Jump to content

Recommended Posts

Posted

 

అఖిలప్రియను అక్కా అనాలంటే అసహ్యమేస్తోంది: ఏవీ జస్వంతి

06062020113024n24.jpg

 

కర్నూల్: ఆళ్ళగడ్డలో అఖిలప్రియపై పోటీకి సిద్ధమని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తనయురాలు జస్వంతి ప్రకటించారు. తమది ఆళ్ళగడ్డ అని, అక్కడే రాజకీయం చేస్తామని తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆమె... స్వాగతించటానికి అఖిలప్రియ ఎవరు? అఖిలప్రియను అక్కా అని పిలవాలంటే అసహ్యం వేస్తోందన్నారు. దేవుడిచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని ఆరోపించారు. తండ్రి లేని అఖిలప్రియకు తండ్రి విలువ తెలియదనుకోనని, ఆడపిల్లగా నాన్న లేని  పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందన్నారు. కష్ట పడకుండా మంత్రి అయిన అఖిలప్రియకు కష్టం విలువ తెలియదన్నారు. భూమా దంపతులు, ఏవీ సుబ్బారెడ్డి 30ఏళ్ళ కష్టం వలనే అఖిలప్రియకు ఆ స్థాయి దక్కిందన్నారు. ఆమెది క్రిమినల్ మైండ్ అని, అఖిలప్రియ తీరు మహిళలకే సిగ్గుచేటన్నారు. తన తండ్రి ప్రాణం ఖరీదు రూ.50లక్షలా? అడ్డు వచ్చిన వారందర్నీ అఖిలప్రియ చంపుతోందా? అని ప్రశ్నించారు. 

Posted

తనను హత్య చేయించేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చారని పోలీసులు చెప్పిన విషయాలు విని షాక్‌ అయ్యానని తెదేపా నేత, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.  శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ...‘‘ నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నాను. నాకు అఖిలప్రియ రాజకీయం నేర్పుతుందా?. అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న. అఖిలప్రియపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా నన్ను ఆళ్లగడ్డ రమ్మంటోంది. నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే చెప్పాలి’’ అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

Posted

ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో తనను, తన భర్త భార్గవ్‌రామ్‌ను పోలీసులు నిందితులుగా ఉంచారని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ నిన్న ఆళ్లగడ్డలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తమ మధ్య ఆస్తుల గొడవలు లేవని సుబ్బారెడ్డి అంగీకరించారని ఆమె చెప్పారు. ఆళ్లగడ్డలో ఆయన రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని, గతంలో ఆయనకు పదవులిస్తుంటే తాను అడ్డుపడలేదని తెలిపారు. ప్రజావ్యతిరేక కార్యక్రమాలు, అక్రమాలకు పాల్పడుతున్న వైకాపా నేతలను ఇంతవరకు ఆయన ఏనాడు విమర్శించలేదన్నారు. హైకోర్టులో తన భర్త బెయిల్‌ పిటిషన్‌ను అడ్డుకునేందుకే ఆయన ప్రసారమాధ్యమాల ద్వారా అరెస్టుకు డిమాండ్‌ చేశారని ఆరోపించారు. నిందితుల నేరాంగీకార పత్రంలో తామే ఈ నేరానికి పాల్పడినట్లు స్పష్టంగా లేదన్నారు. తమపై కేసుల నమోదు వెనుక ప్రభుత్వ హస్తం ఉందని తాను భావించడం లేదని, స్థానిక నాయకుల పాత్ర ఉందనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అఖిలప్రియ వ్యాఖ్యల నేపథ్యంలో సుబ్బారెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.  

