ramabeer Posted July 22, 2020 Report Posted July 22, 2020 https://www.eenadu.net/latestnews/aeronatical-student-turned-in-to-kidney-broker/0600/120086877 Quote
r2d2 Posted July 22, 2020 Report Posted July 22, 2020 ఏరోనాటికల్ ఇంజినీరు.. కిడ్నీల బ్రోకరయ్యాడు! జూబ్లీహిల్స్: అతను ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో టాపర్. బడా సంస్థల్లో ఉద్యోగం చేశాడు. చెడు అలవాట్లు, అత్యాశ అతణ్ని తప్పుదారి పట్టించాయి. అంతర్జాలంలో శోధించి కిడ్నీ అమ్ముకోవడమే కాదు.. అదే వ్యాపారంగా ఎంచుకున్నాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు. తాజాగా ఓ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీసులకు చిక్కాడు. పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. టాపర్ జీవితం చేజారిన తీరు గుంటూరులోని అరండల్‌పేట ప్రాంతానికి చెందిన డోగిపర్తి షణ్ముఖ పవన్ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ బీటెక్ ఎరోనాటికల్ ఇంజినీరింగ్ 93 శాతం మార్కులతో 2008లో పూర్తి చేశాడు. బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌లో ఆరు నెలల పాటు పనిచేశాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి రాంకోఠిలో బీపీఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. అందులో నష్టాలు రావడంతో, ఆదిభట్లలోని టాటాలో చేరాడు. హైదరాబాద్‌లో స్థలం కొనుగోలుకు తన బావ ఇచ్చిన రూ.11 లక్షలను షేర్లలో పెట్టాడు. అంతా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి.. అంతర్జాలంలో శోధించాడు. ఆ సమయంలోనే కిడ్నీ కావాలంటూ కొన్ని ప్రకటనలు చూశాడు. పుణెలో ఉన్న మధ్యవర్తి ద్వారా రూ.4.70 లక్షలకు తన కిడ్నీ విక్రయించాడు. ఈ సందర్భంగా పరిచయమైన నందకిశోర్‌తో కలిసి కిడ్నీ స్వీకర్తల వివరాలు అంతర్జాలంలో సేకరించి, దాతలను గుర్తించేవారు. పుణె తీసుకెళ్లి పరీక్షలు చేయించేవారు. శ్రీలంక, టర్కీలోని ఆసుపత్రులతో మాట్లాడుకొని అక్కడికి దాతలను, స్వీకర్తలను తీసుకెళ్లి కిడ్నీ మార్పిడి చేయించేవారు. వచ్చిన డబ్బుతో గోవా వెళ్లి జల్సాలు చేసేవారు. 2016లో అహ్మదాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో పట్టుబడిన నందకిషోర్, శ్రీనివాస్ రెండున్నరేళ్ల జైలుశిక్ష అనుభవించారు. తాజాగా బయటపడిందిలా.. నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బిజ్జాల నాగరాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్‌కు వెళ్లే సమయంలో శ్రీనివాస్ పరిచయమయ్యాడు. టర్కీలో కిడ్నీలు మార్పిస్తానని.. రూ.34 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. స్నేహితుడు సృజన్‌తో కలిసి ఆ సొమ్ము తీసుకొన్నాడు. కిడ్నీ దాత, స్వీకర్తలకు విమాన టిక్కెట్లు తీసుకోకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో గుట్టురట్టయింది. Quote
Nimmakai Posted July 22, 2020 Report Posted July 22, 2020 M.tech chesi constable inapudu tappu ledu gani Quote
bostonbro Posted July 22, 2020 Report Posted July 22, 2020 ikkada it jobs chesevallu kuda vere background nunchi mosam ni mosam tho ne thiyyali kada america lo Quote
bostonbro Posted July 22, 2020 Report Posted July 22, 2020 appreciate this guy....edo oka talent undhi better than suicide, hunger death. Quote
AndhraneedSCS Posted July 22, 2020 Report Posted July 22, 2020 Part time chesadu. adi kuda tappante ela? Ala ayithe Corporate hospitals management mottam Jail lo ne undali Quote
Spartan Posted July 22, 2020 Report Posted July 22, 2020 already sri lanka lo 2 years jailed... Quote
bostonbro Posted July 22, 2020 Report Posted July 22, 2020 brothers, sisters ,family help kuda cheyyara money matters lo leru emo Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.