Jump to content

Recommended Posts

Posted
ప్రజలకు త్వరలోనే తీపికబురు చెప్తా: కేసీఆర్‌

మర్కూక్‌: తెలంగాణ ప్రజలకు త్వరలోనే తీపి కబురు చెబుతానని.. అది దేశం ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొండపోచమ్మ జలాశయం వద్ద మర్కూక్‌ పంప్‌హౌస్‌ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తులో ఇదొక ఉజ్వలమైన ఘట్టంగా కేసీఆర్‌ అభివర్ణించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయి నిర్వాసితులైన వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. భూ నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. తెలంగాణ రైతులు రూ. లక్ష కోట్ల విలువైన పంటలు పండిస్తున్నారని.. పసిడి పంటల సాగు దిశగా రాష్ట్రం పయనిస్తోందన్నారు. 

 

‘‘యావత్ ప్రపంచం అబ్బురపడే ప్రాజెక్టు కాళేశ్వరం. కొండపొచమ్మసాగర్‌ జలాశయం కాళేశ్వరంలో పదో లిఫ్ట్‌ ప్రాజెక్టు. మల్లన్న సాగర్‌ రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు. తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమే ఈ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర రాష్ట్రాల కూలీల సేవలు వెలకట్టలేనివి. 165 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను నిర్మాణం చేశాం. భూసేకరణలో రెవెన్యూ శాఖ అద్భుతంగా పనిచేసింది. సీతమ్మసాగర్‌, సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టులు త్వరలో  పూర్తి చేస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

అద్భుతాలు సృష్టించేలా తీర్చిదిద్దుతాం..

‘‘తక్కువ కాలంలోనే ఆశించిన ప్రగతి సాధించాం. రాజనీతిజ్ఞతను ప్రదర్శించి పొరుగు రాష్ట్రాలను మెప్పించాం. నియంత్రిత సాగు విధానంలో అద్భుతాలు చేస్తాం. మా విధానం నియంత్రిత సాగు.. నియంతృత్వ సాగు కాదు. కేసీఆర్‌ది మొండిపట్టు.. అద్భుతాలు సృష్టించే విధంగా రైతాంగాన్ని తీర్చిదిద్దుతాం. మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటి సమస్య పరిష్కరించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దేశానికి మార్గదర్శనం చేసేలా పథకాలు అమలు చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా, రైదుబంధును అమలు చేస్తున్నాం. 24 గంటలు నిరంతర విద్యుత్తును అందిస్తున్నాం’’ అని కేసీఆర్‌ వివరించారు.

Posted
1 minute ago, jlo said:

may be found medicine for covid

too much expectations from India bro 😀 

edina govt new policy implementation emo... anti corruption kind of thing maybe. 

Posted

Resign chesi farm house ki potha antadu emo

Posted
1 hour ago, jlo said:

may be found medicine for covid

:giggle: దొర rocks . 

Posted
5 minutes ago, Sucker said:

House theesi Rakul Rao ni 2nd kodalu ga accept chesthunnada yendi ?

Maybe idhe ayyondichu :giggle:

Posted
7 minutes ago, utterwaste said:

Expecting a kid?

Lol...🤣

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...