Jump to content

Recommended Posts

Posted
రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం: చంద్రబాబు

రాజధాని తరలింపుపై తెదేపా అధినేత వ్యాఖ్యలు

రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం: చంద్రబాబు

హైదరాబాద్‌: ఎన్నికల ముందు జగన్‌ ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్‌లో విలేకర్లతో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలను నమ్మించి ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వైకాపా నాయకులు ఎలా మాట తప్పారో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. జగన్‌, వైకాపా నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు. రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇవాళ జరుగుతోందని విమర్శించారు. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని పేర్కొన్నారు. రాజధానికి 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. మీరు చేసే పనులు సరైనవని అనిపిస్తే ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. ప్రజా ప్రయోజనాలను వదిలి నీచ రాజకీయాలను చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నీ మరిచిపోయి ఇవాళ మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికల ముందే చెప్పానని గుర్తు చేశారు. వేలాది మంది రైతులు రహదారులపై ఆందోళన చేస్తున్నారన్నారు.

అమరావతిపై ఎన్ని రకాలుగా మాట్లాడతారు?

అమరావతిపై మీరు ఎన్ని రకాలుగా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం.. రండి అని సవాల్‌ విసిరారు. రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలని చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా, కాంగ్రెస్‌ నేతలు జగన్‌ను నిలదీయాలన్నారు. అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పు అని హితవు పలికారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పారు. రాజధానిని మార్చే అధికారం మీకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పోరాటం ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. ఐదు కోట్ల మంది ప్రజలు మాతో కలిసి రావాలని కోరారు. నీతికి, నిజాయతీకి మారు పేరు.. విశాఖ వాసులు అని చెప్పారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించండి.. మా పదవులు వదిలేస్తామని వెల్లడించారు. 2014లో అన్యాయం జరిగింది, మళ్లీ మళ్లీ మోసపోవడం తగదని పేర్కొన్నారు. ఎక్కువ కరోనా కేసులు ఏపీలోనే నమోదుతున్నాయని తెలిపారు. కరోనా నివారణ చర్యలు వదిలి ఎదురుదాడిపై శ్రద్ధ ఏంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

రామాలయానికి భూమి పూజ శుభకరం

రామాలయం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని చంద్రబాబు తెలిపారు. రామాలయానికి భూమి పూజ చేయడం శుభకరమని చెప్పారు. 200 నదుల పవిత్ర జలాలతో భూమిపూజలు చేశారన్నారు. అమరావతిలోనూ 30 నదుల పుణ్య జలాలతో భూమి పూజ చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతికి అండగా ఉంటామని శంకుస్థాపన సమయంలో ప్రధాని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు.

Posted
3 minutes ago, RedThupaki said:

Vizaaggg la pavuralagutta ready chesthuntey nee baadha endhi ayya

Pavurallagutta pavurambraces_1

Posted
2 minutes ago, Silveradotwo said:

Pavurallagutta pavurambraces_1

Congraachulachans....vizag gonna get one idupulapaaya and one paavuralagutta.....dhaani oka statue......that's all....full development...

Posted
Just now, RedThupaki said:

Congraachulachans....vizag gonna get one idupulapaaya and one paavuralagutta.....dhaani oka statue......that's all....full development...

Yevaru patinchukovatledu akkada

Posted
36 minutes ago, Hydrockers said:

MLA post silent_I1

TDP president post ki kaada?

Posted
5 minutes ago, ariel said:

Sakshit a source@3$%

May this thumbnqil will.make yku happy bro enjoy

Posted

veedendi kudidilo padda eluka laga intha ginjukuntunnadu.. gattigane invest chesinattunadu bramaravatilo. 

Posted
1 minute ago, ChinnaBhasha said:

veedendi kudidilo padda eluka laga intha ginjukuntunnadu.. gattigane invest chesinattunadu bramaravatilo. 

Doubt aa

Nuziveedu side ani leak lu ichi yellow batch itu side konesaru

Posted
11 minutes ago, ariel said:

Sakshit a source@3$%

Not saakshit. Copied from dramoji eenadu. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...