johnydanylee Posted June 8, 2020 Report Posted June 8, 2020 తమిళనాడులోని సేలం జిల్లా చిన్న సముద్రానికి చెందిన పూమారై కూతురు సత్య(20)కు సెంగవల్లి నడువలూరుకు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్ (28)తో జూన్ 4న వివాహమైంది. సత్య అదేరోజు అత్తింటి వారికి వచ్చింది. 5వ తేది సాయంత్రం ఊళ్లోని షాపుకు వెళ్లి వస్తానని వెళ్లిన సత్య ఇంటికి తిరిగిరాలేదు. దీంతో భర్త రవికుమార్ ఇతర కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. పుట్టింటికి సమాచారం ఇచ్చారు. ఈలోపు నవ వధువు సత్య తన ప్రియుడైన చిన్న సముద్రానికి చెందిన వల్లరసు(23) అనే యువకుడిని పెళ్లి చేసుకొని తమకు రక్షణ కల్పించాలని ఆత్తూర్ పోలీసులను ఆశ్రయించింది. రవికుమార్ సత్య తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆమెను రావాలని కోరారు. అయితే రెండేళ్లుగా తాను వల్లరసును ప్రేమిస్తున్నానని.. తన తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సత్య తెలిపింది. ఈ క్రమంలోనే పెళ్లి కొడుకు తరుఫు వారు పెట్టిన బంగారం నగలు తాళి పోలీసుల సమక్షంలో వారికి తిరిగి ఇచ్చేసింది. పెళ్లి ఖర్చును ఇవ్వాలని రవికుమార్ కుటుంబ సభ్యులు కోరగా.. సత్య వల్లరసు లు అంగీకరించి పోలీసుల ఎదుట అగ్రిమెంట్ మీద సంతకాలు చేసి ఖర్చు ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో పాపం పెళ్లికొడుకే బలైపోయాడు. . Nice settlement Quote
loveralsofighteralso Posted June 8, 2020 Report Posted June 8, 2020 arey oo nad gandhi esnav vadu manchi ga laggam seskunadu kodukki ki kuda ida pellam mogdu dosth theerla undaley..parents dhi mistake ida pilla side Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.