Silveradotwo Posted August 1, 2020 Author Report Posted August 1, 2020 నీకేమన్నా పిచ్చిపట్టిందా. ఇక్కడ వరకూ వచ్చాక వెళ్ళిపోదాం అంటావేంటి అస్సలు ఈ అడవిలో ఏముందో తెలుసుకునే వెళ్దాం అని అభి అన్నాడు. వర్ణ సోనీ బూడిదని చూస్తూ ఏడుస్తుంది. కావాలంటే మీరు వెళ్ళండి. నేను రాను అని డేవిడ్ అన్నాడు. తను పెట్టుకున్న పువ్వు విషపూరితమైనది అయి ఉంటుంది. అందుకే ఇలా జరిగింది. దెయ్యం లేదూ ఏమీ లేదు అని అభి అన్నాడు. డేవిడ్ కోపంతో అభి చొక్కా పట్టుకుని ఏంటిరా! ఎప్పుడూ ఏదొక కథ చెప్తున్నావ్. మమ్మల్ని కూడా చంపించేస్తావా అని ఇద్ధరూ ఓకరి చొక్కా ఒకరు పట్టుకున్నారు. వర్ణ వాళ్లని విడతీయడానికి ఎంత ప్రయత్నించినా చొక్కాలు వదులుకోవటంలేదు. ఒక్కసారిగా వెనుక నుండి పెద్దగా గర్జించినట్టు శబ్దం రావడంతో వాళ్ళు చొక్కాలు వదులుకుని భయంతో ముందుకు పరిగెట్టారు. వాళ్ళ ఒంటిని భయం వనికిస్తుంది, గుండెని బాధ తొలిచేస్తుంది. దారి తప్పిపోయారు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. అభి వర్ణ చెయ్యి పట్టుకుని ముందు నడుస్తున్నాడు. వెనుక డేవిడ్ సోనీ గురించే ఆలోచిస్తూ నడుస్తున్నాడు. వెనుక నుండి సోనీ వచ్చి డేవిడ్ చెయ్యి పట్టుకుంది. నాకు భయమేస్తుంది. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. నువ్వు కూడా నాతో పటూ వచ్చేయ్ అని అంటూంది. ముందు నడుస్తున్న ఇద్దరికీ మాటలు వినపడి ఆగి మెల్లగా వెనక్కి తిరిగి చూడగానే సోనీ, డేవిడ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా సోనీ, డేవిడ్ పీకపట్టుకుని గాలిలోకి లేపింది. ఆ సంఘటన చూస్తున్న వర్ణ కళ్ళు పెద్దవి చేసి భయంతో నిలబడి చూస్తుంది. డేవిడ్ వీళ్ళకి దూరంగా వుండటంతో అభి తన చేతిలో వున్న బ్యాగ్ ని సోనీ మీదకి పెద్దగా అరుస్తూ విసిరేసాడు. సోనీ డేవిడ్ ని విడిచిపెట్టి అదృశ్యమైంది. డేవిడ్ నేల మీద పడి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. వర్ణ తన బ్యాగ్ లో ఉన్న మంచినీటి సీసాను డేవిడ్ కి ఇచ్చింది. డేవిడ్ మంచినీళ్ళు త్రాగి దెయ్యాలు లేవన్నావు కదరా ఇదేంటి అని అభిని అడిగాడు. అభి దగ్గర నుండి జవాబు లేదు. వెనక్కి వెళ్ళాలంటే ఆ అడవిలో వాళ్ళకు దిక్కులు తెలియట్లేదు. నడుస్తూనే వున్నారు. కొంతదూరం వెళ్ళాక అక్కడ కొన్ని చెట్లు పడిపోయి వున్నాయి. పడిన చెట్ల క్రింద ఎముకల గూడులు ఉన్నాయి. నడిచే దారిలో మట్టిలో కప్పడిపోయిన ఎముకులూ, పుర్రెలూ, కొంచెం భయటకు కనపడుతున్నాయి. వాళ్ళ గుండె వేగం పెరిగిపోతుంది. శరీరంపై నీళ్ళు పోసినట్టు చెమటలు పడుతున్నాయి. అక్కడ గాలి శబ్దం కూడా వినపడట్లేదు. అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దం ఇంకా భయంకరంగా ఉందని డేవిడ్ అన్నాడు. వర్ణ చూడకుండా ఒక పుర్రెపై కాలు వేసింది.పుర్రెతో పాటు కాలు కూడా మట్టిలో దిగిపోయింది. వర్ణ ఎంత ప్రయత్నించినా కాలు భయటకు రావటం లేదు. డేవిడ్ ఆమె కాలిని భయటకు లాగడానికి ఎంత ప్రయత్నించినా కదలలేదు. వర్ణ బాధతో ఏడుస్తుంది. ఆమె కంటినుండి జారిన కన్నీటి చుక్క నేలపై పడగానే అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న అడవి ఒక్కసారిగా హోరు గాలితో, గబ్బిలాల అరుపులతో,నక్కల ఊళలతో, అడవి మొత్తం వణికిపోతుంది. డేవిడ్ తో పాటూ అభికూడా వర్ణ కాలిని మట్టిలో నుండి భయటకు లాగాడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రకృతి రోదిస్తున్నట్టుగా శబ్దాలు పెరిగిపోతున్నాయి. గట్టిగా ప్రయత్నించారు వెంటనే కాలు మట్టిలోనుండి భయటకు వచ్చింది. వెంటనే శబ్దాలన్నీ ఆగిపోయాయి. కాలు బెనకడంతో వర్ణ నడవలేకపోతుంది. అభి ఆమె చేతిని తన భుజంపై వేసుకుని నడిపిస్తున్నాడు. డేవిడ్ ముందు నడుస్తున్నాడు. అభి,వర్ణ ఇద్దరూ వెనుక నడుస్తున్నారు. వాళ్ళ వెనుకనుండి వేగంగా వచ్చిన గాలి వాళ్లని తోయడంతో వాళ్ళు ముందుకు పడ్డారు. గాలి వెంటనే ఆగిపోయింది.ఆమె కాలు బెనుకు పోయి మామూలుగా నడుస్తుంది. కొంత దూరం అడవిలో ప్రయాణించాక ఒక చెట్టు క్రింద కుర్చున్నారు. అస్సలేం జరుగుతుందిరా ఇక్కడా. మనం వచ్చిన దారి కనపడదేంటి. మనుషులు చేసే పనులేనా ఇవన్నీ. మనం కూడా ఈ అడవిలో సమాధి కావలసిందేనా. మాట్లాడవేంటిరా అని డేవిడ్ అడిగాడు. ఎదురుగా అడవిలోనుంచి ఏదో వీళ్ళవైపు వస్తున్నట్టుగా శబ్దం వస్తుంది. ఒక్కసారిగా పొదలు లోనుంచి ఓ పెద్దపులి వర్ణపై దూకబోయింది. ఇంతలో డేవిడ్ అడ్డుపడ్డాడు. పెద్దపులి డేవిడ్ వైపు తిరిగేలా కర్ర తీసుకుని పులిని బెదిరించాడు. పులి డేవిడ్ వైపు తిరగగానె వర్ణని పారిపోమన్నాడు. అప్పటికే అభి అక్కడ నుండి వేరే వైపుకి పారిపోయాడు. వర్ణ కోట దారి వైపు పరుగెడుతుంది. డేవిడ్ చేతిలో వున్న కర్రతో రెచ్చకోడుతూ పులిని దూరంగా తీసుకుని వెళ్లాడు. కాని ఆఖరికి పులి చేతిలో మరణించాడు. వర్ణ ముందుకు పరుగెడుతూనే ఉంది. పరుగెడుతూ ముందుకు పడింది. పెద్దపులి వర్ణని వెంబడిస్తూ వర్ణ దగ్గరకి వచ్చేసింది. క్రింద పడి ఉన్న వర్ణ దగ్గరకి వెళ్ళి గట్టిగా గాండ్రించింది. పులికి అంటుకున్న రక్తపు మరకలు చూసి డేవిడ్ మరణించాడని బాధతో ఆమె గుండె నిండిపోయింది. ఇంకా తనకి కూడా మరణం తప్పదని భావించింది. ఇంతలో చెట్లమీద వున్న ప్రేతాలన్నీ చెట్లని ఊపుతూ అల్లరి చేస్తున్నాయి. కోటలోకి వెళ్ళడానికి ఇంకా చాలా ధూరం ఉంది. చెట్లు తెరలు తీసినట్టుగా ఒంగాయి. ఆ ఒంగిన చెట్ల మధ్యనుండి ధూరంగా కోట కనపడుతుంది. పెద్దపులి ఆ కోటవైపు చూసింది. ఆ కోట దగ్గర నుండి గట్టిగా గర్జించినట్లు శబ్దం రావడంతో పెద్దపులి వర్ణను విడిచిపెట్టి పారిపోయింది. Quote
