Jump to content

Hair cut price sky rocket


Recommended Posts

Posted
కటింగ్‌ కాస్ట్‌లీ గురూ..

అత్యధిక సెలూన్లలో 30 నుంచి 40 శాతం దాకా పెరిగిన ధరలు

కటింగ్‌ కాస్ట్‌లీ గురూ..

సెలూన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. అక్కడ సేవలూ ప్రియమయ్యాయి. కరోనా నేపథ్యంలో జాగ్రత్తల విషయంలో సెలూన్‌లు ఆసుపత్రులను తలపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత తెరుచుకున్న వాటిల్లో ప్రత్యేక ఏర్పాట్లు వచ్చాయి. నిర్వాహకులు వ్యక్తిగత పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. ఇంతక్రితం దాకా సెలూన్‌లలో కత్తెరలు, దువ్వెనలు, అద్దాల వంటివాటికే ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు, పీపీఈ కిట్‌లు, వ్యక్తిగత వస్త్రాలు మొదలైనవి వాటి సరసన చేరాయి. సేవలు అందించేవారికి, సేవలు అందుకునే వారికి ఉభయతారకంగా ఉండేలా పరిశుభ్రత, వ్యక్తిగత భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు. పైగా వినియోగదారులు కూడా పరిశుభ్రత, అక్కడ చేసిన ఏర్పాట్లు, సిబ్బంది తీసుకున్న వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యమిస్తున్నారు. నమ్మకం కుదిరితేనే అడుగుపెడుతున్నారు.


హైదరాబాద్‌లో చాలా చోట్ల ఎలా చేస్తున్నారంటే..

కటింగ్‌ కాస్ట్‌లీ గురూ..మాస్క్‌ ఉంటేనే సెలూన్‌లోకి అనుమతిస్తున్నారు. ముందే థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా ఉష్ణోగ్రతను తెలుసుకుంటున్నారు. కుర్చీ, కత్తెరలు, దువ్వెనల వంటివాటిని వినియోగదారుని సమక్షంలోనే పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేస్తున్నారు. సీట్లో కూర్చోడానికి ముందే ప్రత్యేక కిట్‌ తెరుస్తున్నారు. అందులోంచి కాళ్లకు, తలకు పెట్టుకునే కవర్‌లు, చేతులకు గ్లౌజ్‌లు తదితరమైనవి అందించి ధరించమని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఒకసారి వాడి పారేసే కత్తెర్లు వాడుతున్నారు. సేవలు అందించేవారు ప్రత్యేక మాస్క్‌, పీపీఈ కిట్‌ ధరిస్తారు. షేవింగ్‌ చేయరు. కటింగ్‌తోపాటు అవసరమైతే ట్రిమ్మింగ్‌ చేస్తారు.


సెలూన్‌ స్థాయి ఆధారంగా రూ.150 నుంచి రూ.1,000 అంతకంటే ఎక్కువ

లాక్‌డౌన్‌ తర్వాత కటింగ్‌ కాస్ట్‌లీ అయిందనే అభిప్రాయాలున్నాయి. అత్యధిక చోట్ల 30 నుంచి 40 శాతం దాకా రేట్లు పెరిగాయి. సాధారణ సెలూన్‌లలో గతంలో కటింగ్‌, షేవింగ్‌ రూ.100 నుంచి రూ.120 ఉండేది ఇప్పుడు తక్కువలో తక్కువగా రూ.150కి పెరిగింది. ప్రముఖ సెలూన్లలో కటింగ్‌కే రూ.100 నుంచి రూ.150 దాకా పెంచారు. ప్రత్యేక ఏర్పాట్లకు రూ.125 నుంచి రూ.150 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. 18 శాతం జీఎస్టీ అదనం. మొత్తమ్మీద రేట్లు సెలూన్‌ స్థాయి ఆధారంగా రూ.150 నుంచి రూ.1,000 అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా చేయాలంటే దానికి అదనంగా వసూలు చేస్తున్నారు. కూకట్‌పల్లిలో హెయిర్‌కటింగ్‌ చేయించుకున్న శ్రీధర్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ రేట్లు రెట్టింపునకు మించిపోయినట్లు తెలిపారు. గతంలో రూ.177 అయ్యేదని ఇప్పుడు రూ.383 అయిందని అన్నారు. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ మాట్లాడుతూ గతంలో కటింగ్‌, షేవింగ్‌ రూ.100 ఉండేదని ఇప్పుడు రూ.150 అయిందన్నారు.


పెంపు తప్పలేదు

 

కటింగ్‌ కాస్ట్‌లీ గురూ..

‘‘పరిశుభ్రతకే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏర్పాట్లకు ఎక్కువ వ్యయం అవుతోంది. ఒక్కో పీపీఈ కిట్‌ రూ.800 నుంచి రూ.1,000 దాకా ఉంది. ఏర్పాట్లు సరిగా లేకుంటే కస్టమర్లు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయని ముందుగా అడిగి తెలుసుకుంటున్నారు. మేం కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటూ సేవలు అందిస్తున్నాం. రేట్లు పెంచక తప్పలేదు. కస్టమర్లు హెయిర్‌ కటింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫేషియల్‌, మసాజ్‌, హెడ్‌బాత్‌ వంటి వాటికి దాదాపు దూరంగా ఉన్నారు’’ అని పలువురు సెలూన్ల నిర్వాహకులు తెలిపారు.

Posted
1 hour ago, Tellugodu said:

I pay 15$ for hair cut in CA.

Idhi usual ah leka after covid rate ah..

Posted
18 minutes ago, Kool_SRG said:

Idhi usual ah leka after covid rate ah..

Same rate before and after Covid.

Posted
19 hours ago, Tellugodu said:

I pay 15$ for hair cut in CA.

cheap nenu 35 including tip...

Posted
17 hours ago, Kool_SRG said:

Idhi usual ah leka after covid rate ah..

That is the common price... high end ayithe $35...

Posted
1 hour ago, zarathustra said:

I pay $10 in Dallas for haircut at a Korean place

you should visit all state barber school, it would be much cheaper lol, 

jokes apart post covid, I have decided either to Shave my Head or leave it to grow. 

No in between. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...