Jump to content

Recommended Posts

Posted
  • రిజిస్ర్టేషన్ల ఆదాయానికి భారీ గండి 
  • మే నెల లక్ష్యంలో వచ్చింది 25 శాతమే
  • లాక్‌డౌన్‌తో కుదేలైన నిర్మాణ రంగం
  • ఇసుక, సిమెంటు ధరల పెంపుతో స్తబ్దత  
  • అమ్మకాల్లేక పీకల్లోతు కష్టాల్లో బిల్డర్లు
  • 40 లక్షల మంది కార్మికులకూ గడ్డుకాలం

 

అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తీవ్ర స్తబ్దత నెలకొంది. ఇసుక, సిమెంట్‌ ధరలు పెరిగిపోవడంతో పాటు కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో నిర్మాణరంగం పరిస్థితి నిప్పుల కొలిమిలో పడినట్లయింది. దీని ప్రభావం రిజిస్ర్టేషన్లపైనా పడింది. మే నెలలో రిజిస్ర్టేషన్ల ఆదాయ లక్ష్యం రూ.750కోట్లు కాగా వచ్చింది కేవలం రూ.184కోట్లు (దాదాపు 25ు) మాత్రమే. లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇవ్వడంతో మే 3వ తేదీ నుంచి రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు తదితర నగరాల్లో మాత్రం 18 నుంచి తెరిచారు. కానీ ఆదాయం మాత్రం ఆశించిన దానిలో నాలుగో వంతు కూడా రాలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు తెరవకపోవడంతో ఆ నెలలో ఆదాయం దాదాపు శూన్యం. కరోనా ప్రభావంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నెలకొన్న స్తబ్దతే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.5వేల కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Skip
 
 

లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 23నుంచి మే 3 వరకు కార్యాలయాలు తెరవక రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి. కార్యాలయాలు తెరిచాక పెండింగ్‌లో ఉన్నవి, కొత్తవి కలిపి ఆదాయం పెరగాలి. కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, భరోసా లేని వాతావరణంతో కొనుగోళ్లు మందగించాయి. అగ్రిమెంట్లు చేసుకున్నవారు అడ్వాన్సు ఇచ్చినంత మేరకు రిజిస్ర్టేషన్లు చేయించుకుని.. మిగతా స్థలం, భూమిపై ఒప్పందం రద్దు చేసుకుంటున్నారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ ఆదాయాలు తగ్గిపోయాయి. మే నెలలో విశాఖ జిల్లాలో ఆదాయం రూ.26కోట్లు వచ్చింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది మూడోవంతు మాత్రమే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.17కోట్ల చొప్పున వచ్చింది. గుంటూరు జిల్లాలో 2019 మే నెలతో పోలిస్తే రూ.30కోట్ల ఆదాయం తగ్గింది. విజయనగరం జిల్లాలో రూ.22కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.25కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.20కోట్లు వచ్చాయి. ఇక్కడా గణనీయంగా తగ్గాయి.

 

పెరిగిన ధరలతో మంటలు 

వాస్తవానికి గతేడాది నుంచీ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వం ఇసుకకు ధర పెట్టడం, ఇసుక కొరతతో కొన్నాళ్లు నిర్మాణాలు నిలిచిపోవడం, తర్వాత ధరలు భారీగా పెరగడం, మూడు రాజధానుల నిర్ణయంతో ఎక్కడికక్కడ అమ్మకాలు నిలిచిపోవడంతో రియల్‌ వ్యాపారం బాగా దెబ్బతింది. ఇవన్నీ పడలేక కొందరు హైదరాబాద్‌కు తరలిపోయారు. మరికొందరు ఈ రంగమే వదిలేశారు. ఇప్పుడు కరోనా మరింత దెబ్బతీసింది. ఉద్యోగ కల్పన, ఆర్థికాభివృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మరోవైపు సిమెంటు ధరలు సైతం విపరీతంగా పెరగడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారిందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు వాపోతున్నాయి.

 

దృష్టి పెట్టకుంటే ఇబ్బందే 

రాష్ట్రంలో లక్షలాది కార్మికులు రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో మేస్త్రీలు, ఎలక్ర్టీషియన్లు, ప్లంబర్లు, ఉడ్‌వర్క్‌ నిపుణులు, పెయింటర్లు... సుమారు 20 వృత్తుల వారు 25-30లక్షల మంది ఉన్నారని అంచనా. ఈ రంగం పుంజుకునేలా చర్యలు తీసుకోకుంటే వీరందరిపైనా తీవ్ర ప్రభావం తప్పదు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని ఆదుకోకుంటే మొత్తం ఆర్థిక వ్యవస్థే అథోగతి పాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Posted

Amaravati ee single capital ani announce chesi unte income. Double vachedi ani bolli gadu briefed 

Posted
2 minutes ago, Hydrockers said:

Amaravati ee single capital ani announce chesi unte income. Double vachedi ani bolli gadu briefed 

What is bramaravati real estate update. 