Silveradotwo Posted August 1, 2020 Author Report Posted August 1, 2020 చెట్లు మామూలుగా వచ్చేసాయి. ఆమె క్రింద పడటంతో ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో స్నేహితుల మరణానికి బాధపడుతూ . అభి అని గట్టిగా అరుస్తూ అభి కోసం వెతుకుతుంది. అభి జాడ తెలియలేదు. వెతికీ వెతికీ అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చుని జారపడింది. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అడవి మొత్తం నిద్రపోతున్నట్టు నిశ్శబ్దంగా ఉంది. చెట్లపైన ప్రేతాలన్నీ నిశ్శబ్దంగా జరగబోయేది చూస్తున్నాయి. వర్ణ కూర్చున్న చెట్టు కొమ్మ విరిగి మీద పడటానికి సిద్దంగా ఉంది. ఆమెకు ఎదురుగా 8 అడుగుల వెడల్పు ఉన్న ఓ పాము ఆమె ముందు పడగ విప్పి నిలబడింది. ఆమె గుండె వేగం పెరిగింది. కాళ్ళు, చేతులు వనుకుతున్నాయి. భయంతో ఆమె కంటి నుండి నీరు ధారలా జారుతుంది. కోటవైపు నుంచి హోరు గాలి శబ్దం చేసుకుంటూ వర్ణ వైపు వస్తుంది. ఆ శబ్దానికి ఆమె చెవులు గట్టిగా మూసుకుని భయంతో గట్టిగా అరుస్తుంది. ఆ గాలి అడవిలోని చెట్లను పడగొట్టుకుంటూ వచ్చేస్తుంది. ప్రేతాలన్ని భయంతో చెల్లాచెదురై అన్నీ కోట దగ్గరకి పారిపోయాయి. ఆ గాలికి విరిగిన కొమ్మ పాము మీద పడి పాము మరణించింది. వర్ణ కూర్చున్న చెట్టు తప్ప చుట్టూ వున్న చాలా చెట్లు పడిపోయాయి. వర్ణ భయాన్ని వదిలేసుకుని బాధతో దేవుడా! అందర్నీ దూరం చేసి నన్ను మాత్రం ఎందుకు కాపాడుతున్నావ్ అని అరుస్తూ ఏడుస్తుంది. వెంటనే తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని వెనక్కి బయల్దేరింది. ఆమె ఎంతదూరం తిరిగినా వచ్చిన దారి కనపడట్లేదు. తిరిగీ తిరిగీ అలసిపోయి బాధ పడుతుండగా. ఆమెకు ఆకాశంలోనుండి కొన్ని మాటలు వినిపించాయి. ఈ సమస్యకి పరిష్కారం ఆ కోటలోకి నువ్వు వెళ్ళడం. ఆ కోటలో నువ్వు అడుగుపెడితేనే ఈ అడవికి విముక్తి, ఇక్కడ ఉన్న ఎన్నో ప్రేతాలకు విడుదల అని ఆకాశవాని పలికింది. వర్ణకు ఏం అర్ధం కావట్లేదు. ఆకాశవాని పలకడం అశ్చర్యంగా అనిపించింది. ఆమెకు ఆ కోటలోకి వెళ్ళటం తప్ప వేరే మార్గం కనపడలేదు. అడవిలో చీకటి పడింది. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలతో కలిసి ప్రశాంతంగా వున్నాడు. వర్ణ కోట కనపడేంత దగ్గరగా వచ్చింది. దూరంగా చెట్లమధ్య ఇరుక్కుపోయి ఉన్న విమానాన్ని చూసింది. కాని ఆమె పట్టించుకోలేదు. కోటవైపే అడుగులు వేసింది. కోట మొత్తం పొగమంచు అలుముకున్నట్టు ప్రేతాలతో నిండిపోయింది. ప్రేతాలన్నీ ఆనందంగా విడుదలకోసం ఎదురు చూస్తున్నాయి. వర్ణ వరుణాపురంలో అడుగుపెట్టింది. ఆ ఊరు మొత్తం శ్మశానంలాగా ఉంది. అడుగు అడుగునా ఆయుధాలూ, పుర్రెలూ, ఎముకలూ, విరిగిపోయిన చెట్లు, కూలిపోయిన ఇల్లు. అవన్నీ చూసిన ఆమెకు ఇది ఊరా లేక శ్మసానమా అని అనుమానం వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ముందుకు నడిచింది. అక్కడ కూలిపోయి వున్న ఒక ఇల్లును చూసి ఆగింది. ఆ ఇల్లుని చూస్తుంటే ఆమెకు ఏదో జ్ఞాపకం వస్తుంది. ఇంతలో వెనుకనుండి ఎవరిదో ఊపిరి ఆమె చెవులకు తగులుతుంది. ఆమెకు చెమటలు పడుతున్నాయి. వెనక్కి తిరిగి చూడటానికి ధైర్యం లేక వేగంగా ముందుకు పరుగెట్టింది. కోట గోడ ధ్వారం దగ్గరకు వెళ్ళగానే వెనక్కి తిరిగి చూసింది. దూరంగా పొగలా ఒక మనిషి ఆకారం కనపడింది. Quote
IdleBrain Posted August 1, 2020 Report Posted August 1, 2020 9 minutes ago, Silveradotwo said: 😁😁😁😁😁😁😁 Bro nen eymantundi nee ghost story ni,nothing serious. Andarni stories adgadam naa hobby ok... nee story break lo ad laga oka chinnest scary deyyam istory .. in peddest font... I can’t move, breathe, speak or hear and it’s so dark all the time. If I knew it would be this lonely, I would have been cremated instead. --The END--- Quote