భార్గవ్‌రామ్‌కు రెండోసారి నోటీసులు

ఏవీ.సుబ్బారెడ్డి హత్యకు కుట్రలో కీలక సూత్రధారి, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌నాయుడుకు కడప పోలీసులు శుక్రవారం రెండోసారి నోటీసులు జారీ చేశారు. కడప చిన్నచౌకు పోలీసులు మార్చి 23న బైపాస్‌ రోడ్డు వద్ద ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.50 లక్షల నగదు, తుపాకీ, తూటాలు స్వాధీనపరచుకున్నారు. వారిని విచారిస్తే హైదరాబాదులో ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు భార్గవ్‌రామ్‌ నాయుడు రూ.50 లక్షలు సుపారీ ఇచ్చారని విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇటీవల భార్గవ్‌రామ్‌ నాయుడు వ్యక్తిగత కార్యదర్శిని కూడా అరెస్టు చేశారు. హత్య కుట్రలో కీలక సూత్రదారైన భార్గవ్‌రామ్‌ నాయుడు విచారణకు హాజరు కావాలని కడప పోలీసులు వారం రోజుల కిందట నోటీసులు జారీ చేశారు.ఆయన హాజరు కాలేదు. రెండోసారి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకుంటే అరెస్టు తప్పదని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Posted

ఎందుకు చంపాలనుకున్నారు?

 
AV-Subba-Reddy.jpg?itok=KJbDiaJ6

సాక్షి, కర్నూలు: తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలీసులు చెబితేనే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు చెప్పిన విషయాలు తెలుసుకుని షాక్‌ తిన్నానని పేర్కొన్నారు. ‘‘నేను అఖిలప్రియపై ఫిర్యాదు చేయలేదు. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఆళ్లగడ్డ రమ్మని అఖిలప్రియ అంటోంది. ఆమె నాకు రాజకీయ నేర్పుతుందా. నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నా.. అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న అని’’ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు)

కార్యకర్తలను కాపాడుకున్న చరిత్ర తనదని తెలిపారు. భూమా నాగిరెడ్డి నామినేషన్‌కు వెళ్తుంటే.. దాడులు చేస్తుంటే.. భూజాలపై ఎత్తుకునిపోయి కాపాడానని తెలిపారు. అలాంటి తనను ఎందుకు చంపాలనుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు భూమా కుటుంబానికి,తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. నాగిరెడ్డి కోసం నంద్యాల సీటు వదులుకున్నానని చెప్పారు. ‘‘అఖిలప్రియ ఇంఛార్జ్‌గా ఉంటే.. ఆళ్లగడ్డలో ఎంతమందిని చంపిస్తారో. ఆమెకు తప్పా మరెవ్వరికి అక్కడ అవకాశం ఇచ్చినా మద్దతు ఇస్తా. టీడీపీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాను. అఖిల ప్రజల్లోకి వెళ్లి గెలవలేదని’’ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Posted
29 minutes ago, ChinnaBhasha said:

deeni chapter close chestaru andaru kalisi

Babori shava rajakeeyala valla minister ayyindi. Otherwise antha scene ledu akhila priya ki. 

Posted
10 minutes ago, snoww said:

Babori shava rajakeeyala valla minister ayyindi. Otherwise antha scene ledu akhila priya ki. 

moreover telsi telvaka wrong steps vestunnattundi. 

Posted
10 minutes ago, snoww said:

Babori shava rajakeeyala valla minister ayyindi. Otherwise antha scene ledu akhila priya ki. 

Political ga finish ayyinatte

Aa nandyala candidate will jump to ysrcp 

Posted
Just now, ChinnaBhasha said:

moreover telsi telvaka wrong steps vestunnattundi. 

Adhikaram ane balupu

Posted
1 minute ago, ChinnaBhasha said:

moreover telsi telvaka wrong steps vestunnattundi. 

Husband activities also causing lot of trouble for her. 

Posted
1 minute ago, Silverado said:

AV subba Reddy daughter looks cute

Looks like Regina 

  • Haha 1
Posted
2 minutes ago, Aryaa said:

Looks like Regina 

I vote for jaswanthi anyday than akhilapriya:giggle:

Posted
2 hours ago, Hydrockers said:

Adhikaram ane balupu

Nara naraaana ballupu undy priya ky

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...