@tacobell fan vuncle gajam 7k target price reached aa

Posted
1 minute ago, snoww said:

What is bramaravati real estate update. 

@tacobell fan vuncle gajam 7k target price reached aa

5K ayithe nenu Oka 200 yards koni petkunta

Posted

Amaravathi varaku enduku VA...inko rendu nelalu aagithey Mana daggara situation kuda shame to shame aiyettu undhi...

Posted
3 hours ago, snoww said:

What is bramaravati real estate update. 

@tacobell fan vuncle gajam 7k target price reached aa

No. But i have one guy, he want 50 lakhs and he will register 800 sq yards on your name as goodwill in case if he is unable to pay. Meaning they have confidence that they can pay. Other than that not able to find anything cheap. 

Posted

Anni chotla alane vundi 

cash is king 

telisina vallu 1.75 ani cheppuna apartment ni 1 cr ke konnaru 

avsaram alantidi ippudu no buyers ekkadina okate 

Posted
5 hours ago, Hydrockers said:

Amaravati ee single capital ani announce chesi unte income. Double vachedi ani bolli gadu briefed 

Anduke 3 capitals petti visa ready jaaki lu petti lepina legatledu...mana jaganal briefed ca

Posted
3 hours ago, manadonga said:

Anni chotla alane vundi 

cash is king 

telisina vallu 1.75 ani cheppuna apartment ni 1 cr ke konnaru 

avsaram alantidi ippudu no buyers ekkadina okate 

Which location ?

Posted
6 hours ago, tacobell fan said:

No. But i have one guy, he want 50 lakhs and he will register 800 sq yards on your name as goodwill in case if he is unable to pay. Meaning they have confidence that they can pay. Other than that not able to find anything cheap. 

itlanti deals kooda vuntaya 

Posted
4 hours ago, manadonga said:

Anni chotla alane vundi 

cash is king 

telisina vallu 1.75 ani cheppuna apartment ni 1 cr ke konnaru 

avsaram alantidi ippudu no buyers ekkadina okate 

Details plzz 

Posted

Details telidu 

konukunnadi maa second cousin. 
Oka time lo 1.75 chepparu 4 bed 4 bath  

momna 1.25 chepparu beram adithe baaga taggi 1 chillara vachhindi 

memu andaram vadini chusi jelousy anuko 

some where near gachhibowli ani telusu 

 

Posted

అద్దె ఇళ్లు వెలవెల

06082020045433n56.png

 

  • ఉద్యోగాలు, ఉపాధి పోయి పల్లెలకు జనం.. కరోనా భయంతో స్వచ్ఛందంగా వెళ్లిపోయిన కొందరు
  • పట్టణాల్లో కిరాయి ఇళ్లకు తగ్గిపోయిన డిమాండ్‌ 
  • అద్దె ఇల్లు అడిగేవారే లేరు.. ఎక్కడ చూసినా టు లెట్‌ బోర్డులే 

 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కొలువు కోసమో.. కోచింగ్‌ కోసమో పట్టణానికి వచ్చే వారికి ఓ అద్దె ఇంటిని వెతికి పట్టుకోవడం ఓ సమస్య. ఉదయం నుంచి రాత్రిదాకా రోజుల తరబడి గల్లీ గల్లీ తిరిగో.. కమిషన్‌ ఏజెంట్లను ఆశ్రయించో ఓ అద్దె ఇంటిని దొరకబుచ్చుకుంటే అదో పండగే. ఇదంతా గతం. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఎక్కడికక్కడ ‘టు లెట్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అద్దె ఇళ్లకు డిమాండ్‌ బాగా తగ్గిపోయింది. ఇదంతా కరోనా ప్రభావమే!! పట్టణ ప్రాంతాల్లో ఉంటూ పనులు చేసుకునే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారిలో ఎక్కువ మంది కరోనా వైరస్‌ భయంతో ఇళ్లు ఖాళీ చేసి ముల్లేమూటా సర్దుకొని సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పట్టణాల్లో అద్దె ఇళ్లు ఖాళీ అయిపోయాయి. కరోనాతో ఉద్యోగాలు పోయి.. లాక్‌డౌన్‌తో ఉపాధి కరువైన వారిలోనూ చాలామంది స్వస్థలాలకు వెళ్లిపోయారు.

