Jump to content

Recommended Posts

Posted

ఏసుప్రభు చెప్పినా జగన్ వినడు.. అదొక్కటే మార్గం: జేసీ దివాకర్ రెడ్డి

06132020105026n27.jpg

అనంతపురం: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందన్నారు. ఏసు ప్రభు చెప్పినా వినే పరిస్థితిలో జగన్ లేడని, జగన్‌ను కంట్రోల్‌లో పెట్టడం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. తమకు కోర్టు తప్ప వేరే మార్గం లేదని ఆయన చెప్పారు. జేసీ అస్మిత్ రెడ్డికి ఈ వ్యవహారానికి సంబంధమే లేదన్నారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు నడుములు విరిగిపోయి వారు ఏమీ చేయలేక పోతున్నారని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన తమ్ముడి అరెస్టుపై తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అరెస్టుకు నిరసనగా ఎలాంటి కార్యక్రమ ప్రణాళిక లేదన్నారు.

Skip
 
‘‘నేను నిజం చెబుతున్నా నాకు ఎన్ని లారీలు ఉన్నాయో.. ఎన్ని బస్సులు ఉన్నాయో నాకే తెలియదు. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఈ ప్రభుత్వం దేనికి అయినా తెగిస్తుంది. దీనికి రూల్స్ లేవు, రెగ్యులషన్స్ లేవు. చట్టం లేదు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్లు ఉంది ఈ పరిస్థితి. ఏమీ చేయలేం. కోర్టుకు వెళ్లాల్సిందే. చీఫ్ సెక్రటరీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. జగన్ సర్వశక్తి సంప్పన్నడు. ఆయనే అల్లా, ఆయనే ఏసు, ఆయనే తిరుపతి వెంక్కన. తన మాటకు ఎదురు చెప్పేవాడు, తనకు ప్రతి పక్షంలో ఎవరు లేకుండా చేయడమే తన ధేయం అన్నట్లుగా ఉంది జగన్ పాలన. జగన్ దగ్గర మంచి అధికారులు ఉన్నా వారి మాట చెల్లుబాట అయ్యేటట్లు లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట కూడా వినే పరిస్థితిలో జగన్ లేడు. నన్ను నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టాడు.. నా ఆర్థిక మూలాలు లేకుండా చేశాడు. నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Posted

Babori week end Hyderabad family time ni cancel sepinchaav kada raa jalaganna 

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో అమరావతికి బయలుదేరనున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో అచ్చెన్నాయుడిన పరామర్శించేందుకు చంద్రబాబు అనుమతి కోరారు. జైలు సూపరింటెండెంట్, జైళ్ల శాఖ డీజీని చంద్రబాబు అనుమతి కోరారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్ట్ అయిన  మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి విజయవాడ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతేకాక అనారోగ్యంతో ఉన్న అచ్చెన్నాయుడికి ఆస్పత్రిలో వైద్యం అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 

Posted
Just now, snoww said:

Ide suffort interest kodela thatha meeda kooda petti vunte papam kodela thatha inka bathiki vunde vaadu emo.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...