Silveradotwo Posted August 1, 2020 Author Report Posted August 1, 2020 కోటగోడ ధ్వారం బద్ధలయి ఉంది. వెనుక వైపు గోడ పూర్తిగా పడిపోయి ఉంది. వర్ణ కోట ధ్వారంలో అడుగు పెట్టగానే కోటలోనుంచి రాణా అనే పిలుపు ఆమె చెవిలో ప్రతిద్వనిస్తుంది. చంద్రుడి చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నాయి. కోటలోని గబ్బిలాలు ఆకాశంలోకి ఎగిరి అరుస్తూ తిరుగుతున్నాయి. కోటమొత్తం చీకటి అలుముకుంది. ప్రకృతి భయంకరంగా మారింది. ప్రేతాలు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. కోట నిండా అస్తిపంజరాలు వేలాడుతున్నాయి. గుట్టలు గుట్టలుగా పడి వున్న అస్తిపంజరాలు మరో కోటను తలపిస్తున్నాయి. అంతచీకటిలోనూ అస్తిపంజరాలు తెల్లగా మెరిసిపోతూ వెలుగునిస్తున్నాయి. ఆ కోటను చూడగానే ఆమెకు ఏదో జ్ఞాపకం వస్తుంది. కాని స్పష్టంగా తెలియడం లేదు. ఆ ఎముకుల వెలుగులో కోట గుమ్మం దగ్గరకు అడుగులు వేసింది. వెళ్ళి కోట తలుపుపై చెయ్యి వేయగానే ఆమెకు పూర్వజన్మ మొత్తం జ్ఞాపకం వచ్చింది. **************** 300 ఏళ్ళ క్రితం వరుణాపుర సంస్థానం పచ్చని చెట్లతో ఊరినిండా జనంతో, 10000 మంది సైన్యంతో, సింహ, హ్రస్వ, బలు, బలాలతో,కలకలలాడుతూ, ఉండేది. ఆ సంస్థానంలోని ప్రజలు శివుడిని పూజించేవారు. ఈ సంస్థానానికి రాజు జనసురుడు. వీడు అసురజాతిలో పుట్టిన ఆకరివాడు. ఒంటరిగా ఓ దేశసైన్యాన్ని ఎదిరించగల సమర్ధుడు. వీళ్ళ చేతిలో ఓడిపోయిన రాజ్యాలు నరకాన్ని చూస్తున్నాయి. లోకాన్ని శాసించడమే జనసురుడి లక్ష్యం. ఆ లక్ష్యానికి ఓ వీరుడు తోడయ్యాడు. ***************** వరుణాపురం ఉత్తర దిక్కున ఆ ఊరి శ్మశానం ఉంది. ఒక గ్రహణం నాడు అర్థరాత్రి ఆ శ్మశానం నుండి చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. అటుగా వెళ్ళే వారి ఎవ్వరికీ ఆ శ్మశానంలోకి వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు. అటుగా వెళ్ళే వాళ్ళు వెళ్ళి కాటికాపరిని తీసుకొచ్చారు. కాటి కాపరి శ్మశానంలోకి వెళ్ళి మొత్తం వెతికాడు. ఏడుపు వినిపిస్తుంది కాని ఎవ్వరూ కనపడటం లేదు. ఆ ఏడుపు ఓ సమాధి నుండి వస్తుంది. ఆ సమాధిని తవ్వటానికి కాటి కాపరికి ధైర్యం సరిపోలేదు. కొద్దిసేపటికి ఏడుపు ఇంకా ఎక్కువయింది. కాటి కాపరి ధైర్యం చేసుకుని ఆ సమాధిని తవ్వాడు. ఆ సమాధిలో ఓ పెట్టె ఉంది. ఆ పెట్టెలోనుంచే ఏడుపు వస్తుంది. ఆ పెట్టెకు మేకులు కొట్టి వున్నాయి. వాటిని తియ్యడానికి రాయతో కొడుతున్నాడు. ఆ మేకులు మొత్తంతీసి పెట్టె తెరవగానే. అందులో ఓ పసిపిల్లవాడు వున్నాడు. ప్రక్కనే ఓ సర్పం కాపలా ఉంది. పెట్టె తెరవగానే ఆ సర్పం వెళ్ళిపోయింది. పెట్టెలోనుండి పిల్లవాడిని భయటకు తీయగానే ఆకాశంలో గ్రహణం వీడి సంపూర్ణ చంద్రోదయం అయింది. ఆ పిల్ల వాడిని ఊరిలోకి తీసుకుని వెళ్ళి జరిగినదంతా ఊరి జనానికి చెప్పాడు. అందరూ అశ్చర్యానికి లోనయ్యరు.శ్మశానంలో దొరికిన పిల్లాడిని ఊరిలోకి తీసుకు రావడం కీడుగా భావించిన ఊరు జనం ఆ పిల్లాడిని ఆ ఊరిలో ఉన్న పురోహితుల దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆ పురోహితులు దివ్యదృష్టితో ఈ పిల్లవాడు శివుని అంశతో పుట్టిన కారణజన్ముడు, ఇతను నూరేళ్ళు బ్రతుకుతాడని చెప్పారు. శివుని అంశతో పుట్టాడని అతని పేరు "రుద్ర రాణ" అని పెట్టారు. చిన్న వయస్సులోనే శిక్షణ లేకుండానే అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. 15 ఏళ్ళకే సైన్యంలో చేరాడు. ఎవ్వరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడు. రాణాకి 20 ఏళ్ళ వయస్సున్నప్పుడు ఆ ఊరిలో నడుస్తూ ఉండగా. ఒక ఇంట్లో గొడవ జరుగుతుంది. 15 ఏళ్ళు నిండని ఒక అమ్మాయి తల్లీ, తండ్రి మరణించడంతో బందువులు ఆమె ఆస్తిని లాక్కుని ఆమెను భయటకు గెంటేసారు. ఆమె పేరు "వర్ణ". ఊరి జనం చూస్తున్నారే తప్ప ఎవరూ నోరు మెదపటం లేదు. ఆమె ఏడ్చుకుంటూ చిన్న చిన్న చిరుగులు వున్న బట్టలతో ఊరిలో నడుస్తూ వెళ్తుంది. జనాలు ఆమెను పీక్కుతింటానికి చూసే రాబందులలాగా ఆమెను చూస్తూ ఆమెను ఏడిపిస్తున్నారు. అది చూసిన రాణా కోపంతో వాళ్ళ వైపు వేగంగా వెళ్లాడు. భారీ శరీరంతో వేగంగా వస్తున్న రాణాని చూసి వాళ్ళు పారిపోయారు. రాణా ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళి తనతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోమన్నాడు. భయటకు వెళ్ళి బందువులను నమ్మలేను, రాబందుల మధ్య బ్రతకలేను అని ఆమె మనస్సుకు అనిపించి రాణాతో ఉండటానికి ఒప్పుకుంది. రాణా ఆమెకు కొత్తబట్టలు తెచ్చి ఇచ్చాడు. ఆమె చదువుకుంటూ రాణా ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉంటుంది. రాణా 25 ఏళ్ళకే సైన్యాధిపతి అయ్యాడు. మహా వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు.