r2d2 Posted August 16, 2020 Report Posted August 16, 2020 చెన్నై: తమిళ హీరో విజయ్ నటించిన మెర్సెల్ (తెలుగులో ‘అదిరింది’) చిత్రంలో ఐదు రూపాయలకు వైద్యం అందించే పాత్ర అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు స్ఫూర్తి అయిన డాక్టర్ వి.తిరువెంగదం (70) ఇకలేరు. ఆయన కార్డియాక్ అరెస్టుతో చెన్నైలోని దక్షిణమధ్య రైల్వే ఆస్పత్రిలో శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గురువారం ఆయనకు ఛాతీలో నొప్పిగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. అయితే ఆయన కోలుకోవడంతో శనివారం డిశార్జి చేయాల్సి ఉందని, ఇంతలోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారు కూడా వైద్యవృత్తిలోనే స్థిరపడ్డారు.డాక్టర్ వి.తిరువెంగదం ఆయన తన పేరుతో కంటే ఐదు రూపాయల డాక్టరుగానే సమీప ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. 1973లో నార్త్ చెన్నైలోని వ్యాసరపాడి ప్రాంతంలో ఆయన తన వైద్య సేవలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం రూ.5కే వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రతిరోజూ ఆయన క్లినిక్ రోగులతో కిటకిటలాడేది. ఇప్పటి వరకు ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో కరోనా ప్రభావంతో మార్చిలో నెల రోజులు పాటు క్లినిక్ మూసేసినట్లు తెలిపారు. తన వద్దకు వచ్చే రోగులకు తన ఫోన్ నంబర్ ఇచ్చి ఎప్పుడు అవసరం ఉన్నా ఫోన్ చేయమని, ఫోన్లోనే రోగానికి అవసరమైన మందు దగ్గర్లోని మెడికల్ నుంచి తెచ్చుకొని వేసుకోవాలని చెప్తుండేవారని ఆయన కుమార్తె డాక్టర్ ప్రీతి తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందిన ఆయన మృతి ఎంతోమంది రోగులకు తీరని లోటని అన్నారు. ఆయన మృతికి తమిళనాడు సీఎం పళని స్వామి, ప్రతిపక్ష నేత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. Quote
futureofandhra Posted August 16, 2020 Report Posted August 16, 2020 1 minute ago, r2d2 said: చెన్నై: తమిళ హీరో విజయ్ నటించిన మెర్సెల్ (తెలుగులో ‘అదిరింది’) చిత్రంలో ఐదు రూపాయలకు వైద్యం అందించే పాత్ర అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు స్ఫూర్తి అయిన డాక్టర్ వి.తిరువెంగదం (70) ఇకలేరు. ఆయన కార్డియాక్ అరెస్టుతో చెన్నైలోని దక్షిణమధ్య రైల్వే ఆస్పత్రిలో శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గురువారం ఆయనకు ఛాతీలో నొప్పిగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. అయితే ఆయన కోలుకోవడంతో శనివారం డిశార్జి చేయాల్సి ఉందని, ఇంతలోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారు కూడా వైద్యవృత్తిలోనే స్థిరపడ్డారు.డాక్టర్ వి.తిరువెంగదం ఆయన తన పేరుతో కంటే ఐదు రూపాయల డాక్టరుగానే సమీప ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. 1973లో నార్త్ చెన్నైలోని వ్యాసరపాడి ప్రాంతంలో ఆయన తన వైద్య సేవలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం రూ.5కే వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రతిరోజూ ఆయన క్లినిక్ రోగులతో కిటకిటలాడేది. ఇప్పటి వరకు ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో కరోనా ప్రభావంతో మార్చిలో నెల రోజులు పాటు క్లినిక్ మూసేసినట్లు తెలిపారు. తన వద్దకు వచ్చే రోగులకు తన ఫోన్ నంబర్ ఇచ్చి ఎప్పుడు అవసరం ఉన్నా ఫోన్ చేయమని, ఫోన్లోనే రోగానికి అవసరమైన మందు దగ్గర్లోని మెడికల్ నుంచి తెచ్చుకొని వేసుకోవాలని చెప్తుండేవారని ఆయన కుమార్తె డాక్టర్ ప్రీతి తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందిన ఆయన మృతి ఎంతోమంది రోగులకు తీరని లోటని అన్నారు. ఆయన మృతికి తమిళనాడు సీఎం పళని స్వామి, ప్రతిపక్ష నేత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. thatha brathikithey nee laga brathakali love the service u rendered for the poor Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.