DaatarBabu Posted August 19, 2020 Report Posted August 19, 2020 . ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి కరోనా వారియర్స్‌తో చంద్రబాబు ఆన్లైన్ సమావేశం అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భయాన్ని అధిగమిస్తే కరోనాను జయించినట్లేనని, నమ్మకం పెంపొందించడం కూడా చికిత్సలో భాగం కావాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి పేర్కొన్నారు. కొవిడ్‌ను అరికట్టడంలో వైద్యులు, సమాజ సేవకులు, బాధితుల అనుభవాలు తెలుసుకోవడానికి కరోనా వారియర్లతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రికి చెందిన ప్రఖ్యాత వైద్యులు రామారెడ్డి.. కరోనాకు సంబంధించి మానసిక అంశాలపై మాట్లాడారు. ‘చాలా మందిలో ఉష్ణపక్షి తత్వం కనిపిస్తోంది. తొలుత కరోనా నా దాకా రాదనే అతి ధీమాతో ఉంటారు. కొంతకాలానికి అది పోయి భయం ఆవహిస్తోంది. అయితే, మనకేం కాదు అంటూ మనసుకు ఎప్పటికప్పుడు సానుకూల సంకేతాలుఇస్తుండాలి. దీన్ని అధిగమించగలం అనే నమ్మకం పెట్టుకున్నవారు తేలికగా కరోనా బారి నుంచి బయటకు వస్తున్నారు. ప్రాణాయామం వంటి శ్వాస సంబంధిత కార్యక్రమాలు చేస్తూ.. శుభ్రత, మాస్కులు, భౌతిక దూరం పాటించాలి’ అని సూచించారు. టీమ్‌గా ఉంటే భయం తగ్గింది: శివరాంప్రసాద్ ఆస్పత్రిలో తాము ఒక బృందంగా ఉండటం వల్ల భయం తగ్గిందని విజయవాడకు చెందిన రాజకీయ కార్యకర్త శివరాం ప్రసాద్ పేర్కొన్నారు. ‘మేం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరేటప్పుడే విడిగా ఒక గదిలో కాకుండా ఆరుగురు ఉన్న ఒక హాల్లో చేరాం. అందరం కరోనా ఉన్నవారమే కాబట్టి 10-15 మంది ఒకచోట చేరి కబుర్లు చెప్పుకొంటూ ఉత్సాహాన్ని పెంచుకొనేవాళ్లం. నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడే త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు నుంచి ఒక లేఖ అందింది. దానితో మరింత బలం వచ్చింది’ అని శివరాం ప్రసాద్ వివరించారు. రాజకీయాలకు అతీతంగా: బాబు ‘ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నాకేం పనని ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. వైద్యులు సహా వివిధ వర్గాల వారిని ఒక చోట సమావేశపర్చి వారి ద్వారా సమాజానికి అవసరమైన సమాచారాన్ని పంపిస్తున్నా. పలు అధ్యయనాలు చేసి కొన్ని సూచనలను కేంద్రానికి పంపుతున్నాం. కరోనా ఉధృతి తగ్గేవరకూ ప్రతి వారం ఇలాంటి ఆన్లైన్ సమావేశాలు నిర్వహించే ఆలోచన ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా సమస్య కొంత జటిలంగానే ఉందన్నారు. పది వేలకు పైగా కేసులు నమోదైన జిల్లాలు, నగరాలు దేశంలో 50 ఉంటే వాటిలో ఏపీ లోని మొత్తం 13 జిల్లాలూ ఉన్నాయని వివరించారు. Quote
Hydrockers Posted August 19, 2020 Report Posted August 19, 2020 రాజకీయ కార్యకర్త tdp కార్యకర్త ani veste poyedi ga Quote
reality Posted August 19, 2020 Report Posted August 19, 2020 ABN gadu ee bombhat elevations eppudu maanukuntado... chuth ki dakkan saale gadu... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.