రాణా పేరు చెప్పగానే ఉలిక్కిపడే రాజ్యాలెన్నో ఉన్నాయి.5 ఏళ్ళలో తూర్పు, పడమర దిక్కులలో వున్న అన్ని రాజ్యాలనూ ఓడించి చరిత్ర సృష్టించాడు. జనసురుడూ, రాణా కలిసి యుద్దం చేసిన రాజ్యాలు నమూనాలు లేకుండా పోయాయి. వీళ్లిద్దరి ఆశయం ఒక్కటే అన్ని రాజ్యాలూ వరుణాపురానికి బానిసలవ్వాలి. ఎంత చేసినా జనసురుడికి రాణా అంటే చులకన. ఇప్పుడు వర్ణకి 25 ఏళ్ళు. ఊరిలో జనాలు వీళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు రాణాకి నచ్చలేదు. వర్ణ అంటే రాణా కి ఇష్టం ఉన్నా ఆమె మనస్సులో ఏముందో తెలియక ఆమెకు పెళ్ళి చెయ్యడానికి చూస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వర్ణ తనపై రాణాకి జాలి తప్ప ప్రేమ లేదని తనలో తాను బాధపడుతుంది. ఆమెను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. సైన్యంలో పనిచేసే ఒకతను ఆమెను పెళ్ళి చేసుకూంటానని రాణా ఇంటికి వచ్చాడు. ఆమె పెళ్ళికి ఒప్పుకుంటుందేమో అని రాణా గుండె మొత్తం బాధతో నిండిపోయింది. వర్ణ ఇంకా ఆమె గుండెల్లో వున్న ప్రేమని, బాధని ఆపుకోలేక ఏడ్చుకుంటూ రాణా గుండెల్ని హత్తుకుపోయింది. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు నేను ఏదో పని చేసుకుంటూ నీతోనే ఉండిపోతాను అని రాణా గుండెల్ని హత్తుకుని ఏడుస్తుంది. ఆమె ఆ మాట అనగానే రాణా కంటి నుండి ఆనందభాష్పాలు జారాయి. రాణా ఆమె నుధుటపై ముద్దుపెట్టి గట్టిగా హత్తుకున్నాడు. ఆ తరువాత అడవి మొధలలో వున్న కోవెలలో పెళ్ళి చేసుకుని ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. అయినా ఊరి జనం వర్ణ గురించి తప్పుగానే మాట్లాడుకుంటున్నారు. ఒక రోజు రాజు ఊరిలో జనానికీ, సైన్యానికి విందు ఏర్పాటు చేసి అందర్నీ ఆహ్వానించాడు. రాణా భార్యతో కలిసి విందుకి వెళ్లాడు. రాణా వర్ణలు కలిసి రావడం జనసురుడు చూసాడు. వీడికి ఇంత అందమైన పెళ్ళాం ఎందుకు. దీన్ని ఎలాఅయినా సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో రాణాని పిలిపించి వేరే దేశపు రాజులు వస్తున్నారు వెళ్ళి దగ్గరుండి తీసుకురా అని పంపించాడు. రాణా వెంటనే బయల్దేరాడు. రాణా వెళ్ళగానే రాజు వర్ణ దగ్గరకు వెళ్ళి ఆమెను క్రింద నుండి పై వరకూ చూస్తున్నాడు. దివి నుండి భువిపైకి దిగివచ్చిన అప్సరసలా వున్నావ్. ఆ పనోడు నిన్నేం సుఖపెడతాడు. ఈ వెన్నెల రాత్రిని నా పాన్పుపై నాతో పంచుకో సుఖపెడతా అని అన్నాడు. ఆమాట వినగానే వర్ణ రాజు చెంపమీద కొట్టింది. జనాలు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఒక్కసారిగా రాజభటులు కత్తులతో వర్ణ మీదకి వచ్చారు. వర్ణ రాణా కోసం అటు ఇటూ చూస్తుంది. రాజు భటులను ఆపి నవ్వుతూ ఎంటే వెతుకుతున్నావ్ నీ మొగుడు కోసమా?వాడు లేడు.ఇంకా రాడు అడవిలో మృత్యువు వాడికోసం ఎదురుచూస్తుంది. అని ఒక్కసారిగా! నన్నే కొడతావా.... నన్ను కొట్టి నాలో రాక్షసుడ్ని నిద్రలేపావ్. నీతో వెన్నెల రాత్రి పంచుకోవడం కాదే నీ శరీరాన్ని రాబందులతో ఎంగిలి చేయిస్తా. అని అరుచుకుంటూ ఆమె చీర కొంగును పట్టుకుని జనాలలోకి ఈడ్చుకుని వెళ్తున్నాడు. వర్ణకి చెప్పి వెళ్ళడానికి వెనక్కి వచ్చిన రాణా ఆమెను ఈడ్చుకెల్లడం చూడగానే కోపంతో ఒక్కసారిగా గాయపడిన సింహం వేటగాడిమీదకి వస్తున్నట్టుగా రాణా రాజు దగ్గరకు వస్తున్నాడు. ఇంతలో పదిమంది సైనికులు జంతువులను పట్టే వలలతో రాణాని పట్టి పెద్ద పెద్ద గొలుసులు కలిపి కోట స్థంభాలకు కట్టేసారు. విందు కోసం వచ్చిన జనం రాజు చేసే అక్రుత్యానికి అడ్డుచెప్పకుండా తర్వాత ఏం జరగబోతుందా అని వేచి చూస్తున్నారు. రాణా గొలుసులని గట్టిగా లాగుతూ అరుస్తూ గింజుకుంటున్నాడు. నీ పెళ్ళాన్ని రాత్రిని పంచుకుంటావా అంటేనే నా చెంప మీద కొట్టింది. అదేమన్నా పతివ్రతా. ఇక్కడున్న జన సందోహానికి దీని శరీరాన్ని విందుగా ఇస్తా అని అరచి గట్టిగా నవ్వుతూ ఆమె చీరను పూర్తిగా లాగేసాడు. రాణా కోపంతో ఊగిపోతున్నాడు. రాజా! నా గురించి నీకు తెలిసి నాతో వైరం నీకూ, నీ సంస్థానానికీ, నీ ప్రజలకు మంచిది కాదు. ఇక్కడతో వదిలై అని రాణా హెచ్చరించాడు. రాజు నవ్వుతూ! నిన్ను కట్టిన గొలుసులు తెగాలంటే పది మదగజాలు కావాలి. ఆ కోట స్థంభం విరగాలంటే దేవుడు దిగి రావాలి. నువ్వు నన్నేం చేస్తావురా అని నవ్వాడు. వర్ణ కంటినిండా నీరుతో నేల పై పడి ఉంది. రాణా కోపంతో గింజుకుంటున్నాడు. కోట పడిపోతుందేమో అన్నట్టు అదురుతుంది. రాజు ఆమెను వివస్త్రని చేసాడు. ఆమె అవమానంతో రాజసింహాసనం వెనుకకు వెళ్ళి దాకుంది. రాణా కనులను కన్నీటి వరద ముంచేసింది. రాజు జనాలని ఒకరి తరువాత ఒకరిగా ఆమె దగ్గరకు పంపిస్తున్నాడు. ఆమె శరీరం నుండి రక్తం రాజ సింహాసనం క్రింద నుండి మెట్ల మీదగా జారుతుంది. ఇదంతా చూస్తూ రాజు పైసాచికానందం పొందుతున్నాడు. ఆమె ఆర్తనాదాలు కోట మొత్తం ప్రతిధ్వనిస్తున్నాయి. రాణా అరుస్తూ గొలుసులు తెంపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్న చిన్నగా కోట స్తంభాలు బీటలు తీస్తున్నాయి. జరగబోయే మారణకాండని ముందుగా పసిగట్టిన ప్రకృతి బీకరంగా మారింది. పక్షులు గూళ్ళ నుంచి ఎగిరిపోతున్నాయి. జంతువులు పారిపోతున్నాయి. కోట చెరలలో వున్న జంతువులు పారిపోవడానికి చెరలను బద్ధలు కొడుతున్నాయి. కొద్ధి సేపటికి రాణా అరుస్తూ బలవంతంగా కోట స్తంబాలను బద్ధల కొట్టాడు. అప్పటికే వర్ణ రాణా.... అని అరిచి తుది శ్వాశ విడిచిపెట్టింది. వర్ణ కోట గుమ్మంమీద చెయ్యి వేయగానే ఆమెకు పూర్వజన్మ మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారిగా ఆమె కళ్ళను కన్నీరు కమ్మేసింది. గుండె నిండా బాధ నిండిపోయింది. ప్రకృతి అంతా నిశ్శబ్దంగా వుంది. చంద్రుడు కారు మబ్బుల్లో దాక్కున్నాడు. ఆమె బరువెక్కిన గుండెతో గుమ్మం తలుపు తోసింది. కోటలో మొత్తం చీకటిగా ఉంది. అంత చీకటిలోనూ వెలుగుతున్న సూర్యుడిలా రాణా ఆమెకు కనిపించాడు. రాణాని చూడగానే ఆమె కళ్ళలో ఆనందం గుండెల్లో ప్రేమతో ఒక్కసారిగా రాణాని కౌగిలించుకోబోయింది. ఆమెకు రాణాని పట్టుకోవడం కుదరలేదు. రాణాకి శరీరం లేదు కేవలం ఆత్మ మాత్రమే ఆ కోటలో ఉంది. ఆమెకు రాణా కనపడ్డాడని ఆనందపడాలో కేవలం అత్మే అని బాధపడాలో తెలియక రాణా కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. రాణా ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. ఒక్కసారిగా కోటలో వెలుగు అలుముకుంది. అమె కళ్ళలోకి చూస్తూ కొన్నేళ్ళుగా నేను నీ కోసం,నీ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నా. అని చెప్పిన రాణా కనుల నుండి నీరు ముత్యపు బొట్లు లాగా నేలకు రాలుతున్నాయి. ఈ ఊరు శ్మశానంలా మారడానికి కారణమేమిటని ఆమె అడిగింది. *********************** ఆమె కంఠంలో నుంచి వచ్చిన ఆఖరి మాటకు రాణా గుండెను బాధ బద్ధలుకొట్టేస్తుంది. శరీరం బిగుసుకుంది. గట్టిగా అరుస్తూ బలంగా గొలుసులను లాగాడు. కోట స్తంభాలు పెలపెల ధ్వనులతో విరిగిపోయాయి. జనాలు భయంతో పరుగులు తీసారు. బద్దలయిన రెండు కోట స్తంభాలు గొలుసులతో రాణా చేతికి కట్టేసి వున్నాయి. రాణా తన చేతికి కట్టి వున్న స్తంభాలను విసిరేసాడు. ఆ స్తంభాలు అడ్డువచ్చిన వాళ్ళని గుద్ధుకుంటూ ఒక స్తంభం కోట ద్వారాన్ని గుద్దుకుని ద్వారం ముక్కలముక్కలై పోయింది. జనసురుడి సైన్యం మొత్తం ఆయుధాలతో రాణాని చుట్టుముట్టారు. తుఫానులో ఎగసిపడే కెరటంలా రాణా సైన్యంపై విరుచుకుపడ్డాడు. భాణాలను ,బళ్ళేలనూ,కత్తులనూ, అడ్డుకుంటూ, రాణా కత్తి తిప్పుతూ యుద్ధం చేస్తున్నాడు. రాణా కత్తి వేగానికి సైనికుల శవాలు గాలిలో తేలుతున్నాయి. రాణా యుద్ద నైపున్యం చూసి సూర్యుడుసైతం మబ్బుల్లో దాకున్నాడు. రాణా గురించి తెలిసిన సైనికులు రాణాని ఎదిరించే సాహసం చేయలేక కోట చెరలలో వున్న కృర మృగాలను తీసుకొచ్చి రాణా మీదకి వదిలారు. అవి రాణా మీదకి రాకపోగా జనాల మీదకు వెళ్ళి జనాలను చంపుతున్నాయి. సైనికులకు రాణాని అడ్డుకోవాలో లేక జంతువులని అడ్డుకోవాలో తెలియట్లేదు.రాణా అలుపులేకుండా అడ్డువచ్చిన వళ్ళను సంహరిస్తూనే వున్నాడు. మృగాల మధ్య మృగంలా కనిపిస్తున్నాడు. కొంతమంది సైనికులు కోట వెనుక గోడపైకి ఎక్కి బాణాలను రాణా మీదకి వదిలారు. కొన్ని బాణాలు రాణాకి గుచ్చుకుని నేలకొరిగాడు. రాణాని సైనికులు చుట్టుముట్టారు. రాజు కోటపై నుంచుని విజయం వరించిందని ఆనందిస్తున్నాడు. రాణాని చుట్టుముట్టిన సైనికులు నరకడానికి కత్తులు ఎత్తారు. ఒక్కసారిగా రాణాకి వర్ణ పిలిచినట్టు అనిపించి కళ్ళు తెరిచి చేతిలో వున్న కత్తితో వాయువేగంతో చుట్టూ వున్న సైనికుల కాళ్ళను నరికేసాడు. రాణా మీదకి వస్తున్న సైనికుల తలలు ఎగిరిపడుతున్నాయి. వేగంగా అడ్డువచ్చిన సైన్యాన్ని నరుకుతూ వెనుక కోట గోడ వైపు పరిగెడుతున్నాడు. ఒంటినిండా రక్తంతో ప్రళయకాళ రుద్రుడులా వేగంగా అడ్డువచ్చిన సైన్యాన్ని నరుక్కుంటూ పోతున్నాడు. రాణా వేగానికి సైనికుల తలలు కోటపై కొన్ని కోట గోడ అవతల కొన్నీ పడుతున్నాయి. ఎదురొచ్చిన సైన్యాన్ని సంహరిస్తూ బాణాలను అడ్డుకుంటూ రాణా కోట వెనుక గోడ వైపు పరుగెడుతూ బలంగా ఆ గోడను తన్నాడు. గోడపైన వున్న సైనికులు క్రింద పడుతుండగా గాల్లోనే వాళ్ళ తలలను నరికేసాడు. ఆ గోడ! వెనుక వున్న అడవిలోకి పడిపోయింది. సైన్యం మొత్తం కోట గోడ లోనికి వచ్చింది. రాణా ఆ సైన్యానికి మధ్యలో శవాల గుట్టపై నిలబడి వున్నాడు. రాణా రక్తంతో తడసిపోయి వున్నాడు. నేల మొత్తం రక్తపు మడుగైపోయింది. ఇప్పటికే సగం సైన్యం శవాలుగా పడి వున్నారు. కోట నిండా శవాలు వేలాడుతున్నాయి. ఎక్కడ చూసినా అవయవాలు తెగిపడి వున్నాయి. కృరమృగాలు ఊరిలోకి వెళ్ళి అందరినీ చంపసాగాయి. గజాలు ఇల్లు ధ్వంసం చేస్తున్నాయి. రాణా సైన్యాన్ని చీల్చి చెండాడుతుంటే సైనికులు భయంతో పరుగులు తీస్తున్నారు. కొందరు కోట వెనుక వున్న అడవిలోకి వెళ్ళి కృరమృగాల చేతిలో బలైపోతున్నారు. సైన్యం సంఖ్య అంతకాంతకూ తగ్గిపోతుంది. రాణాకి నరికేకోద్దీ కోపం పెరిగిపోతూంది. పగలూ, రాత్రీ తేడాలేకుండా మారణహోమం చేస్తూనే వున్నాడు.