 

గతంలో టు లెట్‌ బోర్డు పెట్టిన ఒకట్రెండు రోజుల్లోనే ఎవరో ఒకరు దిగేవారు. ఇప్పుడు బోర్డు పెట్టి వారాలు గడుస్తున్నా ఎవ్వరూ వచ్చి ఇల్లు కావాలని అడగడం లేదు. సాధారణంగా ఊర్లలో ఉంటూ వ్యవసాయం చేసే ఉమ్మడి కుటుంబాలు కూడా పిల్లల చదువు కోసం పట్టణాల్లో ఉంటున్నారు. ఓ అద్దె ఇల్లు తీసుకొని, భార్యాపిల్లలను ఉంచుతున్నారు. వారంలో రెండు మూడు రోజలు ఊరికి వెళ్లి సాగు పనులు చూసుకుంటున్నారు. పదేళ్లుగా ఈ ధోరణి బాగా పెరిగిపోయింది.  బిహార్‌, యూపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కొందరు హైదరాబాద్‌కు వచ్చి చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేవారూ ఉన్నారు. వారంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఏప్రిల్‌, మే నెలల్లో కరోనా కేసులు బాగా పెరగడంతో ఎక్కువమంది ఇళ్లను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. 

 

ఈఎంఐలు ఎలా కట్టేది? 

ఉద్యోగస్తులు, వ్యాపారులు బ్యాంకుల్లో గృహ నిర్మాణానికి రుణా లు తీసుకొని ఇళ్లను నిర్మించుకున్నారు. కింది పోర్షన్‌లో తాముండి పై అంతస్తులో ఇళ్లను అద్దెకివ్వడం ద్వారా వచ్చిన డబ్బులతో ఈఎంఐలు కట్టేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. కరోనా కారణంగా అద్దె ఇళ్లు ఖాళీ కావడం.. టు లెట్‌ బోర్డులు పెట్టినా ఎవ్వరూ రాకపోవడంతో సమస్యల్లో పడ్డా రు. ఈఎంఐలు చెల్లించడం తమకు ఇబ్బందేనంటున్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌ నిర్మ ల్‌, మిర్యాలగూడ, నల్లగొండ, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట వంటి ప్రాంతాల్లో చాలా చోట్ల టు లెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

 

కరోనా వారియర్స్‌కు ‘అద్దె’ కష్టాలు

హైదరాబాద్‌ సిటీ: కరోనా వారియర్స్‌గా కోట్లాది మంది మన్ననలు పొందిన పోలీసులకు ‘అద్దె’ కష్టాలు వచ్చిపడ్డాయి. విధులు నిర్వహిస్తుండగా సీఐ, ఎస్సైలతో సహా పదుల సంఖ్యలో కానిస్టేబుళ్లు కొవిడ్‌-19 బారిన పడ్డారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం నేడో, రేపో ఇంటికి రావాల్సి ఉంది. వీరిలో చాలా మంది అద్దె ఇంట్లో ఉంటున్నారు. తమ పిల్లలకూ వైరస్‌ సోకుతుందన్న భయంతో వారిని ఇంటికి రావొద్దని అద్దె ఇంటి యజమానులు హెచ్చరిస్తున్నారు. భార్యాపిల్లలను వదిలి ప్రజా సేవ చేసిన తమకు ఇలాంటి కష్టాలు రావడంపై పోలీ్‌సలు ఆవేదన చెందుతున్నారు. కరోనాపై యుద్ధంలో భాగంగా లాక్‌డౌన్‌ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడిన వైద్యులు, పోలీ్‌సలు, పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం కరోనా వారియర్స్‌గా కొనియాడింది. ప్రజలు వారికి పూలాభిషేకం చేశారు. ఇలాంటి సత్కారాలు పొందిన వారియర్స్‌ ఇప్పుడు కొంత మంది ఇంటి యజమానుల నుంచి ఛీత్కారానికి గురవుతున్నారు.  

 

3 మాసాలుగా ఖాళీనే..

కరోనా ప్రబలుతుండటంతో  కిరాయిదార్లు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇతర ప్రాంతాల నుంచి కొల్లాపూర్‌ ప్రాంతంలో జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో పని చేసే ఉద్యోగులకు పనులు బంద్‌ కావడంతో వారంతా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ కారణంగా మూడు నెలల నుంచి నివాస గృహాలు ఖాళీగా ఉన్నాయి.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...