె కోరారు. అఖిలప్రియ విన్నపంపై చంద్రబాబు స్పందించారు. సమస్యను ఉద్ధవ్ థాకరే దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు. 'ఉద్ధవ్ గారూ... షోలాపూర్ లో 156 మంది విద్యార్థులు చిక్కుకుపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. వారి మంచిచెడ్డలను పట్టించుకోవాలని, ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షింతంగా పంపాలని మిమ్మల్ని కోరుతున్నా. వారి పూర్తి వివరాలను మీకు పంపుతున్నా' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కర్ణాటకలో చిక్కుకుపోయిన మన మత్స్యకారుల కోసం సీఎం యడియూరప్పతో మాట్లాడాను: చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు 300 మంది కర్ణాటకలో చిక్కుకుపోయారు ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారు వారికి తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు లాక్ డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఏపీకి చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయిన విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో మాట్లాడానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300 మంది మత్స్యకారులు కర్ణాటక తీర ప్రాంతం మాల్ప్ గ్రామంలో చిక్కుకుపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. యడియూరప్ప సానుకూలంగా స్పందించారని, చిక్కుకుపోయిన మత్స్యకారులకు తక్షణ సాయం అందిస్తామని తనకు హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. మత్స్యకారులను సురక్షితంగా తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తమ బృందం కూడా ఏపీ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని తన వరుస ట్వీట్లలో చంద్రబాబు పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.