నరకడం మొదలుపెట్టి రెండు రోజులయింది. కోట మొత్తం రక్తంతో తడిసిపోయింది. సూర్యచంద్రులు మబ్బుల మధ్యనుండి భయటకు రావడం లేదు. ఎంత సైన్యం పోయినా రాజు అహంకారం మాత్రం చావట్లేదు. సైనికులు ఊరిలోకి పారిపోయారు. రాణా వాళ్లని తరుముకుంటూ ఊరిలోకి వెళ్లాడు. జనం రాణాపై తిరగపడ్డారు. ఆడది ఆపదలో ఉన్నప్పుడు కాపాడలేని జనం ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కాటే అని కనపడిన జనాన్ని కూడా నరకడం మొదలు పెట్టాడు. ఆకాశం మొత్తం ఎరుపు వర్ణం పులుముకుంది. కొందరు జనాలు సైనికులతో కలిసి అడవిలోకి పారిపోయారు. రాణా వాళ్ళకోసం అడవిలోకి వెళ్ళి కనపడిన వాడిని నరుకుతూ పోతున్నాడు. ఎన్ని శబ్దాలు వచ్చినా రాణాకి వర్ణ ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. సైనికులు పూర్తిగా మరణించారు. జనం చెట్లపైన దాకున్నారు. రాణా వాళ్ళ మీదకి బళ్ళేలు విసిరేసాడు. కొందరు అవి గుచ్చుకుని చెట్లకు వేలాడుతున్నారు. కొందరు క్రిందపడి మరణించారు. పారిపోతున్న జనంపై రాణా పడిఉన్న చెట్లను విసిరేసాడు. అడవిలో నేల మొత్తం నెత్తుటి ఏరులా పారుతుంది. ఊరు వళ్ళకాటయింది.ఇంకా చంపడానికి ఎవరూ మిగలలేదు. రాణా వర్ణకోసం నెత్తుటేరులో శవాలపై నడుచుకుంటూ కోపంగా ఊరిలోనుంచి కోటవైపు వస్తుండగా కోటపైనుంచి జనసురుడు బళ్ళెం విసిరి వర్ణ అని గట్టిగా అరిచాడు. ఆ మాట విని రాణా ఆగి కోటవైపు చూసాడు. ఆ బళ్ళెం రాణా భుజంలో గుచ్చుకుంది. రాణా ఆ బళ్ళెం తీయకుండా ఒంటినిండా విరిగిన బాణాలతో కోటలోకి వెళ్ళి వర్ణకోసం వెతికాడు ఆమె కనపడకపోవడంతో. శవాల గుట్టల మీద నుండి కోటపైకి ఎక్కాడు. అక్కడ జనసురుడు నవ్వుతూ కూర్చున్నాడు. వర్ణ ఎక్కడా? అని రాణా గంభీరంగా అరిచాడు. వేశ్యలు వేశ్య గృహాల్లో ఉంటారు ఇక్కడ ఎందుకు ఉంటారు అని రాజు వికటాట్టహాసం చేసాడు. రాణా కోపంతో పిడుగులా రాజు పై విరుచుకుపడ్డాడు. వాళ్ళ ఇద్దరి మధ్య యుద్ధం రామ, రావణ యుద్దాన్ని తలపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం రెండు రోజులు సాగింది. ఇద్దరి శరీరాల నుండి నెత్తురు కారుతూనే ఉంది. రాణా భుజంలోని బళ్ళెం అలాగే ఉంది. సూర్య చంద్రులు ఎవ్వరు గెలుస్తారా అని మబ్బుల మాటు నుండి తొంగి చూస్తున్నారు. ఆఖరికి రాణా జనసురుడి రెండు చేతులూ నరికేసి వర్ణ ఎక్కడా అని అడిగాడు. జనసురుడు సమాధానం చెప్పకపోవడంతో శరీరం లోని అన్ని బాగాలు వేరు చేసాడు. ఇంకా జనసురుడి గుండె కొట్టుకుంటూనే ఉంది. వర్ణా!..... అని గట్టిగా అరుస్తూ రాణా ఏడుస్తున్నాడు. భుజంలో వున్న బళ్ళేన్ని తీసి దూరంగా విసిరేసాడు. రాణా ఆమె కోసం కోట మొత్తం రెండు రోజులు వెతికాడు ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆ తరువాత రాణా కోటలో మరణించాడు. అప్పుడు జనసురుడి గుండె కొట్టుకోవడం ఆగింది. అప్పటినుంచీ ఈ కోటలో నీకోసం వెతుకుతూనే ఉన్నా. అని రాణా చెప్పాడు. రాణా చెప్పడం పూర్తి కాగానే కోట భయట రాజు ఆత్మ ప్రకృతినే భయపెట్టేలా పెద్ద పెద్ద శబ్దాలతో ప్రేతాత్మలతో సుడిగాలి సృస్టించాడు. అప్పటిదాకా కోటభయట ఉన్న ఎముకులూ, పుర్రెలూ అన్నీ గాలికి అడవిలోకి వెళ్ళి పడ్డాయి. రాణా, వర్ణా ఇద్దరూ కోటలో నుండి అడుగు భయట పెట్టగానే ప్రేతాలన్నీ భయంతో ఆకాశంలోకి పారిపోయి అక్కడ నుండి చూస్తున్నాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. రాణా అడుగు భయటపెట్టగానే సముద్రంలోని అలలు గగణమంటేటట్టు రాణాని చూడటానికి ఎగసిపడుతున్నాయి. అడవిలోని చెట్లు ఒంగి మరీ రాణాని చూస్తున్నాయి. ఏం జరిగినా చంద్రుడు మబ్బుల నుండి భయటకు రావట్లేదు. వర్ణ రాణా వెనుక నిలబడి ఉంది. రాణా వచ్చావా! నువ్వు నీ ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నావ్ నేను నీ కోసం ఎదురుచూస్తున్నా. నీతో వైరం పెట్టుకున్నందుకు నా రాజ్యం ఉనికిని కోల్పోయింది. నా వంశం నాతోనే అంతం అయిపోయింది. కానీ దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు కానీ ఆ దేవుడే నాకు అడ్డు పడుతున్నాడు. నా ఆత్మ ఈ అడవిని దాటి వెళ్ళలేకపోతుంది. ఆ శివుడు నాకు అడ్డుపడుతున్నాడు. నీ చేతులతో ఆ లింగాన్ని పెకలించి సంద్రంలోకి విసిరెయ్ అప్పుడు నువ్వూ నేను ఈ లోకాన్ని, కాదు ఈ విశ్వాన్ని ఏలుకోవచ్చు అని జనసురుడు అన్నాడు. నీ ఆత్మకు శాంతి లభించే సమయం వచ్చింది. నీ ఆత్మకు శాంతి కలిగితేనే ఎన్నో ఆత్మలు కైలశానికి చేరుకుంటాయి. ఆ ఘడియలు వచ్చాయి అని రాణా మట్టిలో వున్న ఖడ్గాన్ని తీయబోయాడు కాని కుదరలేదు. నువ్వు నన్ను చంపాలన్నా నేను నిన్ను చంపాలన్నా మనకి శరీరం కావాలి అని రాజు నవ్వుతున్నాడు. ఇంతలో బద్దలయిన కోట గోడ ద్వారం నుండి అభి లోనికి ప్రవేసించాడు. వర్ణను చూసిన అభి చేతిలో వున్న బ్యాగ్ ని ప్రక్కన పడేసి వర్ణ వైపు పరుగెడుతున్నాడు. జనసురుడు అభి శరీరాన్ని ఆవహించాడు. వీడి శరీరాన్ని నీకిస్తా వీడి శరీరంలోకి నువ్వెల్లి ఆ శివలింగాన్ని పెకలించు ఆ తరువాత మనమే ఈ విశ్వానికి రాజులం. అని రాణాతో అన్నాడు. నీ విడుదలే ఈ దీవికి విముక్తి అని రాణా అన్నాడు. శరీరం లేని నువ్వు శరీరం వున్న నన్ను ఎలా చంపుతావో చూస్తా అని రాణావైపు నడుచుకుంటూ వెళ్ళి వర్ణ చేతిని పట్టుకుని ఈడ్చుకుని వెళ్తున్నాడు. రాణా ఏం చెయ్యలేకపోతున్నాడు. శరీరం లేని నువ్వు నన్నేం చేస్తావ్. దీనితో ఆ లింగాన్ని బద్దలకొట్టిస్తా. మహా పతివ్రత కదా దీన్ని ముట్టుకుంటేనే నా రాజ్యంలో జీవం లేకుండా పోయింది. అని ఆమెను ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఆమె రాణా.... అని అరుస్తూ గింజుకుంటుంది. గింజుకుంటూ ఆమె జనసురుడ్ని కొట్టింది. ఆమెను జుట్టు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఆడది నా మీద చెయ్యెస్తే నాలోని రాక్షసుడు భయటకు వాస్తాడు. నన్నే కొడతావా నీ అందాన్ని ఆరగించి నీ శరీరాన్ని ఈ పిశాచాలకి పిండంగా పెడతా అని అరుస్తూ అమె వేసుకున్న చొక్కాని చించబోతుండగా. రాణా ఏం చేయలేకపోతున్నాడు వెంటనే రాణా కి వెలుగులోనుంచి వచ్చిన మాటలు జ్ఞాపకం వచ్చి ఆకాశం వైపు చూస్తూ ఒక్కసారిగా "రుద్రా" అని గట్టిగా అరిచాడు. ఆ కేకకి చంద్రుడు ఉలిక్కిపడి మబ్బుల నుండి భయటకు వచ్చాడు. ఆకాశంలో మబ్బులు లేకుండా మెరుపులు వస్తున్నాయి. ఓ మెరుపు ఆకాశం నుండి భూమిపై పిడుగులా రాణా మీద పడింది. రాజు వర్ణని వదిలి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. రాణాకి శరీరం ఏర్పడింది. రాణా కోపంతో జనసురుడి వైపు వేగంగా వస్తున్నాడు. జనసురుడికి రాణాని చూడగానే క్షత్రియులపై 21సార్లు దండయాత్ర చేసిన పరశురాముడిలా కనపడుతున్నాడు. రాజు గుండెల్లో భయం మొదలయింది. భయం కనపడనీయకుండా ఒక్కసారిగా రాణాపై కత్తితో దాడి చేసాడు. ఇద్దరి మధ్య జరుగుతున్న కత్తి యుద్దానికి కత్తులు రెండూ తగలగానే మెరుపులతో అడవి మొత్తం వెలిగిపోతుంది. కత్తుల శబ్దానికి అడవి వణికిపోతుంది. అడవిలోని జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. ఈ యుద్దంలో ఎవ్వరు గెలుస్తారా అని చెట్లపై నుండి గబ్బిలాలూ, ఆకాశం నుండి ప్రేతాలూ కళ్ళు పెదవి చేసి చూస్తున్నాయి. జనసురుడి చేతిలోని కత్తి విరిగి దూరంగా పడింది. రాణా కత్తి వేటుకి రాజు తప్పించుకుని ప్రక్కనే వున్న మహా వృక్షాన్ని వేరులతో సహా పెకలించి రాణాపై విసిరాడు. రాణా తన చేతిలో వున్న ఖడ్గంతో చెట్టుని ముక్కలు ముక్కలు చేసాడు. రాజు ప్రక్కనే వున్న బళ్ళెంతో యూద్డానికి దిగాడు. హోరాహోరీగా సాగుతున్న ఈ యుద్దంలో ఎవ్వరికీ చిన్న గాయం కాలేదు. వర్ణ కళ్ళార్పకుండా చూస్తుంది. చాలాసేపు యుద్ధం జరిగాక రాణా కాలు మట్టిలో దిగిపడిపోయింది. రాజు ఇంకా తనకి విజయం వరించిందని భావించి అప్పుడు వర్ణ ఏదీ? అని నన్ను నరికి చంపావు కదరా దాని శవాన్ని నేనే తగలపెట్టా. ఇప్పుడు నిన్ను చంపి దీనితో ఆ లింగాన్ని బద్ధలకొట్టించి ఆ తరువాత నా పడక గదిలో చెలికత్తెగా పెట్టుకుంటా అని రాణాని చంపడానికి వస్తుండగా రాజు కాలు మట్టిలో దిగబడిపోయి రాణా మీద పడబోతుండగా రాణా తన చేతిలోని ఖడ్గంతో రాజ శిరస్సుని ఖండించాడు. రాణా కాలిని మట్టిలోనుండి భయటకు లాక్కున్నాడు. రాణాకి రాజు ఆత్మ కనిపించడంలేదు. వెనుక నుండి పెద్ద నవ్వు వినిపించింది. రాణా వెనుకకు తిరిగి చూసాడు. రాజు ఆత్మ వర్ణ శరీరాన్ని ఆవహించింది. అది చూడగానే రాణా చేతిలోని కత్తి నేలకు జారిపోయింది. ఇప్పుడు జనసురుడ్ని చంపాలంటే వర్ణని చంపాలి లేదా వాడు చెప్పినట్లు చేసి లోక వినాశనానికి తెర లేపాలి అనుకుని రాణా నిశ్శహాయంగా నేల కూలాడు. వర్ణ శరీరంలో వున్న రాజు రాణాని భలంగా తన్నాడు. ప్రకృతి బాధతో వర్షం రూపంలో కన్నీరు కారుస్తుంది. రాణా వెళ్ళి కొటగోడను బద్దలకొట్టుకుని అవతల పడ్డాడు. వర్ణ విరిగిపడి వున్న కోట స్తంభాన్ని బలంగా రాణామీదకి విసిరింది. ఆ స్థంభం రాణాకి తగలగానే ముక్కలముక్కలై పోయింది. రాణా ఒంటినిండా రక్తం కారుతుంది. మోకాళ్ళపై పడి ఆకాశాన్ని చూస్తూ ఏడుస్తున్నాడు. ఈ రాక్షసుడ్ని చంపేదెలా, వర్ణని కాపాడుకోవటం ఎలా అని ప్రశ్నించుకుంటున్నాడు. ఆ ప్రేతాన్ని ఆపే శక్తి కేవలం శివాయుధానికే ఉంది అని ఆకాశవాని పలికింది. రాణా ఆలోచిస్తున్నాడు. శివాయుధమంటే త్రిశూలం. త్రిశూలంతో పొడిస్తే వర్ణ మరణిస్తుందని రాణా బాధపడుతున్నాడు. కాని వాడి ఆత్మని వదిలేస్తే లోక వినాశణం జరుగుతుందని గుండె రాయి చేసుకుని వర్ణని చంపడానికి సిద్దపడ్డాడు. వర్ణ కొట్టిన దెబ్బలకు రాణా కళ్ళు మసకబారుతున్నాయి. రాణా నేలపై పడి వున్నాడు. రాణా చేతి దగ్గర అభి పడేసిన బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లోనుండి రాణా కి వెలుగు కనపడుతుంది. ఆలయంలో అభి ఫొటోలు తీస్తుండగా చిన్న త్రిశూలం వెలుగుతూ బంగారంలా మెరుస్తూ కనపడింది. స్నేహితులకు తెలియకుండా ఆ త్రిశూలాన్ని బ్యాగ్ లో వేసుకున్నాడు. రాణా బ్యాగ్ లో చెయ్యి పెట్టి వెలుగుతున్న త్రిశూలాన్ని భయటకు తీసాడు. వెంటనే రాణా శరీరానికి వున్న గాయాలన్నీ పోయాయి. వర్ణ శరీరంలో ఉన్న రాజు భయంతో ఇంకా మరణం తప్పదని భావించి విజయమో వీర స్వర్గమో అని కత్తితో రాణా మీదకి ఎగిరాడు. రాజు గాలిలో ఉండగానే రాణా చేతిలో వున్న త్రిశూలాన్ని రాజు మీదకి విసిరేసాడు. ఆ త్రిశూలం వర్ణ గుండెల్లో గుచ్చుకుంది. రాజు ఆత్మ వర్ణ శరీరాన్ని వదిలేసి పెద్ద పెద్ద శబ్దాలతో పిశాచాల కేకలతో కనుమరుగైంది. రాజు ఆత్మ లోకాన్ని విడిచిపెట్టగానే మిగిలిన ఆత్మలకు విడుదల వచ్చింది. అవికూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాయి. క్రింద పడుతున్న వర్ణను రెండు చేతులతో పట్టుకున్నాడు. వర్ణ గుండె ఆగిపోయింది. రాణా కనులను కన్నీటి పొర కప్పేసింది. ఆమె గుండెల్లో గుచ్చుకున్న త్రిశూలం వెలుగులా మారి ఆమె శరీరంలో కలిసిపోయింది. ఆమె గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె కొంతసేపటికి కళ్ళు తెరిచి బెదురుగా అటు ఇటూ చూస్తుంది. భయపడకు ఆ ఆత్మలు లోకాన్ని విడిచి వెళ్ళిపోయాయి అని చెప్పాడు.