snoww Posted August 1, 2020 Report Posted August 1, 2020 మూడు ముక్కలాట! అమరావతిని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో చంద్రబాబు ప్రభుత్వం రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం స్పష్టంగా, విపులంగా పేర్కొంది. ఇప్పుడు అందుకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయాలి. లేదా రైతులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, పైవ్రేటు సంస్థలకు గత ప్రభుత్వం అమరావతిలో ఎకరాకు 50 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వంతున కేటాయించింది. సగటున ఎకరాకు కోటి రూపాయలు అనుకున్నా, ఇందుకు మూడు రెట్లు, అంటే ఎకరానికి మూడు కోట్ల వంతున నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 33 వేల ఎకరాలకుగాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం సేకరించడం ఏంటి? అంటూ అప్పట్లో చాలా మంది రంకెలు వేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం 33 వేల ఎకరాల భూమి ఎడారిగా, శ్మశానంగా మారబోతున్నందున ఆనాడు గొంతెత్తినవారు కలుగుల్లో దాక్కోకుండా బయటకు వచ్చి రైతుల పక్షాన పోరాడాలి. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తే కమ్మ సామాజిక వర్గం వారు గరిష్ఠంగా లబ్ధి పొందుతారు అనే అభిప్రాయానికి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఒక పథకం ప్రకారం అమరావతిపై దుష్ప్రచారంచేశారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. అది అమరావతి కాదు భ్రమరావతి అని, కమ్మరావతి అని ప్రచారం చేశారు. దీనితో ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మి అమరావతితో మానసికంగా అనుసంధానం కాలేకపోయారు. కొందరి కోసమే అమరావతి అన్న భావన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించింది. ఫలితంగా అమరావతిని చంపుకోవడం వల్ల తామెంతగా నష్టపోతామో గుర్తించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలా? వద్దా? అనే ప్రశ్నను జగన్ అండ్ కో లేవదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించిన జగన్ ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలను ప్రోత్సహించడానికి కూడా వెనుకాడటం లేదు. Quote
No_body_friends Posted August 1, 2020 Report Posted August 1, 2020 mothaniki ap prajalu konda erri pappalu ayyaru antav Quote
snoww Posted August 2, 2020 Author Report Posted August 2, 2020 రెడ్డొచ్చె మొదలాడె అని ఎవరన్నారో కానీ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని కథ నిజంగానే మళ్లీ మొదటికొచ్చింది Quote
snoww Posted August 2, 2020 Author Report Posted August 2, 2020 Just now, snoww said: రెడ్డొచ్చె మొదలాడె అని ఎవరన్నారో కానీ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని కథ నిజంగానే మళ్లీ మొదటికొచ్చింది Deeni meaning endi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.