Jump to content

Recommended Posts

Posted

అమరావతి: దేశభద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తెదేపా మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రెండు రోజుల మహానాడు ఇవాళ్టితో ముగిసింది. రెండు రోజుల మహానాడులో 22 తీర్మానాలను ఆమోదించగా.. 52 మంది నేతలు ప్రసంగించారు. తెదేపా అధినేత చంద్రబాబు ముగింపు సందేశం ఇచ్చారు.

 

‘‘చైనాతో వివాదం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి తెదేపా సహకారం ఉంటుంది. సీఎం జగన్‌ చేసేది విధ్వంసకర పాలన. యువతను ప్రోత్సహిస్తా.. మహిళలకు ప్రాధాన్యమిస్తాను. పవిత్ర జలాలు, మట్టితో పునీతమైన అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. అమరావతిపై తెదేపా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. అభివృద్ధి చేతకాక రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు అండగా ఉంటాం’’ అని చంద్రబాబు వివరించారు.

28052020-mahanadu-1a.jpg

 

Posted

అమరావతి: తెలుగుదేశం పార్టీ 'మహానాడు' రెండో రోజు గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ప్రారంభమైంది. తొలిరోజు వర్చువల్ కాన్ఫరెన్స్‌లో 14వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి రోజు టీడీపీ ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టింది. విద్యుత్ చార్జీల పెంపు, మాట తప్పిన జగన్, కరోనా, వలస కార్మికుల అవస్థలు, టీటీడీ భూముల వ్యవహారం, అరాచక పాలనకు ఏడాది, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అన్నదాత వెన్ను విరిచిన జగన్, సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ తీర్మానాలు చేసింది. 

లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ టీడీపీ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ కోలాహలంగా మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరిగేవి. కానీ ఈసారి కరోనా వైరస్‌ దెబ్బ పడింది. లాక్‌డౌన్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. 

Posted

 అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. అభివృద్ధి చేతకాక రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు

Thappudu pracharam chesaru antadu endhi.... veede kadha minimum 1 lakh crores aiythadhi annadu

 

Posted

సాక్షి, విజ‌య‌వాడ‌: టీడీపీ నేతలు మ‌హానాడు వేదిక‌గా మాటల యుద్దానికి దిగారు. చంద్రబాబు ముందే టీడీపీ నేతలు చిన‌రాజ‌ప్ప‌, జ్యోతుల నెహ్రూ ఒకరినొకరు విమర్శించున్నారు. ఈ క్రమంలో చిన‌రాజ‌ప్ప‌  మాట్లాడుతూ.. కొంత మంది నేత‌లు అధికారం పోగానే పార్టీని వీడిపోయారని అన్నారు. తిరిగి వెళ్లిపోయిన వారిని పార్టీలోకి తీసుకోమని తెలిపారు. మాజీ మంత్ర‌లు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని చెప్పారు. ప్ర‌భుత్వం అధికారంలో లేకుంటే పార్టీని ప‌ట్టించుకోరా అని ప్రశ్నించారు. ఎవ‌రు ఏ విధంగా వ్వ‌వ‌హారిస్తున్నారో చంద్ర‌బాబు

గ‌మ‌నించాలని చినరాజప్ప అన్నారు.

చిన‌రాజ‌ప్ప వ్యాఖ్య‌ల‌ను టీడీపీ నేత జ్యోతులు నెహ్రూ తీవ్రంగా విబేధించారు. మైకులు ప‌ట్టుకొని మాట్లాడితే స‌రిపోదని విమర్శించారు. ముందు పార్టీ కేడర్‌కు న‌మ్మ‌కం క‌లిగించాలన్నారు. నాయ‌కుని చుట్టు ప్ర‌ద‌క్ష‌ణ చేస్తే నాయ‌క‌త్వం రాదని ఎద్దేవా చేశారు. పార్టీ కేడ‌ర్ చూట్టు ప్ర‌ద‌క్ష‌ణలు చేయాలన్నారు. చిన‌రాజ‌ప్ప బాద్య‌త‌గా వ్య‌వ‌హరించాలన్నారు. ప‌దవులు రావ‌డమ‌నేది అదృష్టం మీద ఆధార‌ప‌డి ఉంటుందని తెలిపారు. తూర్పు గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు ఎవ‌రో కూడా తెలియ‌ని ప‌రిస్థితిలో ఉన్నామన్నారు. జిల్లాలో తనకు తెలియ‌కుండానే పలు కార్యాక్ర‌మాలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు రాష్ట్ర క‌మిటీ నాయ‌కులు వ‌స్తే క‌నీసం స‌మాచారం ఇవ్వ‌డం లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. 

Posted
8 minutes ago, kidney said:

 అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. అభివృద్ధి చేతకాక రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు

Thappudu pracharam chesaru antadu endhi.... veede kadha minimum 1 lakh crores aiythadhi annadu

 

@3$% ippudu vunna paristhithullo Meeru Amaravati okkate raajadhani ante chalu... aalle joli patti, Real Estate kadupu kotti kattesela vunnaru... @kidney

@3$%

  • Haha 1
Posted

images?q=tbn:ANd9GcS25QCQ1Uizy-VU2QwuvZv

images?q=tbn:ANd9GcTC3Dztr_1gpXuiHN6nR_v

Musalayana inko 4 years laagagalada? 

Moham lo suppression valla vachina depression gattiga kanapaduthundi... 

May the force be with him @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...