ఆమె ఆనందంతో రాణాని గట్టిగా హత్తుకుంది. ఆమె కంటి నుండి ఆనందభాష్పాలు నేలకు జారాయి. ఆ అడవి నిండా ప్రశాంతత అలుముకుంది. ఈ శరీరం నీకు ఎలా వచ్చింది నువ్వు దేవుడివా అని ఆమె అడిగింది. రాణా చిన్న చిరునవ్వు నవ్వాడు. నేను మరణించిన రోజు నా ముందు ఓ వెలుగు కనపడింది. ఆ వెలుగులోనుండి! నువ్వు కారణజన్ముడవు నీ ప్రేయసికోసం నువ్వు చేసిన మారణహోమంతో లోక కళ్యాణం జరిగింది. నూరేళ్ళ నీ జీవిత కాలాన్ని విదాత రెండు భాగాలుగా విభజించాడు. గడిచిన 30 ఏళ్ళు నీ జీవితంలోని మొదటి బాగం పూర్తయింది. రాబోయే 300ఏళ్ళ తరువాత లోకకల్యానంతో నీ మిగిలిన జీవితం మొధలవుతుంది. అప్పటివరకూ నీ శరీరాన్ని బద్రపరచాలి అని నా శరీరాన్ని తీసుకుని ఆ వెలుగు మాయమైంది. ఆ మాటలు విన్న వర్ణ ఆనందానికి అవదులు లేవు. రాణామీద పడి ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఇదంతా చూస్తున్న చంద్రుడు సిగ్గుతో మబ్బుల్లోకి దూరాడు. నువ్వు దేవుడివి కదా! నా ఫ్రెండ్స్ ని బ్రతికిస్తావా అని వర్ణ అమాయకంగా అడిగింది. లోకకల్యాణం కోసం ఎందరో వీరులు ప్రాణాలర్పించారు మీ స్నేహితులు తెలిసో తెలియకో నీకోసం ప్రాణాలర్పించిన వారే. వాళ్ళు తిరిగి రారు. నేను దేవుడ్ని కాదు లోకరక్షకుడ్ని. ***************శుభం*************** అక్షర ధోషములు ఉంటే క్షమించగలరు. 2 Quote
Silveradotwo Posted August 1, 2020 Author Report Posted August 1, 2020 1 minute ago, IdleBrain said: ok... nee story break lo ad laga oka chinnest scary deyyam istory .. in peddest font... I can’t move, breathe, speak or hear and it’s so dark all the time. If I knew it would be this lonely, I would have been cremated instead. --The END--- Good story deserves oscar👌👌 Quote
Silveradotwo Posted August 1, 2020 Author Report Posted August 1, 2020 @LadiesTailor kaka selavu tiskuntaa.. Quote
DaatarBabu Posted August 2, 2020 Report Posted August 2, 2020 Magadheera story Rgv gaadu teeste itne teestadu 1 Quote
IdleBrain Posted August 2, 2020 Report Posted August 2, 2020 1 minute ago, DaatarBabu said: Magadheera story Rgv gaadu teeste itne teestadu exactly my thought... lol Quote
DaatarBabu Posted August 3, 2020 Report Posted August 3, 2020 Spirit of the Coin Game aadava kaka chinnappudu? @Silveradotwo Quote
Silveradotwo Posted August 3, 2020 Author Report Posted August 3, 2020 Just now, DaatarBabu said: Spirit of the Coin Game aadava kaka chinnappudu? @Silveradotwo Ledu naaku deyalu ante bayam Quote
DaatarBabu Posted August 3, 2020 Report Posted August 3, 2020 8 minutes ago, Silveradotwo said: Ledu naaku deyalu ante bayam First Anna vaallatho aadinappudu Ucha poyistaru... Candles petti, lights off chesi windows Anni esesi... Abbo saana kathal vuntay le... Coin move avuthundi anudu, madhyalo finger teeste deyyam pattestadi anudu... Memories! Quote
Silveradotwo Posted August 3, 2020 Author Report Posted August 3, 2020 Just now, DaatarBabu said: First Anna vaallatho aadinappudu Ucha poyistaru... Candles petti, lights off chesi windows Anni esesi... Abbo saana kathal vuntay le... Coin move avuthundi anudu, madhyalo finger teeste deyyam pattestadi anudu... Memories! Lol epudaina adava recently Quote
DaatarBabu Posted August 3, 2020 Report Posted August 3, 2020 Just now, Silveradotwo said: Lol epudaina adava recently Pilla baccha gaallaki telvaka pothe aadukovachu... ippudu antha Internet chusi aa blue whale games ee aadukudobbuthunnaru... Quote
Silveradotwo Posted August 3, 2020 Author Report Posted August 3, 2020 Just now, DaatarBabu said: Pilla baccha gaallaki telvaka pothe aadukovachu... ippudu antha Internet chusi aa blue whale games ee aadukudobbuthunnaru... Blue whale ban chesar Kada ,adhi mana mobile lo personal info tiskoni blackmail chesataru anthe kadha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.