dasari4kntr Posted August 22, 2020 Report Posted August 22, 2020 నమస్తే తెలంగాణ - ముల్కనూరు ప్రజాగ్రంథాలయం [ముల్కనూరు, భీమదేవరపల్లి(మం), వరంగల్ అర్బన్ జిల్లా] సంయుక్త నిర్వహణలో పోటీ ప్రధాన ఉద్దేశం సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన వైవిధ్యాల, వైరుధ్యాల నేపథ్యంలో కథ ఉండాలి. నవ్యతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసే కథలకు మాత్రమే ఆహ్వానం పలుకుతున్నాం. పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన 22 కథలనుఎంపిక చేస్తాం. బహుమతి పొందిన కథలు నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో ప్రచురితం అవుతాయి. పది కథలను సాధారణ ప్రచురణ కోసం స్వీకరిస్తాం. ఈ కథలకు వెయ్యి రూపాయలతోపాటు,జ్ఞాపికలు అందజేస్తాం. బహుమతి పొందిన కథలు పుస్తక రూపంలో కూడా అచ్చు వేసే అధికారం పోటీ నిర్వాహకులకు ఉంటుంది. ప్రథమ బహుమతి (ఒక్కరికి) రూ. 50,000 ద్వితీయ బహుమతులు ఇద్దరికి (ఒక్కొక్కరికి) రూ. 25,000 తృతీయ బహుమతులు ముగ్గురికి(ఒక్కొక్కరికి) రూ. 10,000 కన్సొలేషన్ బహుమతులు ఆరుగురికి(ఒక్కొక్కరికి) రూ. 5,000 నియమ నిబంధనలు ఇంతకు ముందు ఎక్కడా (ప్రింట్ పత్రికలలో గానీ, వెబ్ పత్రికలలో గానీ, వ్యక్తిగత బ్లాగులలో గానీ, సోషల్ డియాలోగానీ) ప్రచురితం కాని కథలను మాత్రమే పోటీకి పంపాలి. ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం. పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి. ప్రచురణకు అంగీకరించని రాతప్రతులను తిరిగి పంపడం సాధ్యం కాదు. ఒకరు ఎన్ని కథలైనా పంపొచ్చు. రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత / రచయిత్రి అసలు పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి. కథ అనువాదంగానీ, అనుకరణగానీ, అనుసరణకానీ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి. పోటీలో ఏ బహుమతి పొందిన కథనైనా, ఫలితాలు వెలువడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశం కథా రచయితలకు లేదని గమనించగలరు. బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. రచయితలకు ప్రాంతీయ భేదం లేదు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కథలు పంపవచ్చు. విజేతలకు ముల్కనూరులో బహుమతుల ప్రదాన కార్యక్రమం ఉంటుంది. కథలపోటీ ఫలితాలు నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రచురితం అవుతాయి. పంపాల్సిన విధానం రాత ప్రతి అయితే కథ 12 పేజీలు మించకుండా ఉండాలి. ఈ-మెయిల్ ద్వారా పంపేవారు యూనికోడ్‌లో వర్డ్‌ఫైల్ పంపవచ్చు. దాన్ని పీడీఎఫ్‌లోకి కూడా మార్చి ఎటాచ్ చేయాలి. పేజ్‌మేకర్‌లో డీటీపీ చేయించి కథను పంపేవారు పీఎమ్‌డీ ఫైల్‌ను, పీడీఎఫ్‌ను కూడా జత చేసి ఆ రెండింటినీ ఈ-మెయిల్‌లో ఎటాచ్ చేసి పంపాలి. డీటీపీ, వర్డ్‌ఫైల్ ఏ4 సైజులో 14 నుంచి 16 ఫాంట్‌లో నాలుగు, ఐదు పేజీలకు మించకూడదు. పదాల్లో అయితే కథ 1500 పదాలకు మించకూడదు. హామీపత్రం జత చేయడం మర్చిపోవద్దు. కథల ప్రతులపైన రచయిత / రచయిత్రి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రం పైన మాత్రమే పేరు ఉండాలి. కథలు పంపాల్సిన చిరునామా బతుకమ్మ కథలపోటీ, నమస్తే తెలంగాణ # 8-2-603/1/7, 8, 9, రోడ్ నంబర్ 10, బంజారాహిల్స్, హైదరాబాద్ 500 034. మీ కథలు పంపాల్సిన ఈ -మెయిల్ ఐడీ : [email protected] కథలు మాకు అందాల్సిన చివరి తేదీ : ఆగస్టు 31, 2020 https://www.ntnews.com/telangana/namasthe-telangana-story-writing-competition-2020-66234 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.