Jump to content

Recommended Posts

Posted

చెప్పింది చేయకపోతే వైదొలగాలని మీరే అన్నారుగా..
సీఎం జగన్‌ను నిలదీసిన చంద్రబాబు
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించండి
మా పదవులూ మీకే ఇస్తాం
కేంద్రమూ జోక్యం చేసుకోవాలి
అయోధ్య సమస్యలానే పరిష్కారం చూపాలి: తెదేపా అధినేత. 

5ap-main7a_14.jpg

Posted

అసాధారణ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం చేసేది సరైన పని కాదని, పెట్టుబడిదారుల నమ్మకం పోతుందని చెప్పింది. అమరావతిలోనూ రైతులతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో కేంద్రానికీ బాధ్యత ఉంది. పీపీఏల్లో పెట్టుబడిదారులుంటే.. ఇక్కడ రైతులున్నారు. వారికి క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయింపుతో పాటు రాజధాని నిర్మాణానికి నిధులిచ్చారు.

Posted

ఈనాడు, అమరావతి: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అలా చేస్తే తమ శాసనసభ్యత్వాలనూ వదులుకుంటామని ప్రకటించారు. ‘ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని పదే పదే మాట్లాడి.. ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో అమరావతిని ఆవెెూదించారా.. లేదా?’ అని ప్రశ్నించారు. ‘చెప్పింది చేయకపోతే నిలదీయండి, రాజీనామా చేసి వెళ్లిపోతానని చెప్పిన మీరు (సీఎం).. మాట తప్పారు. ఇప్పుడు మరి రాజీనామా చేస్తారా? అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా?’ అని నిలదీశారు. ‘మాట తప్పడం ఇంటా వంటా లేదనే ఆయన.. ఎన్నికలంటే పారిపోయారు’ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బుధవారం సాయంత్రం వీడియో సమావేశం ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాత్రమే కాదు.. పలువురు వైకాపా నేతలూ రాజధాని విషయంలో ఎలా మాటమార్చారో వివరిస్తూ వీడియోలను ప్రదర్శించారు.

Posted

అమరావతిని సర్వనాశనం చేస్తారని అప్పుడే చెప్పా
వైకాపా అధికారంలోకి వస్తే అమరావతిని సర్వనాశనం చేస్తారని.. ఎన్నికలకు ముందే ప్రజలను హెచ్చరించానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘చట్టంలో ఉన్న ప్రకారం సుప్రీంకోర్టు ఆవెెూదంతో.. రాష్ట్రపతి ప్రకటన జారీచేయడంతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి శంకుస్థాపన చేశారు. అయినా హైకోర్టును మార్చేస్తామనడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో.. ఒక్కదాన్నీ ముందుకుతీసుకెళ్లలేకపోయారు, ఒక్క పనీ చేయలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. ‘విశాఖపట్నం వాసులు నీతి, నిజాయతీకి కట్టుబడతారు, ప్రశాంత జీవితం గడపాలనుకుంటారు. హుద్‌హుద్‌ సమయంలో నేను ఒక్క పిలుపిస్తే.. ముందుకొచ్చారు’ అని ప్రశంసించారు. ‘అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. రాజధాని అమరావతిలో ఉంటుందని అంతా కలిసి ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట కోసమే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం’ అని చెప్పారు

Posted

ప్రజలే మంచి చెడులు విశ్లేషించాలి
రాజధానిగా అమరావతే ఎందుకు ఉండాలి? దీనివల్ల లాభాలేంటో వివరిస్తూ పత్రాలు విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. వాటిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. ప్రజలు కూడా మంచి చెడుల్ని విశ్లేషించాలని కోరారు. ‘అంతా కలిసి పోరాడదాం.. అమరావతిని కాపాడుకుందాం’ అని విజ్ఞప్తి చేశారు

Posted

కార్యకర్తకున్న అవగాహన కూడా సీఎంకు లేదు
కరోనా వైరస్‌ విషయంలో వైకాపా కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా సీఎంకు లేకపోయిందని ధ్వజమెత్తారు. ‘తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని వారి పార్టీ కార్యకర్త ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తే.. ముఖ్యమంత్రి మాత్రం పారాసిటమాల్‌ తీసుకుంటే పోతుందని చెబుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులను ఉపయోగించి పెత్తనం చేయాలనుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలతో ఏడాది, రెండేళ్లలో ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు చాలా దేశాల్లో ఉన్నాయి. ఎన్నికల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు’ అని హెచ్చరించారు.

