Jump to content

Pulka media ni addam pettukoni, chinababu Ki elevations ivvalani CBN nijanga peddha thappu chesadu


Recommended Posts

Posted

Mari 17 endhayya ... vallabhaneni lanti hard core tdp batch kuda chinababu & co chese panula valla dhuram ayyaru 

Posted

party ni M koodipinchaaadu, aatma gauravam LP vishayam lo chesina thappe bob mana chinna bob vishayam lo chesaaadu

Posted

రాజ్యసభ ఎన్నికల్లో ఫలించిన టీడీపీ వ్యూహం

అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఫలించింది. పార్టీ నుంచి జంప్‌ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీకి ఓటు వేయకుండా ఆ పార్టీ అడ్డుకో గలిగింది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ముగ్గురి ఓట్లు చెల్లుబాటు కాలేదు. ముగ్గురు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత టీడీపీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు వైసీపీ అభ్యర్థులకే ఓట్లు వేస్తారని ముందుగానే టీడీపీ నేతలు పసిగట్టారు. అందుకే కరణం బలరాం, మద్దాలి గిరి, వంశీకి టీడీపీ అధిష్టానం విప్ జారీ చేసింది. విప్ ఇవ్వడంతో ఓటింగ్‌లో పాల్గొనే వారు.. ఎవరికి ఓటు వేశారో అనే విషయాన్ని ఎజెంట్‌కు తప్పకుండా చూపించాలి. దీంతో వాళ్లు టీడీపీకి కచ్చితంగా ఓటు వేయాల్సి వచ్చింది. అయితే ఆ ముగ్గురు.. టీడీపీ‌కే ఓటు వేసినా అది చెల్లని విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకటి అని పెట్టాల్సిన మొదటి ప్రాధాన్యతా స్థానంలో టిక్ మార్క్ పెట్టారు. వైసీపీకి ఓటు వేయలేకపోయిన తాము టీడీపీకి చెల్లని విధంగా ఓటు వేసి సరిపెట్టుకున్నారు. విప్ జారీతో టీడీపీ వ్యూహాత్మకంగా ఈ విధంగా రెబెల్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టగలిగిందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేశారు. అవగాహన లోపంతో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పొరపాటు చేసింది. మొదటి ప్రాధాన్యత స్థానంలో పొరపాటున భవాని టిక్‌ మార్క్‌ పెట్టారు. ఓటింగ్‌కు దూరంగా ఇద్దరు టీడీపీ ఇద్దరు సభ్యులున్నారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కరోనా కారణంగా ఆయన ఓటు వేయలేకపోయారు. ఇటీవల వ్యాపార రీత్యా తెలంగాణ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిశానని, ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో తాను సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నానని చంద్రబాబుకు లేఖ ద్వారా తెలిపారు. అయితే తాను టీడీపీకి వీర విధేయుడిని, ఓటింగ్‌లో పాల్గొనకపోవడం బాధగా ఉందని అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...