Jump to content

30 years of ‘Jagadeka Veerudu Athiloka Sundari’


Recommended Posts

Posted

Chaala overrated movie idhi. Of course Bhairava Dweepam is much much better than this. 

  • Haha 1
Posted

I watched this with my late grandfather In the theater and he liked it so much - especially the magic ring humorous part that keeps changing hands of various people during a fight in the end 😀

  • Upvote 1
Posted

వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న నన్ను నమ్మారు.. ప్రభుదేవా ఎంట్రీ అలా జరిగింది: రాఘవేంద్రరావు

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా 30 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన మధుర స్మృతులను ప్రేక్షకులతో పంచుకున్నారు.

 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన అద్భుత చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. రాఘవేంద్రరావుకు ఇది 70వ సినిమా. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. ఒక థియేటర్‌లో 360 రోజులు ఆడిన సినిమా. చిరంజీవి క్రేజ్, శ్రీదేవి అందం, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం, విన్సెంట్ సినిమాటోగ్రఫీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతి అంశం అద్భుతమే. అలాంటి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలై నేటి(మే 9)కి 30 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ క్లాసిక్ మూవీ గురించి దర్శకుడు రాఘవేంద్రరావు తన అనుభాలను, మధుర స్మృతులను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.

‘30 ఏళ్ల క్రితం మే 9న చలనచిత్ర ఆకాశంలో ఓ అద్భుతమైన మెరుపు మెరిసింది. అది వెండితెర మీద అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిచిపోయింది. అదే నా 70వ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న నేను ఈ పిక్చర్ చేయగలనా లేదా అని అందరూ అనుకుంటున్న సమయంలో దత్ గారు, చిరంజీవి గారు ఏం మాట్లాడుకున్నారో తెలీదు కానీ.. తరవాత నాకు చెప్పారు.. ఇలాంటి సబ్జెక్ట్‌కు రాఘవేంద్రరావు గారు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అని డిసైడ్ చేసుకున్నారని. అందుకు మరీ మరీ వాళ్లిద్దరికీ థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని రాఘవేంద్రరావు వెల్లడించారు.

ఈ సినిమాకు ఏ ఇద్దరు లేకపోయినా ఇంత విజయం కాకపోయి ఉండేది కాదని రాఘవేంద్రరావు అన్నారు. ‘‘చిరంజీవి-శ్రీదేవి, మ్యాస్ట్రో ఆఫ్ మ్యూజిక్ ఇళయరాజా గారు - సాహిత్యంలో ఆయనకు ఆయనే సాటి వేటూరి గారు, ఫొటోగ్రఫీ విన్సెంట్ గారు - ప్రకాష్, అలాగే జంధ్యాల - శ్రీనివాస్ చక్రవర్తి, సత్యంమూర్తి - యండమూరి వీరేంద్రనాథ్, విజయేంద్ర ప్రసాద్ - క్రేజీ మోహన్, డ్యాన్స్ మాస్టర్ సుందరం గారు - ఆర్ట్ డైరెక్టర్ చలం గారు, ఫైట్ మాస్టర్ విజయన్ - మినీ సెట్స్ చేసిన సాబు సిరిల్.. వీరందరి కృషే ఇంత అద్భుతమైన విజయానికి కారణం’’ అని రాఘవేంద్రరావు అన్నారు.

ఈ సినిమాలో గ్రాఫిక్స్ లేకుండా సినిమాటోగ్రాఫర్ విన్సెంట్ మాయాజాలం చేశారని రాఘవేంద్రరావు కొనియాడారు. ఉంగరం దొరికిన తరవాత ఇంద్రజ మళ్లీ దేవలోకానికి వెళ్లిపోవడానికి ఆ ఇంటి రూఫ్ తలుపులు రెండూ తెరుచుకుని అలా పైకి వెళ్లిపోవడం, ఆకాశంలో నక్షత్రాలు కనిపించడం ఒక్క గ్రాఫిక్ షాట్ లేకుండా డైరెక్ట్‌గా మినీ సెట్‌లో తీశారని దర్శకేంద్రుడు చెప్పారు. అలాగే, తాను భూలోకంలో ఉండిపోవాలని ఇంద్రజ నిర్ణయించుకుని ఉంగరాన్ని సముద్రంలోకి విసిరేసినప్పుడు చేప నోట్లోకి ఉంగరం వెళ్లే షాట్‌ను కూడా విన్సెంట్ ఒరిజినల్‌గా దగ్గరుండి తీశారని తెలిపారు.

samayam telugu

‘‘దేవత భూలోకానికి వచ్చినప్పుడు అందాలలో అహో మహోదయం పాట వస్తుంది. ఆ పాటను షూట్ చేయడానికి చలం గారు హిమాలయాలను అద్భుతంగా వాహిని స్డూయోస్ ఫ్లోర్ మీదికి దింపారు. అద్భుతమైన లైటింగ్‌తో విన్సెంట్ గారు హిమాలయాల్లో జరిగినట్టు చూపించారు. ఇక ఇళయరాజా గారి మ్యూజిక్ గురించి చెప్పేదేముంది. నిజంగా దేవకన్య దిగితే ఎలా ఉంటుందో అలా వచ్చింది పాట. ఆ పాట తీయడానికి 10 రోజులు పట్టింది. ప్రజలందరూ కేరింతలు కొట్టి, విజిల్స్ వేసి, డబ్బులు వేసిన పాట ‘అబ్బనీ తీయని దెబ్బ’. ఆ పాటను కేవలం రెండు రోజుల్లోనే తీశాం. సుందరం మాస్టర్ గారు బిజీగా ఉంటే ఆ పాటను ప్రభుదేవా కంప్లీట్ చేశాడు. అలా ప్రభుదేవా ఎంట్రీకి కూడా ఈ సినిమా కారణమైంది’’ అని రాఘవేంద్రరావు వెల్లడించారు. దర్శకేంద్రుడు చెప్పిన మరిన్ని విషయాలను కింది వీడియోలో చూడొచ్చు.

 

Posted
5 minutes ago, jaglaqq said:

Chaala overrated movie idhi. Of course Bhairava Dweepam is much much better than this. 

Expected reply...Can't Help this movie has written its page in History books of Telugu Cinema...

Posted
7 minutes ago, jaglaqq said:

Chaala overrated movie idhi. Of course Bhairava Dweepam is much much better than this. 

Better than Qaidi 786

Posted
5 minutes ago, Bhumchik said:

Better than Qaidi 786

idoka movie undi ani ipude telisindi

Posted
1 minute ago, Mirage said:

idoka movie undi ani ipude telisindi

You don't know guvva gorinka song ah?

Posted
Just now, Ellen said:

You don't know guvva gorinka song ah?

oh aah song ee movie da.. audio song vinaanu kaani movie peru teliyadu

Posted

super movie.. this, aditya369 are evergreen movies.. mana generation lo.. even bhairavadveepam to some extent..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...