Posted

జగన్‌మోహన్‌రెడ్డికి కనువిప్పు కలగాలనే
‘జగన్‌మోహన్‌రెడ్డికి కనువిప్పు కలగాలనే.. ఆయన మాటల వీడియోలు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల్ని చూపిస్తున్నా’ అని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక ఎప్పుడేం చెప్పారో తెలియజేస్తూ.. వీడియో ప్రదర్శించారు.

Posted

అయోధ్య సమస్యను పరిష్కరించినట్లే.. ఇక్కడా

‘అయోధ్యలో రామాలయం సమస్యను పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి కూడా దేవతల రాజధాని. ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి మట్టిని, యమునా జలాలను తెచ్చి శంకుస్థాపన చేశారు. దేశమంతా అమరావతికి అండగా ఉంటుందని చెప్పారు. అయోధ్య సమస్య లాగే.. ఇక్కడా రైతుల సమస్య పరిష్కరించాలి’ అని చంద్రబాబు కోరారు.

Posted

మనం చెప్పింది నవరత్నాలే.. దశరత్నం చెప్పలేదు

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ వైకాపా కార్యకర్త మాట్లాడిన వీడియోను చంద్రబాబు చూపించారు. ‘రాజధాని విషయంలో ఆయన నిజాయతీగా మాట్లాడారు. ఆయన మాటలకు సమాధానం చెప్పండి’ అని సీఎంను డిమాండు చేశారు. అందులోని మాటల సారాంశం.. ‘‘ముఖ్యమంత్రి జగన్‌గారికి నమస్కారం. మీ అభిమానిగా.. ఓటు వేసిన వ్యక్తిగా అడుగుతున్నా. ఆరోజు మనం నవరత్నాలే చెప్పాం. దశరత్నం చెప్పలేదు. రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. వాళ్ల పాపం, ఉసురు మనకెందుకు? రాజధాని మూడు ముక్కలు చేస్తాం, తలకాయ ఇక్కడ పెడతాం.. మొండెం ఇక్కడ ఉంచుతామని ఆరోజు మనం అనలేదుగా? చిన్నవాడివైనా దండం పెడుతున్నానని ఆయన (చంద్రబాబు) వంద మెట్లు దిగారు. మీరు ఒక్క మెట్టు దిగండి సార్‌! మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. నేనొక మెకానిక్కును, పదో తరగతి చదివిన సామాన్యుడిగా చెబుతున్నా. పట్టుదలకు పోవద్దు.. మీకు చాలా సమస్యలున్నాయి. నవరత్నాలూ అమలు చేయాలి. మీకు కాలం కలిసి రావడం లేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఆలోచించండి.’

Posted
Just now, DaatarBabu said:

కార్యకర్తకున్న అవగాహన కూడా సీఎంకు లేదు
కరోనా వైరస్‌ విషయంలో వైకాపా కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా సీఎంకు లేకపోయిందని ధ్వజమెత్తారు. ‘తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని వారి పార్టీ కార్యకర్త ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తే.. ముఖ్యమంత్రి మాత్రం పారాసిటమాల్‌ తీసుకుంటే పోతుందని చెబుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులను ఉపయోగించి పెత్తనం చేయాలనుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలతో ఏడాది, రెండేళ్లలో ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు చాలా దేశాల్లో ఉన్నాయి. ఎన్నికల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు’ అని హెచ్చరించారు.

tenor.gif

  • Haha 1
Posted

day by day loosing chanikya panuki rqani strategies,  okapudu sketches masthu estynde 

Posted
Just now, MiryalgudaMaruthiRao said:

tenor.gif

Ooko Anna endi Musalayana meeda Nuvvu kuda... @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...