DaatarBabu Posted May 12, 2020 Report Posted May 12, 2020 సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ బారిన పడిన మహిళలకంటే మగవారు చనిపోయే అవకాశం రెండింతలు ఎక్కువట. వృద్ధులు, స్థూలకాయం కలిగిన వారితోపాటు భిన్న సంస్కృతిగల మైనారిటీలు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఇంగ్లండ్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్ అధికారులు 1.74 కోట్ల రోగుల రికార్డులను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చింది. అలాగే కరోనా బారిన పడిన శ్వేతజాతీయులకన్నా నల్లజాతీయులు 1.7 రెట్లు, ఆసియన్లు 1.6 రెట్లు ఎక్కువగా మరణించే అవకాశం ఉందని కూడా వారి ఎన్‌హెచ్‌ఎస్ అధికారుల విశ్లేషణలో తేలింది. అన్నింటికన్నా మరో విశేషమేమిటంటే సిగరెట్టు తాగేవారికంటే తాగని వారిలోనే మరణాల సంఖ్య రెట్టింపు ఉందని ‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’కు చెందిన పరిశోధకులు తెలిపారు. వారు 1.74 కోట్ల మంది ఆరోగ్య రికార్డులను పరిశీలించగా, వారిలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ మధ్య కరోనా బారిన పడి మరణించిన 5,707 మంది కూడా ఉన్నారు. (చదవండి : కరోనా: ఇటలీలో ఇంత తక్కువ.. ఫస్ట్‌టైమ్!) పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయికనుక సిగరెట్లు తాగేవారు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉందని వైద్యులు తొలుత భావించారు. సిగరెట్లు తాగే వారందరిలో ఊపిరితిత్తుల సమస్యలు ఉండక పోవచ్చు. కరోనా నేరుగా ఊపిరితిత్తుల్తోకి వెళుతుందికనుక సిగరెట్ పొగ వేడి వల్ల కరోనా వైరస్ మరణించే అవకాశాలు ఉన్నాయి. ధూమపానం మానేసిన వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్‌ను చంపే గుణం పొగాకులోనే ఉందని, ఆ విషయాన్ని తాము ల్యాబ్ పరీక్షల ద్వారా గుర్తించామని, బ్రిటీష్ అమెరికన్ టొబాకో (బీఏటీ) కంపెనీ ఇటీవల ప్రకటించడం కూడా ఇక్కడ గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిస్తే తాము కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని బయోలాజికల్ ల్యాబ్‌ను కలిగిన బీఏటీ యాజమాన్యం ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాల్లో సిగరెట్ కంపెనీల సహాయం తీసుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ కారణంగానే లండన్ కేంద్రంగా పలు దేశాల్లో కంపెనీ బ్రాంచీలు కలిగిన ఏబీటీకి అనుమతిచ్చేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఊపిరి తిత్తుల జబ్బులు, గుండె జబ్బులు, మధుమేహం అదుపులో లేకపోవడం తదితర సమస్యలు కలిగిన వారు, 80 ఏళ్ల పైబడిన వారు కరోనా వల్ల ఎక్కువగా చనిపోయే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది. ఇంటర్నెట్ డెస్క్, eenadu: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే 2.85 లక్షలకుపైగా మంది మృత్యువాతపడగా మరో 40లక్షల మంది ఈ వైరస్‌కు బాధితులుగా మారారు. ఈ మహమ్మారి ముఖ్యంగా మానవ శ్వాసకోస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనా విజృంభిస్తోన్న సమయంలో పొగాకు వాడకం ఎంత ప్రమాదకరమో తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పొగాకు వాడకంతో ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీరిలో 70లక్షల మంది పొగాకు ఉత్పత్తులను నేరుగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతుండగా.. మరో 12లక్షల మంది పరోక్షంగా దీన్ని పీల్చడం వల్ల చనిపోతున్నారని ప్రకటించింది. అంతేకాకుండా ధూమపానం అలవాటు ఉన్నవారిలో కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు ఏప్రిల్ 29న ఏర్పాటు చేసిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం గుర్తించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రత్యేక నిపుణులచే పలు పరిశోధనలను జరుపుతోంది. ముఖ్యంగా ధూమపానం, నికోటిన్ వాడకానికి, కొవిడ్ వైరస్‌కు ఉన్న సంబంధంపై ఇవి కొనసాగుతున్నాయి కొవిడ్ మహమ్మారి ముఖ్యంగా మానవ శ్వాసకోస వ్యవస్థపై దాడి చేస్తుంది. ఈ సమయంలో కరోనాతో పాటు ఇతర వ్యాధులను ఎదుర్కోవడంలో ధూమపానం శరీరాన్ని బలహీన పరుస్తుంది. ఈ సమయంలో గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం ఉన్నవారు ఈ వైరస్ బారినపడినప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతోపాటు ప్రమాద తీవ్రతను పెంచుతుందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. దీంతో మరణాలు కూడా సంభవిస్తున్నట్లు తాజా పరిశోధనలు సూచిస్తున్నాయని తెలిపింది. కొవిడ్-19 తీవ్రతను తగ్గించడంలో పొగాకు ఉత్పత్తులు, నికోటిన్ వాడకం వంటి ఉపయోగపడతాయన్న వాదనను డబ్ల్యూహెచ్‌ఓ తోసిపుచ్చింది. నిరూపితం కాని ఇలాంటి వాదనల విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులతోపాటు మీడియా సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొవిడ్-19 చికిత్స, నివారణకు పొగాకు ఉత్పత్తులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఇప్పటివరకు ధూమపానం అలవాటు ఉన్నవారిని పొగాకు ఉత్పత్తులకు దూరం చేయడానికి గమ్, ప్యాచెస్ వంటి నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ప్రమాణికమైన పద్ధతుల ద్వారా మాత్రమే ధూమపానం అలవాటు మానుకోవాలని సూచించింది. ఇలా మానుకున్న 20నిమిషాల్లోపే అధిక రక్తపోటు, హృదయ స్పందనలు తగ్గి అదుపులోకి వస్తాయి. 12గంటల అనంతరం రక్తప్రసరణలో కార్బన్‌మోనాక్సైడ్ సాధారణ స్థాయికి చేరుతుంది. మరో 2నుంచి 12వారాల్లో రక్తప్రసరణ మెరుగవడంతోపాటు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇలా ఒకటి నుంచి తొమ్మిది నెలల కాలంలో దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం తెలిపింది. అందుకే ఇప్పటికే నిరూపితమైన పద్ధతులు మాత్రమే పాటించాలని లేకపోతే ఆరోగ్యంపై అవి ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది. Quote
AndhraneedSCS Posted May 12, 2020 Report Posted May 12, 2020 1 hour ago, emitlu said: Above news summary cheppu Just smoke and you wont die from Covid-19 Quote
ShruteSastry Posted May 12, 2020 Report Posted May 12, 2020 2 minutes ago, AndhraneedSCS said: Just smoke and you wont die from Covid-19 It didn't say that man. They said the new study is indicating that. Quote
ShruteSastry Posted May 12, 2020 Report Posted May 12, 2020 This is what they are based on. Just Grow Up. Quote
DaatarBabu Posted May 12, 2020 Author Report Posted May 12, 2020 Sakshit gadu Cigarettes Covid 19 ni samputhay taagandi antadu Eenadu emo smokers mundu sastaru antadu... Paina rendu news lu Vesa... Janalu etta sachedi... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.