Jump to content

Recommended Posts

Posted
స్వదేశీ ఉత్పత్తులే వాడండి: పవన్‌ పిలుపు

హైదరాబాద్‌: ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులే వాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. వినాయక చవితి నుంచి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పండుగ కోసం ఏ వస్తువు కొన్నా.. అది ఎక్కడ తయారైందో చూడాలన్నారు. మన ఉత్పత్తుల గిరాకీ కోసమే స్వదేశీ నినాదమని పవన్‌ స్పష్టం చేశారు.‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ నినాదం ఏ ఒక్క వర్గానికో కాదని.. దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించినదని చెప్పారు. 

మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి.. ఇదే ఆత్మనిర్భర భారత్‌ అని పవన్‌ అభివర్ణించారు. అందుకే ఈ వినాయక చవితి నుంచే ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని జనసేన-భాజపా సంయుక్తంగా నిర్ణయించాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ విడుదల చేసింది.

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...