snoww Posted July 1, 2020 Report Posted July 1, 2020 అమ్మకానికి ‘అమరావతి’ టవర్లు!? ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఏపీ సీఆర్డీయే అధికారులు? Skip చ.అ. 3500కి అమ్మే యోచన వందల కోట్ల లాభంపై ఆశ ప్రభుత్వ ఆదేశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఏపీ సీఆర్డీయే? (అమరావతి - ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాసార్థం గత ప్రభుత్వం నిర్మించిన భారీ రెసిడెన్షియల్ టవర్లను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టే యోచనలో ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఏపీ సీఆర్‌డీయే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అమరావతిలో నిర్మించిన అపార్ట్‌మెంట్లను చదరపు అడుగుకు రూ.3,500-4,000 మధ్య అమ్మగలిగితే సీఆర్డీయేకు నిర్మాణ ఖర్చులన్నీపోను కనీసం కొన్ని వందల కోట్లు లాభం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ‘డీల్’ వల్ల ఎంత లాభం అనే విషయాన్ని పక్కన పెడితే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ రెసిడెన్షియల్ టవర్లను అమ్మివేస్తే పూర్తిస్థాయి రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం మాత్రం ఖాయం! ఇప్పటికే వివాదాస్పద, ఆక్షేపణీయ నిర్ణయాలతో అమరావతి గొంతు నులిమేందుకు సకల ప్రయత్నాలూ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరొక పెద్ద అడుగు వేసినట్లవుతుంది! ఒకవేళ భవిష్యత్తులో ప్రస్తుత పరిస్థితులన్నీ సమూలంగా మారి, ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగినప్పటికీ.. అందులో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అఽధికారులు, ఉద్యోగులకు నివాస వసతి కల్పించడం అసాధ్యమవుతుంది. అసంపూర్తి పనుల పూర్తి - ఆ తర్వాత అమ్మకం.. ఒక్కొక్కటి 12 అంతస్తులతో కూడిన సుమారు 63 రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నింట్లో కలిపి సుమారు 4,200లకుపైగా అపార్ట్‌మెంట్లుంటాయి. ఇవి కాకుండా మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం 180 బంగళాల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది. వాటన్నింటి నిర్మాణానికి సుమారు రూ.2500-3,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. టవర్లలో అత్యధికం 70-80 శాతంమేర పూర్తయ్యాయి. అదే ఊపులో ఇంకొద్ది నెలలు పనులు సాగితే ఈ టవర్లన్నీ పూర్తయి, గతేడాది ఆగస్టు నాటికి ఆక్యుపేషన్‌కు సిద్ధమవుతాయని భావించారు. బంగళాల నిర్మాణం కూడా 30- 40 శాతం వరకూ పూర్తయ్యాయి. అయితే.. గతేడాది మే నెలలో గద్దెనెక్కిన జగన్ సర్కార్ ఉత్తర్వులతో అమరావతిలోని మిగిలిన అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే పైన పేర్కొన్న రెసిడెన్షియల్ టవర్లతోపాటు బంగళాలు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో.. ఈ నివాస సముదాయాల్లో మిగిలిన పనుల్ని పూర్తి చేయించి, వాటిని అమ్మేయాలని జగన్ ప్రభుత్వం భావించి ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ టవర్లను పూర్తికి ఎన్ని నిధులు అవసరం, పూర్తయిన తర్వాత అమ్మకానికి పెడితే ఎంత మొత్తం లభించే అవకాశముంది..? తదితరాంశాలపై ప్రతిపాదనలు రూపొందించాలని సీఆర్డీయేకు ఆదేశాలిచ్చినట్టు తెలిసింది! ఆ మేరకు సీఆర్డీయేలోని ఉన్నతాధికారులు సవివర నివేదికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. త్వరలోనే వాటిని ప్రభుత్వానికి అందజేయనున్నారని, వాటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా సీఆర్డీయే కార్యాచరణ సిద్ధం చేస్తుందని సమాచారం. పరిసర ప్రాంతాలకన్నా తక్కువ ధరకే! అమరావతిలోని అత్యంత కీలకమైన గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో, సీడ్ కాంప్లెక్స్ రోడ్డుకు-కృష్ణానదికి చేరువగా, హైకోర్టుకు సమీపంలో అత్యధునాతన వసతులతో నిర్మితమవుతున్న రెసిడెన్షియల్ టవర్లు, బంగళాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎన్ని వసతులు ఉన్నా.. జాతీయ రహదారికి సుమారు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ధర తగ్గించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సీఆర్డీయే అధికారులు అమరావతికి చేరువలోని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై ఉన్న తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లకు ప్రస్తుతం ఎంత ధర పలుకుతోందో పరిశీలిస్తున్నారు. వాటితో పోల్చితే ఈ టవర్లలోని ఫ్లాట్ల ధరను 15- 20 శాతం తక్కువగా నిర్ణయిస్తే, మంచి డిమాండ్ ఉండొచ్చని భావిస్తున్నారు. Quote
snoww Posted July 1, 2020 Author Report Posted July 1, 2020 30% discount isthe @tacobell fan vuncle will buy one whole tower ani seppamannadu Quote
tacobell fan Posted July 1, 2020 Report Posted July 1, 2020 7 hours ago, snoww said: 30% discount isthe @tacobell fan vuncle will buy one whole tower ani seppamannadu akkada emi undi ani kontaru uncle? Quote
Anta Assamey Posted July 1, 2020 Report Posted July 1, 2020 Right now No Buyer and No Seller... Quote
Assam_Bhayya Posted July 1, 2020 Report Posted July 1, 2020 33 minutes ago, tacobell fan said: akkada emi undi ani kontaru uncle? Quote
snoww Posted July 1, 2020 Author Report Posted July 1, 2020 3 hours ago, tacobell fan said: akkada emi undi ani kontaru uncle? Nuvve ala antey ela vuncle. Pedda manasu sesukoni oka tower konu. Quote
MiryalgudaMaruthiRao Posted July 1, 2020 Report Posted July 1, 2020 tg teddies ready to buy anta Quote
Migilindi22 Posted July 1, 2020 Report Posted July 1, 2020 Just now, MiryalgudaMaruthiRao said: tg teddies ready to buy anta Uncle burnol dorykydha hell laa Quote
tom bhayya Posted July 1, 2020 Report Posted July 1, 2020 endhuku ysr swagruha scheme lo free ga icheyochu gaa 1 1 Quote
Silverado Posted July 1, 2020 Report Posted July 1, 2020 Just now, tom bhayya said: endhuku ysr swagruha scheme lo free ga icheyochu gaa Yes Quote
snoww Posted July 1, 2020 Author Report Posted July 1, 2020 Temporary secretariat ni indoor swimming pool laa use seyyali after capital shift ani pulkas requesting. Quote
AndhraneedSCS Posted July 1, 2020 Report Posted July 1, 2020 Short term gains kosam long term assets ni sacrifice chestunnaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.