Jump to content

Visa, OCI Card Suspension Means Several Indians in the US Can't Fly Back


Recommended Posts

Posted

Indian parents whose children were born in the US, and are American citizens, are being told the children cannot fly back to India.

వాషింగ్టన్‌: అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు మన కేంద్ర ప్రభుత్వం విధించిన కొన్ని నిషేధాజ్ఞలే ఇప్పుడు అడ్డంకిగా మారాయి. అనేక మంది భారత్‌కు వచ్చే అవకాశం, అనుమతి ఉన్నా రాలేని పరిస్థితి నెలకొంది. విదేశీయుల వీసాలపై, వీసా అవసరం లేకుండా భారత్‌కు వచ్చే వెసులుబాటు ఉన్న ఓసీఐ (ఖండాంతర భారత పౌరసత్వ) కార్డులపై కేంద్ర ప్రభుత్వం గత నెలలో నిషేధం విధించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు అక్కడ చిక్కుకున్న కొంతమందికి ఈ ఆంక్షలే అడ్డంకిగా మారాయి. పలువురు హెచ్‌-1బీ, గ్రీన్‌ కార్డుదారుల పిల్లలు అమెరికాలో పుట్టడంతో వారంతా ఓసీఐ పరిధిలోకి వస్తారు. న్యూజెర్సీలో హెచ్‌-1బీ వీసాపై ఉంటున్న భారతీయ దంపతులు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయారు. నిబంధనల ప్రకారం వారు 60 రోజుల్లోగా అమెరికాను వీడాలి. దీంతో ఇద్దరు పిల్లలతో విమానాశ్రయానికి వచ్చారు. ఆ పిల్లలిద్దరూ అమెరికా పౌరులు అయినందున ఓసీఐ పరిధిలోకి వస్తారు. ఎయిరిండియా సిబ్బంది వారిని అనుమతించలేదు. చివరకు ఆ దంపతులు తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లిపోయారు. అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళ ఒకరికి మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. తల్లికి భారతీయ పాస్‌పోర్ట్‌ ఉంది. శిశువుకు అమెరికా పాస్‌పోర్ట్‌ ఉంది. బాబుతో కలిసి ఆమె భారత్‌ రాలేని పరిస్థితి. ఇలా నిబంధనల్లోని సాంకేతిక సమస్య వల్ల అనేక మంది హెచ్‌-1బీ, గ్రీన్‌ కార్డుదారులు అమెరికాలోనే ఉండిపోయారు.
Posted
4 minutes ago, Picheshwar said:

Ippude nidra lesava bro 🙄

bro , eenadu lo vochee varaku neenu edi nammanu 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...